Lashkar e toiba
-
పాక్‌లోనే బుఖారీ హత్యకు కుట్ర
శ్రీనగర్: రైజింగ్ కశ్మీర్ ఎడిటర్ ఇన్ చీఫ్ షుజాత్ బుఖారి హత్యకు పాకిస్తాన్‌లోనే కుట్ర జరిగిందని కశ్మీర్ ఐజీ స్వయంప్రకాశ్ పానీ తెలిపారు. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తోయిబా బుఖారి హత్యకు పథకరచన చేసిందన్నారు. బుఖారి హత్యకు పాకిస్తాన్‌లోనే కుట్ర జరిగిందనటానికి తమవద్ద గట్టి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. లష్కరే తోయిబాకు చెందిన నవీద్ జాట్, ముజఫర్ అహ్మద్, ఆజాద్ మాలిక్ అనే ఉగ్రవాదులు బుఖారీని తుపాకీతో కాల్చిచంపారని పానీ వెల్లడించారు. బుఖారీ హత్య జరిగిన కొద్దిసేపటికే పాకిస్తాన్‌కు చెందిన ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల ద్వారా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభమైందని తెలిపారు. గతేడాది మార్చిలో పాకిస్తాన్‌కు పారిపోయిన సాజద్ గుల్ ఈ ప్రచారానికి తెరలేపాడన్నారు. సర్వీస్ ప్రొవైడర్లు అందించిన వివరాల ప్రకారం సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన కామెంట్లు పాకిస్తాన్ నుంచి వచ్చినట్లుగా తేలిందన్నారు. 2003, 2016లో ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి రెండు సార్లు అరెస్టయినప్పటికీ గుల్ అక్రమ మార్గాల్లో పాస్‌పోర్టును సంపాదించగలిగాడని వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసేందుకు వీలుగా నాన్‌బెయిలబుల్ వారంట్ కోసం కోర్టును ఆశ్రయిస్తామని పానీ తెలిపారు. -
పాక్‌ను చావుదెబ్బ కొట్టిన భారత్
-
పాక్‌ను చావుదెబ్బ కొట్టిన భారత్
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజం ముందు భారత్ మరోసారి దోషిగా నిలబెట్టింది. ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఆర్థిక, ఆయుధ సహకారంపై అంతర్జాతీయ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా ఆస్తులను తక్షణమే సీజ్ చేయాలని ఎఫ్ఏటీఎఫ్ స్పష్టం చేసింది. లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవాలు భారత్‌లో చేస్తున్న ఉగ్రవాద చర్యలపైనా సదరు సంస్థ పాకిస్తాన్‌ను ప్రశ్నించింది. లష్కరేతోయిబా, జమాత్ ఉద్ దవాతో పాటు, ఇతర ఉగ్రవాద సంస్థలపై తీసుకున్న చర్యలను 2018 ఫిబ్రవరిలో లోపు తమకు నివేదించాలని ఎఫ్ఏటీఎఫ్ పాకిస్తాన్‌ను ఆదేశించింది. అర్జెంటీనాలోని బ్యూసన్ ఎయిర్స్ నగరంలో ఎఫ్ఏటీఎఫ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ రివ్యూ మీటింగ్(ఐఎస్ఆర్జీ) నెల 2, 3 తేదీల్లో జరిగింది. ఈ సమావేశంలో పాకిస్తాన్ కేంద్రగా ఉగ్రవాద సంస్థలు, వాటికి ఆదేశం అందిస్తున్న ఆర్థిక సహకారం భారత్ ప్రశ్నించింది. భారత్ ప్రశ్నలను అడ్డుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ఈ సందర్భంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద కేంద్రాలపై ఎఫ్టీపీఎస్ రూపొందించిన నివేదికను ఐఎస్ఆర్జీకి సమర్పించింది. ఈ సమావేశంలో స్పెయిన్ ఇతర సభ్య దేశాలు పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు.. ఆర్థిక ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశాయి. మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్.. ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రయత్నాలకు చైనా అడ్డుపడ్డ సంగతి తెలిసింది. ఇది జరిగిన రెండు రోజులకే అంతర్జాతీయ సంస్థ ఎఫ్ఏటీఎఫ్ ఇలా పేర్కొనడంపై భారత్ హర్షం వ్యక్తం చేసింది. -
ఆ పదిమందిలో ముగ్గురిని మట్టుబెట్టారు!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి కొన్నిరోజుల కిందట భారత్‌లోకి ప్రవేశించిన 10 మంది ఉగ్రవాదుల జాడను భద్రతా దళాలు పశ్చిమ భారతంలో గుర్తించినట్టు సమాచారం. ఆ పదిమంది ఉగ్రవాదుల్లో ముగ్గురిని గుర్తించి భద్రతా దళాలు మట్టుబెట్టాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శివరాత్రి సందర్భంగా 26/11 ముంబై దాడుల తరహాలో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంపై ఉగ్రవాద దాడికి వారు వ్యూహరచన చేశారని ఆ వర్గాలు చెప్పాయి. పదిమంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు గుజరాత్‌లోకి ప్రవేశించారని, వారు దేశ రాజధాని న్యూఢిల్లీపై దాడి చేసే అవకాశముందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు ఢిల్లీలో తలదాచుకొని ఉంటారని ఐబీ అప్పట్లో పేర్కొంది. భారత్‌లోకి పది మంది ఉగ్రవాదులు ప్రవేశించారని పాకిస్థాన్ జాతీయ భద్రత సలహాదారు నాసిర్ ఖాన్ జాంజువా మొదట భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు సమాచారమిచ్చారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు గుజరాత్‌తోపాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని జాంజువా తెలిపారు. ఈ సమాచారంతో అప్రమత్తమైన నిఘా వర్గాలు, భద్రతా దళాలు ఢిల్లీ, గుజరాత్‌తోపాటు దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు పశ్చిమ భారతంలో ఆ పదిమంది ఉగ్రవాదుల జాడను కనిపెట్టి.. అందులో ముగ్గురిని హతమార్చినట్టు సమాచారమందుతున్నది. -
‘షరియా’ కోసం హఫీజ్ ఉద్యమం
లాహోర్: పాక్‌లో ఐక్యమత్యం నెలకొల్పడం, షరియా చట్టాల అమలు కోసం నిషేధిత జమాతే ఉద్ దవా అధినేత, లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ సోమవారం కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. షరియా చట్టాల అమలు లక్ష్యంగా తాను ఈ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు చౌబుర్జీలో జరిగిన సమావేశంలో ప్రకటించారు. ఐక్యతా సందేశాన్ని పీవోకేసహా పాక్అంతటా తీసుకెళ్లాలని కార్యకర్తలను కోరారు. ఆయా ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని, ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొనేలా చూడాలన్నారు. షరియా వస్తే సమస్యలతో కొట్టుమిట్టాడే పాక్ ఒక మోడల్‌గా నిలుస్తుందని, పాక్ నుంచి వేరుపడిన బంగ్లాదేశ్ తిరిగి పాక్‌లో కలిసే అవకాశం ఉందని హఫీజ్ పేర్కొన్నారు. -
పట్టుపడితే పిల్లలమని చెప్పండి..
కేడర్‌కు నూరిపోస్తున్న లష్కరే తోయిబా శ్రీనగర్/న్యూఢిల్లీ: భద్రతా దళాలకు పట్టుబడితే మీ వయసు 18 ఏళ్లు లోపేనని చెప్పండి.. కఠిన శిక్షల నుంచి తప్పించుకోండి.. తన కేడర్‌కు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా జారీ చేసిన ఆదేశమిదీ. గత నెలలో దక్షిణ కాశ్మీర్లో భద్రతా దళాలకు పట్టుపడిన మహమ్మద్ నవీద్ జట్ అలియాస్ అబు హంజాలా అనే యువకుడిని విచారించినప్పుడు ఈ విషయం వెల్లడైంది. పాక్‌లోని ముల్తాన్వాసి అయిన జట్ను భద్రతా దళాలు విచారించినప్పుడు తన వయసు 17 ఏళ్లని చెప్పాడు. నిజానికి అతని వయసు 22 ఏళ్లు. పదేపదే ప్రశ్నించిన మీదట అతను.. లష్కరే ఎత్తుగడను వివరించాడు. 18 ఏళ్లలోపు వయసని చెప్పడం వల్ల భారత్‌లో బాలనేరస్తుల చట్టం కింద విచారిస్తారని, తద్వారా భారత శిక్షాస్మృతి పరిధి నుంచి తప్పించుకోవచ్చని లష్కరే బాస్‌లు నూరిపోసినట్టు తెలిపాడు. నిధులు సమకూర్చా..: మరోవైపు భారత సంతతి అమెరికన్ గుఫ్రాన్ అహ్మద్ కౌసర్ మహమ్మద్ (31) అల్‌కాయిదా అనుబంధ సంస్థలకు నిధులు సమకూర్చినట్టు శనివారం అమెరికా కోర్టులో అంగీకరించాడు. కౌసర్ కెన్యాకు చెందిన సయ్యిద్తో కలసి సిరియా, సోమాలియాలోని అల్ కాయిదా గ్రూపులకు 25 వేల డాలర్లు సమకూర్చారు. ఇరాక్ మిలిటెంట్ల చేతికి మరో రెండు పట్టణాలు బాగ్దాద్: ఇరాక్ సున్నీ మిలిటెంట్లు ఆదివారం బాగ్దాద్‌కు 80 కి.మీ దూరంలోని దులూయా పట్టణంతోపాటు మరో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇరాక్, సిరియాల్లో పేట్రేగుతున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ద లెవాంట్ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీకి పాకిస్థాన్‌కు చెందిన తెహ్రీక్-ఎ-ఖిలాఫత్ ఉగ్రవాద మద్దతు ప్రకటించింది. మరోవైపు అఫ్ఘానిస్థాన్‌లో శని, ఆదివారాల్లో భద్రతా బలగాలు వివిధ చోట్ల జరిపిన దాడుల్లో 77 మంది మిలిటెంట్లు హత్యమయ్యారని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. -
పాక్ ఉగ్రవాద సంస్థ జమాతుద్దావాను నిషేధించిన అమెరికా
అమెరికా ప్రభుత్వం పాక్ ఉగ్రవాద సంస్థ జమాతుద్దావాను నిషేధించింది. జమాతుద్దావా లష్కరే తోయబా కి మాతృసంస్థ. ముంబాయి లో 26/11 దాడులకు లష్కర్ సంస్థే కారణం. ఈ నిషేధం లష్కర్ తో ముడిపడి ఉన్న జమాతుద్దవా సహా అల్ అన్ ఫల్, తహరీకె హుర్మతె రసూల్, తహరీకె తహఫూజ్ కిబ్లా అవ్వల్ వంటి సంస్థలకు కూడా వర్తిస్తుంది. ఈ నిషేధం వల్ల ఈ సంస్థకు వచ్చే నిధులు ఆగిపోతాయి. దీని కార్యకర్తలపై చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఇటీవలే అఫ్గనిస్తాన్ లోని హెరాత్ లో భారత రాయబార కార్యాలయంపై జరిగిన దాడికి కూడా లష్కర్ కారణమని అమెరికా ప్రకటించింది. ఈ నిషేధం భారతదేశానికి ఒక ముఖ్యమైన దౌత్య విజయంగా భావించవచ్చు. భారత్ లష్కర్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడమే కాక, ఆ సంస్థ అధినేత హాఫెజ్ సయీద్ ను భారత దేశానికి 26 మంది ప్రధాన శత్రువుల్లో ఒకరిగా ప్రకటించింది. హాఫెజ్ ను తమకు ఇవ్వమని భారత్ పాకిస్తాన్ ను ఎప్పటి నుంచో కోరుతోంది. జమాతుద్దావాను నిషేధించాలని ఎప్పట్నుంచో భారత్ ఒత్తిడి తెస్తోంది.