Jubliee hills club
-
ఏపీ మాజీమంత్రి పత్తిపాటి సతీమణిపై ఫిర్యాదు
బంజారాహిల్స్: ఏపీ మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు సతీమణి తేనె వెంకాయమ్మపై భూకబ్జాకు సంబంధించి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి ఎ.మురళీముకుంద్ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44లో తమ సొసైటీకి చెందిన భూమిని కబ్జా చేశారని జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదివారంరాత్రి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్లాట్ నంబర్ 853/ఎఫ్‌లోని 1,519 గజాల స్థలంపై కొంతకాలంగా వివాదం నడుస్తోందని, అది తమదేనంటూ వెంకాయమ్మ వాదించడమే కాకుండా ఆమె అనుచరులు సొసైటీకి చెందిన బోర్డును కూడా తొలగించారని ఆరోపించారు. బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తూ స్థలాన్ని కబ్జా చేసేందుకు వెంకాయమ్మ, ఆమె అనుచరులు ప్రయత్నిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకో వాలని ఆయన కోరారు. అక్రమంగా ఈ ప్లాట్ పొందిన సీహెచ్ శిరీష దీనిని పి.శ్రీహరికి గిఫ్ట్ డీడ్ చేశారని, మళ్లీ శ్రీహరి 2020 డిసెంబర్ 31న ఎల్లోస్టోన్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్న పత్తిపాటి వెంకాయమ్మకు ఏజీపీఏ చేసినట్లు తెలుస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్లాట్ వ్యవహారం అటు న్యాయ స్థానం లోనూ, ఇటు జూబ్లీహిల్స్ పోలీసుల విచారణలో ఉండగా తాజాగా వెంకాయమ్మ రంగప్రవేశంతో మరింత ఆసక్తికరంగా మారింది. -
జూబ్లీహిల్స్ సొసైటీలో అవకతవకలపై చర్యలు తీసుకోవాలి: కేతిరెడ్డి
హైదరాబాద్: జూబ్లీహిల్స్ సొసైటీలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ జరిపించాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రపదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును కోరారు. కొంతమంది పెద్దలు మీడియాను అడ్డంపెట్టుకొని, ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తాము ఏమిచేసిన అడిగేవారే ఎవరు లేరనే నెపంతో సొసైటీలో భారీ కుంభకోణాలను చేస్తూ.. అటు ప్రభుత్వాన్ని, ఇటు సొసైటీ సభ్యులను వంచిస్తున్నారని కేతిరెడ్డి ఆరోపించారు. బినామీల పేర్లతో ఉన్న అన్ని లావాదేవిలను వెంటనే రద్దు చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ‘సొసైటీలో ఒక వ్యక్తికి ఒక ఫ్లాట్ మాత్రమే’ నిబంధనను ఉల్లంఘించి ఎన్నో ఫ్లాట్స్ కలిగివున్న బడా బాబుల నిజస్వరూపంపై కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయించాలన్నారు. జూబ్లీహిల్స్ సొసైటీ పరిధిలోని పార్కుల కోసం మాస్టర్ ప్లాన్‌లో వదిలిన ఖాళీ స్థలాలను కూడా వదలకుండా క్రయవిక్రయాలను జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వేల కోట్లను దోచుకున్న వారిని వెంటనే కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టాలని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి, రాష్ట గవర్నర్, ముఖ్యమంత్రి, తెలంగాణ హైకోర్టు ప్రధాన నాయమూర్తికి కేతిరెడ్డి లేఖలు రాశారు. ప్రధానికి రాసిన లేఖలో సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. అంతేకాకుండా త్వరలో ఢిల్లీ లో న్యాయపోరాటం చేస్తానని, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు తెలిపారు. చదవండి: ప్రజారోగ్యాన్ని రాష్ట్రాలకు వదిలేయడం సరికాదు: కేతిరెడ్డి -
మద్యం మత్తులో క్లబ్‌పై యువకుల వీరంగం
-
జూబ్లీహిల్స్ క్లబ్‌పై యువకుల వీరంగం
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ క్లబ్‌పై బుధవారం అర్ధరాత్రి కొందరు యువకులు వీరంగం సృష్టించారు. క్లబ్ బంద్ చేయడంతో ఆగ్రహించిన యువకులు క్లబ్ సిబ్బందిపై దాడి చేశారు. క్లబ్ సమయం ముగిసిందని అక్కడి సిబ్బంది నచ్చచెప్పే ప్రయత్నం చేసినా.. వినిపించుకోని యవకులు మద్యం మత్తులో విచక్షణ లేకుండా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. దాడికి పాల్పడిన యువకులపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగినట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జూబ్లీహిల్స్ క్లబ్‌పై యువకుల వీరంగం