జంబో హోటల్..
ఇది జంబో హోటల్. విమానం డిజైన్‌లో కట్టినది కాదు. ఇది నిజమైన విమానమే.. ఎన్నో ఏళ్లపాటు సేవలందించిన ఈ 747-200 జెట్లైనర్కు 2008లో రిటైర్మెంట్ ఇచ్చేశారు. అది ఎప్పుడూ దిగే రన్‌వే పైనే.. దాన్ని హోటల్‌గా మార్చేశారు. స్వీడన్‌లోని స్టాక్‌హోంకు సమీపంలో అర్లాండా ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఈ జంబో హోటల్ ఉంది.
ప్రస్తుతం ఈ రన్‌వేను ఉపయోగించడం లేదు. ఇందులో సింగిల్, డబుల్ బెడ్రూంలు ఉన్నాయి. కాక్‌పిట్‌లో లగ్జరీ రూంను ఏర్పాటు చేశారు. పై అంతస్తులోని ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌ను కేఫ్ కింద మార్చేశారు. ప్రతీ రూంలో ఒక ఎల్ఈడీ టీవీ ఉంటుంది. ఈ జంబో హోటల్లో ఎక్కువగా విమాన ప్రయాణికులే ఉంటారు. తర్వాతి రోజు ఉదయం ఫ్లైట్ ఉన్నవాళ్లు ఇక్కడ రాత్రి బస చేస్తుంటారు.