'మంత్రి అవినీతి బాగోతాన్ని బయటపెడతా'
హైదరాబాద్: తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అవినీతి బాగోతాన్ని త్వరలో ఆధారాలతో సహా బయటపెడతానని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్లో నెంబర్‌వన్ అసమర్థ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి' అని ఎద్దేవా చేశారు. న్యాయవాదులు, న్యాయాధికారుల సమస్యలు పరిష్కరించడంలో న్యాయశాఖ మంత్రి విఫలమయ్యారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.