‘షరియా’ కోసం హఫీజ్ ఉద్యమం
లాహోర్: పాక్‌లో ఐక్యమత్యం నెలకొల్పడం, షరియా చట్టాల అమలు కోసం నిషేధిత జమాతే ఉద్ దవా అధినేత, లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ సోమవారం కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. షరియా చట్టాల అమలు లక్ష్యంగా తాను ఈ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు చౌబుర్జీలో జరిగిన సమావేశంలో ప్రకటించారు. ఐక్యతా సందేశాన్ని పీవోకేసహా పాక్‌అంతటా తీసుకెళ్లాలని కార్యకర్తలను కోరారు. ఆయా ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని, ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొనేలా చూడాలన్నారు. షరియా వస్తే సమస్యలతో కొట్టుమిట్టాడే పాక్ ఒక మోడల్‌గా నిలుస్తుందని, పాక్ నుంచి వేరుపడిన బంగ్లాదేశ్ తిరిగి పాక్‌లో కలిసే అవకాశం ఉందని హఫీజ్ పేర్కొన్నారు.