JuD chief Hafiz Saeed threatens
-
పాక్‌ను చావుదెబ్బ కొట్టిన భారత్
-
పాక్‌ను చావుదెబ్బ కొట్టిన భారత్
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజం ముందు భారత్ మరోసారి దోషిగా నిలబెట్టింది. ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఆర్థిక, ఆయుధ సహకారంపై అంతర్జాతీయ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా ఆస్తులను తక్షణమే సీజ్ చేయాలని ఎఫ్ఏటీఎఫ్ స్పష్టం చేసింది. లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవాలు భారత్‌లో చేస్తున్న ఉగ్రవాద చర్యలపైనా సదరు సంస్థ పాకిస్తాన్‌ను ప్రశ్నించింది. లష్కరేతోయిబా, జమాత్ ఉద్ దవాతో పాటు, ఇతర ఉగ్రవాద సంస్థలపై తీసుకున్న చర్యలను 2018 ఫిబ్రవరిలో లోపు తమకు నివేదించాలని ఎఫ్ఏటీఎఫ్ పాకిస్తాన్‌ను ఆదేశించింది. అర్జెంటీనాలోని బ్యూసన్ ఎయిర్స్ నగరంలో ఎఫ్ఏటీఎఫ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ రివ్యూ మీటింగ్(ఐఎస్ఆర్జీ) నెల 2, 3 తేదీల్లో జరిగింది. ఈ సమావేశంలో పాకిస్తాన్ కేంద్రగా ఉగ్రవాద సంస్థలు, వాటికి ఆదేశం అందిస్తున్న ఆర్థిక సహకారం భారత్ ప్రశ్నించింది. భారత్ ప్రశ్నలను అడ్డుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ఈ సందర్భంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద కేంద్రాలపై ఎఫ్టీపీఎస్ రూపొందించిన నివేదికను ఐఎస్ఆర్జీకి సమర్పించింది. ఈ సమావేశంలో స్పెయిన్ ఇతర సభ్య దేశాలు పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు.. ఆర్థిక ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశాయి. మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్.. ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రయత్నాలకు చైనా అడ్డుపడ్డ సంగతి తెలిసింది. ఇది జరిగిన రెండు రోజులకే అంతర్జాతీయ సంస్థ ఎఫ్ఏటీఎఫ్ ఇలా పేర్కొనడంపై భారత్ హర్షం వ్యక్తం చేసింది. -
భారత్ నిజాన్నిదాచింది..!
సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిందంటూ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చేసిన ప్రకటన అంతా పెద్ద డ్రామా అని పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ చీఫ్, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ పేర్కొన్నాడు. ఉడీ ఆర్మీ స్థావరంపై కాశ్మీరీ ముజాహిదీన్ నిర్వహించిన దాడుల్లో సుమారు 177 మంది వరకూ ఆర్మీ జవాన్లు చనిపోయారని, అయితే భారత్ మాత్రం కేవలం 19 మంది చనిపోయినట్లు ప్రకటించిందని అతడు వెల్లడించాడు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడం అంతా బూటకమంటూ ముంబై దాడి సూత్రధారి హఫీజ్ సయీద్ కొట్టిపారేశాడు. భారత్ పై పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంటే ఎలా ఉంటుందో త్వరలోనే చూస్తారు అంటూ హఫీజ్ సయీద్ హెచ్చరికలు జారీ చేశాడు.శుక్రవారం ఫైజలాబాద్ లో నిర్వహించిన ఓ సమావేశంలో హఫీజ్ భారత్ పై బెదిరింపులకు పాల్పడ్డాడు. పాకిస్థాన్ తల్చుకుంటే అగ్ర దేశం అమెరికా కూడా అడ్డుకోలేదని, భారత్ కు సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏమిటో చూపించేందుకు పాకిస్థాన్ ఆర్మీకి ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నిరకాలుగా అనుమతులు ఇవ్వాలని అతడు కోరాడు. కాశ్మీరీలను చంపినప్పుడు ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉండిపోయిందని, కాశ్మీరీ ముజాహిదీన్ ఉడీలో దాడులు నిర్వహిస్తే మాత్రం ఆమెరికాతో పాటు అన్ని దేశాలు ఎందుకు మేల్కొన్నాయంటూ ప్రశ్నించిన హఫీజ్... జూలై 8న జరిగిన ఎన్ కౌంటర్ లో హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్ బుర్హాన్ వని మరణమే కాశ్మీర్ వ్యాలీలో అశాంతికి కారణమైందన్నాడు. ఉరీ దాడిలో సైనికాధికారులు, మేజర్లతో కలిపి మొత్తం 177 మంది మరణించగా అనేకమంది గాయపడ్డారని, అయితే భారత్ నిజాన్ని కప్పిపుచ్చి.. కేవలం 19 మంది జవాన్లు మాత్రమే మృతి చెందినట్లు ప్రకటించిందని హఫీజ్ పేర్కొన్నాడు. కేవలం ప్రతీకారాన్ని ప్రకటించడంకోసం భారత్ ఎల్వోసీ దాటిందని, దానికి పాకిస్థాన్ నుంచి తగిన స్పందన త్వరలో ఎదుర్కోక తప్పదని హఫీజ్ సయీద్ తన ప్రసంగంలో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో భారత్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ ఆర్మీకి పూర్తిశాతం అనుమతులు ఇవ్వాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ను కోరాడు.