తీర్పుల్లో వేగమేది?: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలో కోర్టు తీర్పుల మందగమనంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తీర్పులు ఆలస్యమవుతుండటం మంచి పాలన అందించేందుకు మంచి సంకేతం కాదని అభిప్రాయపడింది. క్రిమినల్ కేసు తీర్పుల్లో వేగం పెంచడానికి 4 వారాల్లో ఒక విధాన రూపకల్పన చేయాలని శుక్రవారం కేంద్రాన్ని కోరింది. ఇందుకోసం మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సుప్రీం ధర్మాసనం తెలిపింది.
‘క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ వేగంగా కదలాలంటే మరిన్ని కోర్టులు, మెరుగుపరిచిన మౌలికవసతులు కావాలి’ అని జస్టిస్ లోధా అన్నారు. అన్ని విభాగాల్లోనూ ఫాస్ట్ ట్రాక్ తీర్పులు అవసరమని ధర్మాసనం చెప్పింది. ఎంపిల పై ఉన్న క్రిమినల్ కేసులను వేగంగా పూర్తి చేయాలని ప్రధాని మోడీ కోరడాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీం తన అభిప్రాయం వెలిబుచ్చింది.