న్యాయమూర్తుల సంతకాలు ఫోర్జరీ!
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ న్యాయమూర్తుల సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఉపేంద్ర, బాక్సర్ బంగార్రాజు, పవన్ కుమార్ అనే ముగ్గురిని కటకటాల వెనక్కి నెట్టారు.
ఉద్యోగాలు ఇప్పించే పేరుతో ఏకంగా న్యాయమూర్తుల సంతకాలనే ఫోర్జరీ చేసి నకిలీ సంతకాలతో ఉత్తర్వులు ఇచ్చిన వైనం తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. నిందితుల నుంచి సెల్ఫోన్లు, ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు.