JUDO Federation
-
అంతర్జాతీయ జూడో సమాఖ్య నుంచి పుతిన్ వెలి
ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అంతర్జాతీయ సమాజమంతా గుర్రుగా ఉంది. తాజాగా అంతర్జాతీయ జూడో సమాఖ్య (ఐజేఎఫ్) పుతిన్‌ను వెలివేసింది. ఆయన ఐజేఎఫ్‌లో గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. ఇంతకుముందే పుతిన్‌ను సస్పెండ్ చేసిన ఐజేఎఫ్ ఇప్పుడు ఆయనను శాశ్వతంగా తొలగించింది. పుతిన్ సన్నిహితుడు ఆర్కడి రోటెన్‌బర్గ్‌ను సైతం ఐజేఎఫ్ విడిచి పెట్టలేదు. ఐజేఎఫ్ అన్ని హోదాల నుంచి వీరిద్దరిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. -
పుతిన్‌కు జూడో ఫెడరేషన్ షాక్!
International Judo Federation: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఉక్రెయిన్ యుద్దం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమాత్రం తగ్గట్లేదు. ఒక వైపు చర్చలకు సిద్ధమంటునే.. రష్యా దళాలు భీకర దాడులు జరుపుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పటి నుంచి వందల మంది పౌరులు మరణించినట్లు తెలుస్తోంది. మరోవైపు రష్యా కూడా తీవ్రంగా నష్టపోతోంది. ఈ యుద్దంలో ఉక్రెయిన్‌కు క్రీడాలోకం మద్దతుగా నిలుస్తోంది. కాగా ఇప్పటికే సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరగాల్సిన యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్ ఫైనల్‌ను యూరోపియన్ ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ రద్దు చేసింది. ఇది ఇలా ఉంటే.. అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు భారీ షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్‌ను పాలకమండలి సస్పెండ్ చేసింది. "రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో... అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ అధ్యక్షుడిగా,రాయబారిగా వ్లాదిమిర్ పుతిన్ హోదాను సస్పెండ్ చేస్తున్నాం" అని ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ పాలకమండలి ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు ఈ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చేదాకా రష్యాలో జరగబోయే జూడో టోర్నీలన్నింటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా పుతిన్ జూడోలో నిష్ణాతుడు. 2014లో జూడోలో ఎనిమిదవ డాన్‌ను అందుకున్నాడు.కాగా 2008 నుంచి గౌరవ ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. చదవండి: Russia Ukraine War: 'యుద్ధం ఆపేయండి'.. సొంత దేశాన్ని ఏకిపారేసిన టెన్నిస్ స్టార్ -
‘ఆసియా జూడో’లో భారత్‌కు పతకాల పంట
న్యూఢిల్లీ: ఆసియా క్యాడెట్, జూనియర్ జూడో చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు సత్తాచాటారు. హాంకాంగ్‌లో ఈనెల 10 నుంచి 15 వరకు జరిగిన ఈ టోర్నీలో ఓ స్వర్ణంతో కలిపి మొత్తం 10 పతకాలు సాధించారు. క్యాడెట్ టీమ్ ఓ స్వర్ణం, రజతం, ఐదు కాంస్యాలు, జూనియర్ జట్టు మూడు కాంస్యాలను సొంతం చేసుకుంది. 66 కేజీల క్యాడెట్ విభాగంలో జస్లీన్ సింగ్ సైనీ స్వర్ణంతో; 40 కేజీల కేటగిరీలో సీమా దేవి రజతంతో మెరిశారు. క్యాడెట్లో మాలప్రభ జాదవ్ (44 కేజీ), పింకీ బల్హారా (52 కేజీ), దేవేందర్ (50 కేజీ), షంషేర్ సింగ్ (81 కేజీ), సచిన్ మాన్ (+90 కేజీ)లకు, జూనియర్ విభాగంలో ధన్ప్రియారి దేవి (44 కేజీ), సనతోంబి దేవి (48 కేజీ), హర్‌ప్రీత్ కౌర్ (+78 కేజీ)లకు కాంస్యాలు లభించాయి.