బాల్‌బ్యాడ్మింటన్ జిల్లా జట్టు ఎంపిక
నిడదవోలు : జిల్లా సీనియర్ బాల్‌బ్యాడ్మింటన్ జట్టును ఎంపిక చేసినట్టు జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆలపాటి శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో సెలెక్షన్స్ జరిగాయని, ఎంపికైన జట్టు ప్రకాశం జిల్లా అద్దంకిలో ఈనెల 10, 11, 12 తేదీల్లో జరిగే ఎన్టీఆర్ మెమోరియల్ రెండో ఏపీ సీనియర్ బాల్‌బ్యాడ్మింటన్ అంతర్ జిల్లాల చాంపియన్‌షిప్ పోటిల్లో పాల్గొంటారన్నారు. ఎంపిౖకైన క్రీడాకారులకు ఊనగట్ల గ్రామానికి చెందిన పి.బాబీ క్రీడా దుస్తులు అందించారు. ఎంవీఎన్రాజు తదితరులు పాల్గొన్నారు.
8నుంచి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు
చాగల్లు జెడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ బాల్‌బ్యాడ్మింటన్ అంతర్ జిల్లాల అండర్–17 బాల బాలికల చాంపియన్Sషిప్ పోటీలను ఈనెల 8 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్టు పోటీల పరిశీలకుడు గోపాలపురం జెడ్పీ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పాలేటి శ్రీనివాస్ తెలిపారు.