Junior doctors association
-
దిగొచ్చిన దీదీ
కోల్‌కతా: మమతా బెనర్జీ సర్కారు దిగివచ్చింది. జూనియర్ డాక్టర్ల ఐదు డిమాండ్లలో మూడింటిని ఆమోదించింది. వైద్య విద్య డైరెక్టర్, ఆరోగ్య సేవల డైరెక్టర్లను తొలగించడానికి అంగీకరించింది. వైద్యురాలి తల్లిదండ్రులకు డబ్బు ఇవ్వజూపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ పైనా వేటు వేసింది. మంగళవారం కొత్త కమిషనర్‌ను నియమిస్తామని సీఎం మమత ప్రకటించారు. వినీత్ గోయల్ కమిషనర్‌గా కొనసాగడానికి సుముఖంగా లేరన్నారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ (నార్త్)ను తొలగించాలని నిర్ణయించామన్నారు. జూనియర్ల డాక్టర్ల ఇతర డిమాండ్లను పరిశీలించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. ఐదింటిలో మూడు డిమాండ్లను అంగీకరించినందుకు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని జూనియర్ డాక్టర్లను కోరినట్లు మమత వెల్లడించారు. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత మమత మీడియాతో మాట్లాడుతూ సమావేశపు వివరాలను వెల్లడించారు. 42 మంది జూనియర్ డాక్టర్లు, బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ సమావేశపు మినిట్స్‌పై సంతకాలు చేశారని మమత తెలిపారు. జూడాలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండవని ప్రకటించారు. చర్చించుకొని తమ నిర్ణయం చెబుతామని జూనియర్ డాక్టర్లు తెలిపారని మమత వెల్లడించారు. రోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని విధులకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశానన్నారు. ఆరోగ్యశాఖ కార్యదర్శిని కూడా బదిలీ చేయాలనేది జూడాల డిమాండ్లలో ఒకటి. కాళిఘాట్‌లోని సీఎం నివాసంలో సోమవారం జూనియర్ డాక్టర్లతో రాత్రి 7 గంటలకు మొదలైన చర్చలు 9 దాకా కొనసాగాయి. 42 మంది జూడాలు మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా సీఎం ముందుంచారు. అనంతరం ఇరుపక్షాలు రెండున్నర గంటల పాటు సమావేశపు మినిట్స్‌కు తుదిరూపునిచ్చాయి. చర్చలు సానుకూలంగా జరిగాయని మమత అన్నారు. అందుకే ఇరుపక్షాలు మినిట్స్‌పై సంతకాలు చేశాయని అభిప్రాయపడ్డారు. అంతకుముందు సోమవారం ఉదయం మమత సర్కారు జూనియర్ డాక్టర్లను చర్చలకు ఆహ్వానించింది. చర్చలకు íపిలవడం ఇది ఐదో, ఆఖరుసారని కూడా స్పష్టం చేసింది.నేడు సుప్రీం విచారణ న్యూఢిల్లీ: ఆర్.జి.కర్ ఆసుపత్రి వైద్యురాలి హత్యాచారం ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు మంగళవారం ఈ కేసును మరోసారి విచారించనుంది. సహచర డాక్టర్ పాశవిక హత్యను నిరసిస్తూ ఆగస్టు 9 నుంచి పశి్చమబెంగాల్ జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరిస్తున్నారు. క్రమశిక్షణ చర్యల బారినపడకుండా ఉండాలంటే సెప్టెంబరు 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు గతంలో జూడాలను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ జూడాలను సమ్మె కొనసాగించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మంగళవారం జరిపే విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. -
26 నుంచి జూడాల సమ్మె!
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): కరోనా విలయతాండవం చేస్తోన్న వేళ... రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమ సమస్యల్ని ప్రభుత్వం నిర్ణీత గడువులోగా పరిష్కరించకపోతే ఈనెల 26 నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతామని తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం హెచ్చరించింది. అప్పటివరకు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలని నిర్ణయించింది. ఈ మేరకు జూడా సంఘం రాష్ట్ర, గాంధీ యూనిట్ అధ్యక్షులు వాసరి నవీన్‌రెడ్డి, మణికిరణ్‌రెడ్డి శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. స్టైపెండ్‌ను జనవరి 2020 నుంచి పెంచాలని, విధినిర్వహణలో మృతి చెందిన జూడాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, జూడాలకు బీమా సౌకర్యంతోపాటు కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో కరోనా వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు. కాగా, సీనియర్ డాక్టర్ల సమస్యల్ని కూడా పరిష్కరించకుంటే తాము కూడా సమ్మె బాట పడతామని తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీఎస్ఆర్డీఏ) స్పష్టం చేసింది. ఈ సంఘం ప్రతినిధులు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) డైరెక్టర్‌కు సమ్మె నోటీసు ఇచ్చారు. -
కన్వీనర్ ‘కోత’
ఆ కోటాకు ‘డీమ్డ్’ ముప్పు! ‘గీతం’ బాటలో మరికొన్ని వైద్య కళాశాలలు కన్వీనర్ కోటాలో 850 సీట్లు కోల్పోనున్న వైనం ఏపీలో ప్రైవేటు కళాశాలల వివరాలు మొత్తం వైద్య కళాశాలలు 13 మైనారిటీ వైద్య కళాశాల 1 మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 1,700 కన్వీనర్ కోటాలో ఇస్తున్నది 850 సాక్షి, హైదరాబాద్ : ఏ ప్రభుత్వమైనా సామాన్యుడి సంక్షేమాన్ని కాంక్షించాలి. పేదలను దృష్టిలో పెట్టుకొనే సంక్షేమ పథకాల రచన సాగాలి. వారికి వెన్నుదన్నుగా నిలవాలి. అప్పుడే ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజల లక్ష్యాలు నెరవేరతాయి. తద్భిన్నంగా చంద్రబాబు సర్కారు నిర్ణయాలు ప్రైవేటు యాజమాన్యాలకు రాచబాట వేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా మారుతున్నాయి. అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలలను డీమ్డ్ కాలేజీలుగా మార్చేందుకు సర్కారు యోచిస్తోంది. ఈ నిర్ణయం ప్రతిభ కలిగిన, పేద విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. తాజాగా విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయానికి డీమ్డ్ హోదా కల్పించింది. దీనివల్ల ఆ కాలేజీలోని కన్వీనర్ కోటా సీట్లు అందని ద్రాక్షగా మిగలనున్నాయి. ప్రైవేటు వైద్య కళాశాలలు ‘డీమ్డ్’గా మారిపోనుండటంతో భవిష్యత్‌లో వైద్యవిద్యలో కన్వీనర్ కోటా సీట్లు దక్కకుండా పోయే పరిస్థితి దాపురించనుంది. దీనివల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోనున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు డీమ్డ్ హోదా కల్గిన వర్సిటీలు లేవు. గీతం బాటలోనే మరికొన్ని ప్రైవేటు కాలేజీలు డీమ్డ్ హోదాకు దరఖాస్తు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే ఓ మంత్రికి చెందిన వైద్య కళాశాల డీమ్డ్ హోదాకు ముందు వరసలో ఉన్నట్టు తెలిసింది. డీమ్డ్ యూనివర్సిటీలంటే? కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి కల్పించే వర్సిటీలను డీమ్డ్ విశ్వవిద్యాలయాలుగా పిలుస్తారు. యూజీసీ చట్టం (1956)లోని సెక్షన్-3 కింద కోర్సులు, సిలబస్, అడ్మిషన్ల విషయంలో స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయి. ప్రభుత్వ పెత్తనం ఉండదు. యాజమాన్యాలు భారీగా లబ్ధి పొందే ఆస్కారముంది. డీమ్డ్ వల్ల నష్టాలివీ.. ► రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రైవేటు వైద్య కళాశాలలు డీమ్డ్ కళాశాలలుగా మారిపోతే కన్వీనర్ కోటా కింద వచ్చే ఎంబీబీఎస్, పీజీ సీట్లు కూడా వచ్చే అవకాశం ఉండదు. ► రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలల్లో 50 శాతం ఎంబీబీఎస్ సీట్లు కన్వీనర్ కోటా కింద ఇస్తున్నాయి. ఈ సీటు పొందిన విద్యార్థులు ఏడాదికి రూ.10 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. డీమ్డ్ హోదా పొందిన కళాశాలలు కన్వీనర్ కోటా సీట్లు ఇవ్వవు. ► డీమ్డ్ కళాశాలలు ఎంసెట్ ప్రవేశ పరీక్ష పరిధిలోకి రావు. సొంతంగా నోటిఫికేషన్ ఇచ్చి సీట్లు భర్తీ చేసుకుంటాయి. ► రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించవు. దీంతో పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. ► అన్ని కాలేజీలు డీమ్డ్కు వెళ్తే.. రాష్ట్రంలో సుమారు 850 ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. కన్వీనర్ కోటా సీట్లు అంటే... రాష్ట్రంలో ఉన్న ఏ ప్రైవేటు వైద్య కళాశాల అయినా తనకున్న సీట్లలో 50 శాతం ప్రభుత్వానికి(ఇదే కన్వీనర్ కోటా) ఇవ్వాలి. మిగతా 50 శాతం సీట్లలో 35 శాతం సీట్లను యాజమాన్య కోటా కింద, 15శాతం సీట్లను ప్రవాస భారతీయ కోటా కింద(ఎన్ఆర్ఐ) కింద భర్తీ చేసుకుంటారు. ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విధానం. కన్వీనర్ కోటా సీట్లను ఎంసెట్ మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ముందుగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న 1,600 సీట్లకు కౌన్సెలింగ్ జరుగుతుంది. ప్రభుత్వ సీటు వద్దనుకుంటే నేరుగా కన్వీనర్ కోటా కింద ప్రైవేటు కాలేజీలోనూ తీసుకోవచ్చు. కన్వీనర్ కోటా సీటుకు ఫీజు ఏడాదికి రూ.10 వేలు మాత్రమే. ఐదేళ్ల ఎంబీబీఎస్ చదివితే ఫీజు రూ.50 వేలు మాత్రమే. ఇవే కళాశాలలు డీమ్డ్ యూనివర్సిటీలుగా మారితే ఒక్కో సీటుకు ఏడాదికి రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలకు తక్కువ కాకుండా వసూలు చేస్తాయి. ఆది నుంచీ ప్రైవేటుకు అనుకూలంగానే చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి ప్రైవేటుకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. గతంలో 50 శాతం కన్వీనర్, 10 శాతం ‘బి’కేటగిరీ సీట్లుండేవి. వాటిని కన్వీనర్ కోటా సీట్లు పొందిన తర్వాత ర్యాంకుల వారికి కేటాయించేవారు. ఈ సీట్లకు ఒక్కోదానికి రూ.2.40 లక్షలు ఫీజు ఉండేది. దీనికి ఫీజు రీయింబర్స్ వర్తించేది. చంద్రబాబు ప్రభుత్వం ‘బి’ కేటగిరీ సీట్లను ఎత్తేసింది. యాజమాన్యాలకే ఇచ్చేసింది. ఇక యాజమాన్యకోటా సీటుకు ఏడాదికి రూ.5.5 లక్షలు ఫీజు ఉండగా దీన్ని రూ.11 లక్షలు పెంచేశారు. కేబినెట్లో కీలకపాత్ర పోషిస్తున్న ఓ మంత్రి కళాశాల కోసమే ఇదంతా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2018 నాటికి మెజారిటీ కాలేజీలు.. రాష్ట్రంలో ఉన్న మెజారిటీ కళాశాలలు 2018 నాటికి ‘డీమ్డ్’ యూనివర్సిటీలుగా మారనున్నాయి. దీనికోసం ఐదు కళాశాలలు కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. దుర్మార్గమైన చర్య డీమ్డ్ హోదా అంటే ప్రైవేటు పరం చేయడంలో ఒక భాగమే. ఇది ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన చర్య. భవిష్యత్‌లో డబ్బున్న వాళ్లే చదవగలరు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు వైద్య విద్య అభ్యసించడం అసంభవం. విద్యార్థి లోకం ఉద్యమిస్తేనే ఈ ప్రైవేటు చర్యలను నిలువరించగలం. - డా.కె.హరిప్రసాద్, ముఖ్య సలహాదారు, జూనియర్ వైద్యుల సంఘం -
జూడాల చర్చలు మళ్లీ విఫలం
చర్చల కోసం సచివాలయానికి వెళ్లిన జూడా ప్రతినిధులు నలుగురే రావాలని అధికారుల సూచన అందరికీ అవకాశమివ్వాలంటూ వెనుదిరిగిన జూనియర్ వైద్యులు సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె ఆగదని స్పష్టీకరణ రెండు గంటలు ఎదురుచూసినా జూడాలు రాలేదు: రాజయ్య హైదరాబాద్: ప్రభుత్వం, జూనియర్ వైద్యుల మధ్య చర్చలు మరోసారి విఫలమయ్యాయి. సమస్యలు పరిష్కరించే వరకు తమ ఆందోళన విరమించే ప్రసక్తే లేదని జూడాల సంఘం తేల్చిచెప్పింది. జీవో 107 ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా, గాంధీ మెడికల్ కళాశాలల పరిధిలోని 1,700 మంది జూనియర్ వైద్యులు అత్యవసర విధులు సైతం బహిష్కరించి గత 21 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళన ను విరమింపజేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.రాజయ్య ఆదివారం చర్చలకు ఆహ్వానించారు. గాంధీ, ఉస్మానియాకు చెందిన 14 మంది జూడాల ప్రతినిధులు సచివాలయానికి వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత కేవలం నలుగురు మాత్రమే చర్చలకు రావాలని అధికారులు సూచించడంతో సెక్యురిటీ సిబ్బంది వారిని గేటు ముందే నిలిపివేశారు. ప్రతినిధులందరినీ చర్చల్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని జూడాలు డిమాండ్ చేశారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో వారు వెనుతిరగాల్సి వచ్చింది. చర్చల పేరుతో తమను సచివాలయానికి పిలిచి అవమానపరిచారంటూ జూడాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగొచ్చి తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని జూడాల సంఘం ప్రతినిధులు శ్రీనివాస్, క్రాంతి, అభిలాష్, రాఘవేంద్ర, చైతన్య స్పష్టం చేశారు. సోమవారం నుంచి తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి జూడాలు వ్యతిరేకం కాదని, అయితే తాత్కాలిక ప్రతిపాదికన కాకుండా శాశ్వత ప్రతిపాదికన పంపిస్తే పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కేవలం తాము వైద్య విద్యార్థులమని, శస్త్రచికిత్సలు చేసే సీనియర్ వైద్యులం కాదన్నారు. జూడాల సమ్మెతోనే ఆస్పత్రుల్లో రోగులు మృత్యువాత పడుతున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కొందరినే రమ్మన్నారు: జూడాలు జూడాల తరఫున కొందరు ప్రతినిధులే రావాలని మంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో.. దాన్ని వ్యతిరేకిస్తూ చర్చల్లో పాల్గొనకుండానే వెళ్లిపోయామని జూడాలు తెలిపారు. చర్చల కోసం వచ్చిన 14 మందిని సచివాలయం లోపలికి అనుమతించాలని కోరినా.. కేవలం ఇద్దరినే అనుమతించాలని అధికారులు భద్రతా సిబ్బందికి సూచించారన్నారు. సమ్మె వెనుక అదృశ్య శక్తుల ప్రోద్బలం: మంత్రి రాజయ్య జూనియర్ డాక్టర్ల సమ్మె వెనుక రాజకీయ శక్తుల ప్రమేయముందని మంత్రి టి.రాజయ్య పరోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అన్ని డిమాండ్లను నెరవేర్చినా జూడాలు ఇంకా మొండికేయడం, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించడం వెనక అదృశ్య శక్తుల ప్రోద్బలం ఉందన్నారు. ఇలాగైతే జూడాల సమ్మెను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. ఆదివారం సచివాలయంలో మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జూడాల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. జూడాలతో గతంలో నిర్వహించిన చర్చలో బయటి వ్యక్తులు పాల్గొని అమర్యాదకరంగా ప్రవర్తించినందు వల్లే ఈసారి 14 మంది జూడాలను చర్చలకు ఆహ్వానించామన్నారు. చర్చల కోసం వచ్చిన జూడాలు వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల కోసం ఉప ముఖ్యమంత్రి హోదాలో తాను, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సుమారు రెండు గంటల పాటు వేచి చూసినా జూడాలు రాలేదన్నారు. చర్చలకు ఆహ్వానిస్తూ ప్రభుత్వం లేఖ ఇస్తేనే వస్తామని జూడాలు పేర్కొనడం ప్రభుత్వాన్ని అవమానపరచడమేనని పేర్కొన్నారు. ఏడాది పాటు గ్రామీణ ప్రాంత ఆస్పత్రుల్లో పనిచేయాలనే నిబంధనపై మాట్లాడుతూ... దీనిపై జూడాలు హైకోర్టులో వేసిన కేసు పెండింగ్‌లో ఉందని, తీర్పు వచ్చేదాకా ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదన్నారు. కమల్‌నాథన్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా తెలంగాణ, ఏపీ మధ్య ఉద్యోగుల విభజన పూర్తయ్యే వరకు రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగుల నియామకం చేపట్టలేమన్నారు. జూడాల గౌరవ వేతనాన్ని అసిస్టెంట్ సివిల్ సర్జన్ జీతాలకు సమానంగా రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు పెంచడంతో పాటు ఇతర అలవెన్స్‌లు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఎంత వ్యయమైనా సరే ఇతర బోధనాసుపత్రుల్లో భద్రతా సిబ్బందిని నియమిస్తామన్నారు.