june month
-
ఐసీసీ అవార్డులో టీమిండియా ప్లేయర్స్‌కు మొండిచెయ్యి..
దుబాయ్: జూన్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు న్యూజిలాండ్ నయా బ్యాటింగ్ సెన్సేషన్ డెవాన్ కాన్వేను వరించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం కాన్వేతో పాటు న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్, దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ పోటీపడినప్పటికీ.. ఐసీసీ కాన్వే వైపే మొగ్గు చూపింది. దీంతో పురుషుల విభాగంలో ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి కివీస్ ప్లేయర్‌గా కాన్వే చరిత్ర పుటల్లోకెక్కాడు. జూన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన కాన్వే.. అరంగేట్రం టెస్ట్‌లోనే డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఆ తర్వాత భారత్‌తో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ విలువైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన కాన్వే.. మొత్తం మూడు టెస్ట్‌ల్లో డబుల్ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. మరోవైపు మహిళల క్రికెట్లో ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా(జూన్) ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ నిలిచింది. ఈ అవార్డు రేసులో టీమిండియా నవయువ బ్యాటర్ షెఫాలీ వర్మ, సహచర ప్లేయర్ స్నేహ్ రాణా ఉన్నప్పటికీ.. ఎక్లెస్టోన్ వీరిద్దరినీ వెనక్కి నెట్టి ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచింది. దీంతో టీమిండియా ప్లేయర్స్‌కు మరోసారి మొండిచెయ్యే మిగిలింది. భారత్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో 8 వికెట్లు, ఆ తర్వాత జరిగిన రెండు వన్డేల్లో మూడేసి వికెట్లు తీసిన ఎక్లెస్టోన్.. అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించి ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు కైవసం చేసుకుంది. కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ ద్వారా టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన షెఫాలి వర్మ.. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు నమోదు చేసి శభాష్ అనిపించుకుంది. ఇదే టెస్ట్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా బంతితోనూ, బ్యాట్‌తోనూ రాణించి, భారత్ జట్టును ఓటమి బారి నుంచి రక్షించింది. -
జూన్‌లోనూ జీవిత బీమా జోరు
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీలు జూన్‌లోనూ మంచి పనితీరు చూపించాయి. నూతన పాలసీల నుంచి వచ్చే మొదటి ఏడాది ప్రీమియం(న్యూ బిజినెన్ ప్రీమియం)లో 4% వృద్ధి నమోదైంది. ఈ రూపంలో రూ.30,009 కోట్ల ఆదాయం వచ్చినట్టు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. క్రితం ఏడాది జూన్ నెలలో అన్ని జీవిత బీమా కంపెనీల కొత్త పాలసీల ప్రీమియం ఆదాయం రూ.28,869 కోట్లుగా ఉండడం గమనార్హం. దేశంలో 24 జీవితబీమా కంపెనీలుండగా.. ఎల్ఐసీ అతిపెద్ద మార్కెట్ వాటాతో దిగ్గజ సంస్థగా కొనసాగుతోంది. ఎల్ఐసీ నూతన ప్రీమియం ఆదాయం ఈ ఏడాది జూన్‌లో 4.14 శాతం పడిపోయింది. 2020 జూన్‌లో కొత్త పాలసీల రూపంలో రూ.22,737 కోట్ల మేర ప్రీమియం ఆదాయం ఎల్ఐసీకి సమకూరగా.. 2021 జూన్‌లో ఆదాయం రూ.21,796 కోట్లకు పరిమితమైంది. మిగిలిన 23 ప్రైవేటు జీవిత బీమా కంపెనీలకు నూతన పాలసీల రూపంలో ఆదాయం 34% పెరిగి రూ.6,132 కోట్ల నుంచి రూ.8,213 కోట్లకు చేరుకుంది. జూన్ త్రైమాసికంలో 7 శాతం వృద్ధి... ఈ ఏడాది (2021–22) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలోనూ 24 జీవిత బీమా సంస్థల నూతన వ్యాపార ప్రీమియం 7% పెరిగి (క్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే) రూ.53,725 కోట్లుగా నమోదైంది. ఎల్ఐసీ వరకే చూస్తే తొలి త్రైమాసికంలో ప్రీమియం ఆదాయం 2.54% తగ్గి రూ.25,601 కోట్లుగా ఉంది. 23 ప్రైవేటు జీవిత బీమా సంస్థల తొలి ప్రీమియం ఆదాయం జూన్ క్వార్టర్లో 34% వృద్ధితో రూ.17,124 కోట్లుగా నమోదైంది. 2021 జూన్ నాటికి మొత్తం జీవిత బీమా కవరేజీ (సమ్ అష్యూర్డ్) పరంగా చూస్తే ఎల్ఐసీ మార్కెట్ వాటా 12.55%గా ఉంటే, మిగిలిన 23 జీవిత బీమా కంపెనీలకు సంబంధించి సమ్ అష్యూర్డ్ 87.45%. ఎల్ఐసీ ఎక్కువగా ఎండోమెంట్ పాలసీలను విక్రయిస్తుంటుంది. వీటిపై జీవిత బీమా కవరేజీ తక్కువగా ఉండడం వల్లే ఇంత అంతరం కనిపిస్తోంది. ప్రొటెక్షన్ పాలసీల్లో (టర్మ్‌ప్లాన్లు) ప్రైవేటు బీమా సంస్థల ఆధిపత్యం ఎక్కువగా ఉంటోంది. జీవిత బీమా అంటేనే.. జీవితానికి రక్షణ కల్పించేదని అర్థం. ఇందుకు ఉదాహరణ టర్మ్ ప్లాన్లు. కానీ, నామమాత్రపు కవరేజీనిస్తూ.. 4–5% రాబడులిచ్చే ఎండోమెంట్ ప్లాన్లనే ఇప్పటికీ ఎక్కువ మంది తీసుకోవడం గమనార్హం. సాధారణ బీమా సైతం వృద్ధి పథమే సాధారణ బీమా సంస్థల (జీవిత బీమా కంపెనీలు కాకుండా) స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం జూన్ నెలలో 7 శాతం వృద్ధితో రూ14,809 కోట్లుగా నమోదైంది. దేశంలో 32 సాధారణ బీమా సంస్థలు పనిచేస్తున్నాయి. ఇవి క్రితం ఏడాది జూన్‌లో రూ.13,842 కోట్ల స్థూల ప్రత్యక్ష ఆదాయాన్ని పొందడం గమనార్హం. 25 సాధారణ బీమా సంస్థలకు సంబంధించి ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం 5 శాతం పెరిగి రూ.13,041 కోట్లుగా ఉంది. ఐదు స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థల ప్రీమియం ఆదా యం ఏకంగా 47 శాతం వృద్ధితో రూ.1,557 కోట్లకు చేరుకుంది. కరోనా వచ్చిన తర్వాత చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం, ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవడంతో.. వీటిని తీసుకునే వారు పెరుగుతున్నారు. -
అమ్మో...జూన్ నెల !!
వెంకటనారాయణ. ఈయన నగరంలోని ఓ మున్సిపల్ పాఠశాలలో సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఈయన వేతనంలో నెలకు అన్ని కోతలు పోను రూ.30 వేలు చేతికి వస్తుంది. ప్రతినెలా 1వ తేదీ వస్తే.. జీతం వస్తుందని సంతోషపడతారు.. కానీ జూన్ నెల ప్రారంభమైతే మాత్రం అమ్మో జూన్ నెల వచ్చిందా.. అని ఉలిక్కిపడతారు. కారణం.. పాఠశాలలు ప్రారంభం కావడంతో పాటు పెరిగిన ఖర్చులతో అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఒక ప్రభుత్వ ఉద్యోగి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వైఎస్సార్ జిల్లా: విద్యా సంవత్సరం మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి ఇంట కొనుగోళ్ల సందడి ప్రారంభమైంది. పాఠశాలలు జూన్ రెండో వారంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలకు వెళ్లే చిన్నారుల కోసం రెండు జతల బూట్లు, సాక్సులు, టై, రెండు జతల యూనిఫాం, పుస్తకాలు, నోటుబుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు, షార్ప్‌నర్, అరైజర్స్ ఇలా ఒక్కటేమిటి పాఠశాలకు సంబంధించిన మొత్తం సామగ్రి కొనుగోలు చేయాలంటే కనీసం పది నుంచి ఇరవై వేల రూపాయలు అవసరమవుతాయి. ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ప్రాథమిక పాఠశాల స్థాయిలో చదువుతున్నా కనీసం రూ.40 నుంచి 60వేలు ఫీజుల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. ఇక హైస్కూల్, కళాశాల స్థాయిలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక వీటితో పాటు నెలవారి అద్దె, పాలు, ఇంటిసరుకులు, కరెంటు బిల్లు, డిష్బిల్లు, కూరగాయలకు సంబంధిం చిన ఖర్చులు ఉండనే ఉన్నాయి. నిప్పులు కురిపిస్తున్న నిత్యావసర ధరలు.. నిత్యావసర ధరలు రోజురోజుకీ కొండెక్కుతున్నాయి. కంది పప్పు కిలో దాదాపు రూ.200 పలుకుతోంది. కూరగాయల ధరలు సైతం వెక్కిరిస్తుండటంతో సామాన్యుడి పరిస్థితి రోజురోజుకీ దయనీయంగా తయారైంది. అప్పులు చేయక తప్పడం లేదు... జూన్ నెల వచ్చిందంటే మాకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లలకు పుస్తకాలు, నోటు బుక్కు లు కొనేందుకు, దుస్తులు కొనేందుకు చాలా ఇబ్బం దులు పడుతున్నాం. దీనికి తోడు మాకు ఇవ్వాల్సిన వేతనాలు కూడా రెండు నెలలుగా ఇవ్వకపోవడంతో మా పరిస్థితి దారుణంగా ఉంది. - ఆరోగ్యమ్మ, మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి జూన్ నెల వచ్చిందంటే తిప్పలు తప్పడం లేదు... జూన్ నెల ప్రారంభమైందంటే.. పిల్లల అడ్మిషన్లు, యూనిఫాం, షూ ఇలా ఒకటేమిటి అన్నింటా హడావుడి మొదలవుతుంది. దీనికితోడు నెలవారి ఖర్చులతో పాటు కనీసం మరో రూ.50వేలు ఫీజులు, అదనపు ఖర్చులు వస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీనికి హద్దు ఎక్కడ ఉంటుందో అర్థం కావడం లేదు. - బి. నిరంజన్రాజు, కోఆపరేటివ్ కాలనీ ఒక విద్యార్థికి అయ్యే ఖర్చు... పాఠశాల ఫీజు: : రూ.20వేలు యూనిఫాం (రెండు జతలు) : రూ. 2000 షూ, సాక్సులు (రెండు జతలు) : రూ. 1500 ఆటో చార్జీలు (నెలకు) : రూ. 1000 పుస్తకాలు : రూ. 6000 నోటు బుక్స్ : రూ. 3000 బ్యాగులు, బాటిళ్లు, క్యారీబాక్స్ : రూ. 1000 ఒక విద్యార్థికి అయ్యే ఖర్చు రూ. 32,500 ఇద్దరు పిల్లలు ఉంటే రూ. 65,000. -
అమ్మో.. జూన్
జోగిపేటలో మల్లేష్.. పద్మ కార్మికులు. వీరి కూతురు ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. స్కూల్ ఫీజు ఏడాదికి రూ.17,500. మొదట సగం చెల్లించి.. మిగిలినది రెండు వాయిదాల్లో కట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫీజుతోపాటు పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫారాలు, రవాణా ఖర్చులకు అదనంగా మరో రూ.6 వేలు ఖర్చు అవుతోంది. సంపాదనంతా చదువులకే పోతే ఏం తినాలి.. ఎలా బతకాలి అన్నదే వీరి బెంగ.. ఇలాంటి సమస్య ఈ ఒక్క దంపతులదే కాదు.. జూన్ నెల వచ్చిందంటే చాలు.. జిల్లాలో ఎవరి ఇంట చూసినా ఇలాంటి భయాలే నెలకొంటున్నాయి. జోగిపేట, న్యూస్‌లైన్: జూన్ మాసం వచ్చేసింది.. గుబులు రేపుతోంది.. మరో వారం రోజుల్లో బడి గంటలు మోగనున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయంటే ఇటు పిల్లలకు, అటు తల్లిదండ్రులకు దిగులే. వేసవి సెలవుల్లో ఎంతో ఎంజాయి చేసిన విద్యార్థులు బడి బాట పట్టాలంటే భారంగా భావిస్తుండగా.. కొండం త ఖర్చులను తలచుకుని తల్లిదండ్రులు ఆం దోళన చెందుతున్నారు. స్కూలు ఫీజులు యూని ఫారాలు, పుస్తకాలు, స్టేషనరీ, బస్సు చార్జీలు తదితర ఖర్చులు వారిని భయపెడుతున్నాయి. గతంలో విద్య తల్లిదండ్రులకు భారమయ్యేది కాదు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పిల్లలను చదివించేవారు. రాను రాను పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోతుండటం.. ఆంగ్లమాధ్యమ ప్రభావం పెరగడం వంటి కారణాలతో ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు.. దీంతో తల్లిదండ్రులపై భారం పెరుగుతోంది. ప్రభుత్వ పర్యవేక్షణ కరువవడంతో ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. సుమారుగా రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నాయి. మరోవైపు పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, టై, బెల్ట్‌ల వ్యాపారమూ చేస్తూ తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. అప్పు చేసి ‘చదివింపు’ విద్యా సంవత్సరం ప్రారంభమవుతండటంతో సామాన్యుడు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి అద్దె, నిత్యావసర వస్తువుల కొనుగోలుకే వేతనం సరిపోదు. ఇక పిల్లల స్కూలు ఫీజు, యూనిఫారం, టై, బెల్టు, బ్యాగు స్టేషనరీ కొనుగోలుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఫీజులు, పుస్తకాలు ఇతర వస్తువుల కొనుగోలుకు ఎంత లేదన్నా రూ. 17 వేలు అవసరం అవుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. 25 శాతం సీట్లు హుళక్కే? నిరుపేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించి ఉచిత విద్యా బోధన అందించాలన్న నిబంధన అమలుకు నోచుకోవడంలేదు. దీనిని అమలుచేసేందుకు కూడా అధికారులు దృష్టి సారించడంలేదు. ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కడా ఏ పేద విద్యార్థికి సీటు కేటాయించిన దాఖలాలు లేవని తెలుస్తోంది. ఫీ‘జులుం’పై నియంత్రణ కరువు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథులే లేరు. ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకునే అధికారం డిప్యూటీ ఈఓ, ఎంఈఓలకు ఉన్నా చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి.