‘ఆసియా జూడో’లో భారత్‌కు పతకాల పంట | JUDO FEDRATION OF INDIA | Sakshi
Sakshi News home page

‘ఆసియా జూడో’లో భారత్‌కు పతకాల పంట

Published Wed, Dec 17 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

JUDO FEDRATION OF INDIA

న్యూఢిల్లీ: ఆసియా క్యాడెట్, జూనియర్ జూడో చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు సత్తాచాటారు. హాంకాంగ్‌లో ఈనెల 10 నుంచి 15 వరకు జరిగిన ఈ టోర్నీలో ఓ స్వర్ణంతో కలిపి మొత్తం 10 పతకాలు సాధించారు. క్యాడెట్ టీమ్ ఓ స్వర్ణం, రజతం, ఐదు కాంస్యాలు, జూనియర్ జట్టు మూడు కాంస్యాలను సొంతం చేసుకుంది.

66 కేజీల క్యాడెట్ విభాగంలో జస్లీన్ సింగ్ సైనీ స్వర్ణంతో; 40 కేజీల కేటగిరీలో సీమా దేవి రజతంతో మెరిశారు. క్యాడెట్‌లో మాలప్రభ జాదవ్ (44 కేజీ), పింకీ బల్హారా (52 కేజీ), దేవేందర్  (50 కేజీ), షంషేర్ సింగ్ (81 కేజీ), సచిన్ మాన్ (+90 కేజీ)లకు, జూనియర్ విభాగంలో ధన్‌ప్రియారి దేవి (44 కేజీ), సనతోంబి దేవి (48 కేజీ), హర్‌ప్రీత్ కౌర్ (+78 కేజీ)లకు కాంస్యాలు లభించాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement