అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్ నగరంలో ఎఫ్‌ఏటీఎఫ్ సమావేశ దృశ్యం
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజం ముందు భారత్ మరోసారి దోషిగా నిలబెట్టింది. ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఆర్థిక, ఆయుధ సహకారంపై అంతర్జాతీయ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా ఆస్తులను తక్షణమే సీజ్ చేయాలని ఎఫ్‌ఏటీఎఫ్ స్పష్టం చేసింది. లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవాలు భారత్‌లో చేస్తున్న ఉగ్రవాద చర్యలపైనా సదరు సంస్థ పాకిస్తాన్‌ను ప్రశ్నించింది. లష్కరేతోయిబా, జమాత్ ఉద్ దవాతో పాటు, ఇతర ఉగ్రవాద సంస్థలపై తీసుకున్న చర్యలను 2018 ఫిబ్రవరిలో లోపు తమకు నివేదించాలని ఎఫ్‌ఏటీఎఫ్ పాకిస్తాన్‌ను ఆదేశించింది.
అర్జెంటీనాలోని బ్యూసన్ ఎయిర్స్ నగరంలో ఎఫ్‌ఏటీఎఫ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ రివ్యూ మీటింగ్(ఐఎస్‌ఆర్‌జీ) నెల 2, 3 తేదీల్లో జరిగింది. ఈ సమావేశంలో పాకిస్తాన్ కేంద్రగా ఉగ్రవాద సంస్థలు, వాటికి ఆదేశం అందిస్తున్న ఆర్థిక సహకారం భారత్ ప్రశ్నించింది. భారత్ ప్రశ్నలను అడ్డుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ఈ సందర్భంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద కేంద్రాలపై ఎఫ్‌టీపీఎస్ రూపొందించిన నివేదికను ఐఎస్‌ఆర్‌జీకి సమర్పించింది. ఈ సమావేశంలో స్పెయిన్ ఇతర సభ్య దేశాలు పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు.. ఆర్థిక ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశాయి.
మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్.. ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రయత్నాలకు చైనా అడ్డుపడ్డ సంగతి తెలిసింది. ఇది జరిగిన రెండు రోజులకే అంతర్జాతీయ సంస్థ ఎఫ్‌ఏటీఎఫ్ ఇలా పేర్కొనడంపై భారత్ హర్షం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment