ట్రంప్‌తో జుకర్‌బర్గ్ భేటీ
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ గురువారం భేటీ అయ్యారు. వీరు కలుసుకున్నఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో దిగ్గజ కంపెనీ కొన్ని వివాదాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జుకర్‌బర్గ్ భేటీలో సామాజిక మాధ్యమాల పోటీ, డిజిటల్ గోప్యత, సెన్సార్షిప్, రాజకీయ ప్రకటనలలో పారదర్శకత వంటి సమస్యల చర్యకు వచ్చినట్టు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ఫేస్బుక్ చుట్టూ అనేక నియంత్రణ, చట్టపరమైన అంశాలను కంపెనీ ఎదుర్కొంటున్న సందర్భంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
అయితే భవిష్యత్తులో ఇంటర్నెట్ నియంత్రణపై వీరు చర్చించినట్లు ఫేస్బుక్ వర్గాలు తెలిపాయి. సెనేట్‌లో ముఖ్యమైన చట్టాలు చేసే మార్క్ వార్నర్ డిజిటల్ సెక్యూరిటీ వంటి అంశాలను ముందుగానే జుకర్‌బర్గ్‌కు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బుధవారం భేటీలో ఫేస్బుక్ డేటారక్షణ, వినియాగదారుల గోప్యతా అపోహలు లాంటి అంశాలు చర్చించారు. అయితే జూకర్‌బర్గతో చర్చలు ఫలవంతంగా సాగాయని సెనేటర్లు జోష్ హాలీ, రిపబ్లికన్ ఫ్రెష్మాన్ తెలిపారు.
ఈ క్రమంలో ఫేస్బుక్ కొన్ని అంశాల పట్ల స్పష్టత ఇవ్వాలని హాలీ కోరారు. పక్షపాతం, గోప్యత, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ కొనుగోలు అంశం, సెన్సార్‌షిప్‌పై మూడవ పార్టీ ఆడిట్ వంటి కొన్ని అంశాలపై ఫేస్బుక్ స్పష్టత ఇవ్వాలని హాలీ తెలిపారు. కానీ హాలీ ప్రతిపాదనను ఫేస్బుక్ తోసిపుచ్చడం గమనార్హం. కాగా ఫెడరల్ స్టేట్ యాంటీ-ట్రస్ట్ అధికారులు ఫేస్బుక్ పోటీని తట్టుకోవడానికి వ్యతిరేక చర్యలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వైట్‌హౌస్‌లోని కాంగ్రెస్ సభ్యులు జాతీయ గోప్యతా చట్టాన్ని చర్చించుకుంటున్నారు.