International Judo Federation: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఉక్రెయిన్ యుద్దం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమాత్రం తగ్గట్లేదు. ఒక వైపు చర్చలకు సిద్ధమంటునే.. రష్యా దళాలు భీకర దాడులు జరుపుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పటి నుంచి వందల మంది పౌరులు మరణించినట్లు తెలుస్తోంది. మరోవైపు రష్యా కూడా తీవ్రంగా నష్టపోతోంది. ఈ యుద్దంలో ఉక్రెయిన్‌కు క్రీడాలోకం మద్దతుగా నిలుస్తోంది.
కాగా ఇప్పటికే సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరగాల్సిన యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్ ఫైనల్‌ను యూరోపియన్ ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ రద్దు చేసింది. ఇది ఇలా ఉంటే.. అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు భారీ షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్‌ను పాలకమండలి సస్పెండ్ చేసింది.
"రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో... అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ అధ్యక్షుడిగా,రాయబారిగా వ్లాదిమిర్ పుతిన్ హోదాను సస్పెండ్ చేస్తున్నాం" అని ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ పాలకమండలి ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు ఈ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చేదాకా రష్యాలో జరగబోయే జూడో టోర్నీలన్నింటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా పుతిన్ జూడోలో నిష్ణాతుడు. 2014లో జూడోలో ఎనిమిదవ డాన్‌ను అందుకున్నాడు.కాగా 2008 నుంచి గౌరవ ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.
చదవండి: Russia Ukraine War: 'యుద్ధం ఆపేయండి'.. సొంత దేశాన్ని ఏకిపారేసిన టెన్నిస్ స్టార్
Comments
Please login to add a commentAdd a comment