breaking news
Junior movie
-
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి పవన్ కల్యాణ్ 'ఓజీ' మూవీ రానుంది. మరి ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి? మరోవైపు ఓటీటీల్లో 27 సినిమాలు, వెబ్ సిరీసులు రానున్నాయి. ఈ వీకెండ్ తెలుగు స్ట్రెయిట్ చిత్రాలతో పాటు పలు డబ్బింగ్‌లు కూడా ఉండటం ఆసక్తి రేపుతోంది.(ఇదీ చదవండి: 'ఓజీ'.. జస్ట్ మిస్ అయింది)ఓటీటీల్లో రిలీజయ్యే వాటి విషయానికొస్తే.. జూనియర్, సుందరకాండ లాంటి స్ట్రెయిట్ సినిమాలతో పాటు హృదయపూర్వం, ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా, సుమతి వళవు తదితర డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. వీటిపై కాస్తంత ఆసక్తి ఉండనే ఉంది. ఇవే కాకుండా వీకెండ్లో సడన్ సర్ప్రైజ్లు ఏమైనా ఉండొచ్చేమో చూడాలి? ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (సెప్టెంబరు 21 నుంచి 28 వరకు)ఆహాజూనియర్ (తెలుగు సినిమా) - సెప్టెంబరు 22అమెజాన్ ప్రైమ్హోటల్ కాస్టైరా (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 24కొకైనా క్వార్టర్ బ్యాక్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 25టూమచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్ (హిందీ టాక్ షో) - సెప్టెంబరు 25మాదేవా (కన్నడ సినిమా) - సెప్టెంబరు 26నెట్ఫ్లిక్స్ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 26ది గెస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26అలైస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26మాంటిస్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 26హౌస్ ఆఫ్ గిన్నీస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26హాట్స్టార్సుందరకాండ (తెలుగు సినిమా) - సెప్టెంబరు 23ది డెవిల్ ఈజ్ బిజీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 24హృదయపూర్వం (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 26మార్వెల్ జాంబియాస్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 24ద బల్లాడ్ ఆఫ్ వల్లిస్ ఐలాండ్ (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 28ఉమన్ ఇన్ ద యార్డ్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 28ద ఫ్రెండ్ (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 28డెత్ ఆఫ్ ఏ యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 28సన్ నెక్స్ట్దూరతీర యానా (కన్నడ మూవీ) - సెప్టెంబరు 26జీ5జనావర్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 26సుమతి వళవు (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 26ఆపిల్ ప్లస్ టీవీస్లో హార్సస్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 24ఆల్ ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 26ద సావంత్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26లయన్స్ గేట్ ప్లేడేంజరస్ యానిమల్స్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 26మనోరమ మ్యాక్స్సర్తీక్ (మలయాళ మూవీ) - సెప్టెంబరు 26ఎమ్ఎక్స్ ప్లేయర్సిక్సర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - సెప్టెంబరు 24(ఇదీ చదవండి: మనీష్ ఎలిమినేట్.. రెండువారాల సంపాదన ఎంతంటే?) -
ఓటీటీలో కనిపించని 'జూనియర్'.. కారణం ఏంటి?
కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన తొలి చిత్రం జూనియర్(Junior Movie).. థియేటర్స్‌లో మెప్పించిన ఈ సినిమా తాజాగా ఓటీటీ ప్రకటన కూడా చేసింది. ఇందులో ‘వైరల్ వయ్యారి..’ పాటకు శ్రీలీల, కిరీటి వేసిన స్టెప్పులు సినిమాకు భారీ హైప్ వచ్చింది. దీంతో ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం అభిమానులు భారీగానే ఎదురుచూశారు. అయితే, ప్రకటన వచ్చినప్పటికీ ఈ చిత్రం అనుకున్న సమయానికి స్ట్రీమింగ్కు రాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.జూనియర్ మూవీ ఆహా ఓటీటీలోకి రాబోతుందనే ఇప్పటికే అధికారికంగా ప్రకటంచిన సంగతి తెలిసిందే. నేడు (సెప్టెంబర్ 22) నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక పోస్టర్‌ను కూడా పంచుకున్నారు. అయితే, ఇప్పటికీ కూడా ఆహా తెలుగు ఓటీటీలో జూనియర్ కనిపించలేదు. దీంతో అభిమానులు సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇదే సమయంలో సెప్టెంబర్ 22 నుంచే నమ్మఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో జూనియర్ స్ట్రీమింగ్ కానుందని చెప్పారు. ఇది కన్నడ ఓటీటీ యాప్ అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం అందులో కూడా విడుదల కాలేదని తెలుస్తోంది.కిరిటీ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించగా జెనీలియా కీలక పాత్ర పోషించింది. కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో మొదలై ఎమోషనల్‌గా సాగే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. వాస్తవంగా ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ మొదట దక్కించుకుంది. కానీ, ఇప్పటివరకు స్ట్రీమింగ్ గురించి ఆ సంస్థ పెద్దగా ప్రచారం చేయలేదు. ఈ క్రమంలో సడెన్‌గా ఆహా ఓటీటీ సంస్థ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ముందుగా అనుకున్న సమయానికి జూనియర్ ఓటీటీలోకి రాకపోవడంతో అమెజాన్, ఆహాలతో మేకర్స్ ఏమైనా డీలింగ్స్ విషయంలో ఇబ్బందులు వచ్చాయా అనే సందేహం వ్యక్తమౌతుంది. -
ఓటీటీలోకి 'జూనియర్'.. స్ట్రీమింగ్ డేట్ ప్రకటన
ఒక్క పాటతో గుర్తింపు తెచ్చుకున్న సినిమా 'జూనియర్'. శ్రీలీల వైరల్ వయ్యారి అని స్టెప్పులు వేసేసరికి ఈ చిత్రం అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయమైన ఈ మూవీ.. జూలైలోనే థియేటర్లలోకి వచ్చింది. కానీ ఓటీటీ రిలీజ్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. రీసెంట్‌గానే ఆహా లోకి వస్తుందని ప్రకటించారు. ఎప్పుడా అని నెటిజన్లు ఎదురుచూస్తుండగా ఇప్పుడు తేదీని కూడా అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: సగం వయసున్న వాళ్లతో డేటింగ్.. నేను కూడా రెడీ: హీరోయిన్ అమీషా పటేల్)కిరిటీ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించగా జెనీలియా కీలక పాత్రలో నటించింది. కాలేజీ బ్యాక్ డ్రాప్‌తో తీసిన ఎమోషనల్ మూవీ ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రంగానే ఆడిన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. తొలుత ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో ఈనెల 22 నుంచి అంటే సోమవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. మరోవైపు కన్నడ వెర్షన్.. నమ్మ ఫ్లెక్స్ అనే ఓటీటీలో ఇదే రోజునుంచి అందుబాటులోకి రానుందని ప్రకటించారు.'జూనియర్' విషయానికొస్తే.. ఇంజినీరింగ్ చదివే అభి(కిరీటి) జ్ఞాపకాలే ముఖ్యమనుకుని నమ్ముతాడు. అందుకు తగ్గట్లే కాలేజీలో నాలుగేళ్లు సరదాగా గడిపేస్తాడు. మంచి జ్ఞాపకాల్ని దాచుకుంటాడు. చదువు పూర్తయిన తర్వాత తాను లవ్ చేసిన స్ఫూర్తి (శ్రీలీల) పనిచేసే కంపెనీలోనే ఉద్యోగంలో చేరతాడు. కానీ బాస్ విజయ సౌజన్య (జెనీలియా)కి ఇతడంటే నచ్చదు. అలాంటి అభితో కలిసి అనుకోని పరిస్థితుల్లో విజయనగరం అనే ఊరికి వెళ్లాల్సి వస్తుంది. మరి విజయనగరానికి, విజయకి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: మౌళి.. రౌడీ టీ షర్ట్, మహేశ్ ట్వీట్.. ఇవన్నీ ఫేక్: బండ్ల గణేశ్) -
ఎట్టకేలకు ఓటీటీలోకి 'జూనియర్' సినిమా
కొన్నాళ్ల క్రితం వైరల్ వయ్యారి అంటూ శ్రీలీల పాట ఒకటి తెగ వైరల్ అయిపోయింది. ఇది 'జూనియర్' అనే సినిమాలోనిది. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధనరెడ్డి కొడుకు కిరీటి ఈ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. అయితే థియేటర్లలోకి వచ్చి దాదాపు రెండు నెలలు కావొస్తున్నా సరే ఇంకా ఓటీటీలోకి రాలేదు. అలాంటిది ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఓ అప్డేట్ వచ్చేసింది.కిరిటీ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించగా జెనీలియా కీలక పాత్ర పోషించింది. కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో మొదలై ఎమోషనల్‌గా సాగే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ అంతంత మాత్రంగానే ఆడింది. యావరేజ్ టాక్ దగ్గరే ఆగిపోయింది. లెక్క ప్రకారం ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. కానీ ఇప్పటివరకు స్ట్రీమింగ్ గురించి ఎలాంటి సౌండ్ లేదు. ఇప్పుడు ఆహా ఓటీటీ ఈ సినిమాని త్వరలోనే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే)అయితే ఈ శుక్రవారం(సెప్టెంబరు 19) నుంచే 'జూనియర్'.. ఆహా ఓటీటీలోకి రానుందని సమాచారం. ఒకవేళ ఇప్పుడు మిస్ అయితే మాత్రం వచ్చే వారం పక్కా. ఈ సినిమా విషయానికొస్తే.. జ్ఞాపకాలే ముఖ్యమనుకునే కుర్రాడు అభి(కిరీటి). కాలేజీలో నాలుగేళ్లు సరదాగా గడిపేస్తాడు. మంచి జ్ఞాపకాల్ని పోగుచేసుకుంటాడు. చదువు పూర్తయిన తర్వాత తాను ప్రేమించిన స్ఫూర్తి (శ్రీలీల) పనిచేసే కంపెనీలోనే జాబ్‌లో జాయిన్ అవుతాడు. కానీ అక్కడ బాస్ విజయ సౌజన్య (జెనీలియా)కి అభి అంటే నచ్చదు. విజయనగరం అనే ఊరు కూడా ఈమెకు నచ్చదు. అలాంటి ఇష్టం లేని ఊరికి, ఇష్టం లేని అభితో కలిసి విజయ్ వెళ్లాల్సి వస్తుంది. ఇంతకీ విజయనగరానికి, విజయకి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. మరి ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్‌లోకి సినిమా ఒకేసారి వస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా) View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
కిరీటి స్టెప్పులు, శ్రీలీల గ్రేస్.. వైరల్ వయ్యారి ఫుల్ సాంగ్ చూసేయండి
ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా నటించిన తొలి చిత్రం జూనియర్ (Junior Movie). ఇది మొదటి సినిమా అయినప్పటికీ కిరీటి నటనకు, ముఖ్యంగా అతడి డ్యాన్స్‌కు ఫుల్ మార్కులు పడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమానిని అని చెప్పుకునే ఇతడు ఆ హీరోకు తగ్గట్లుగానే డ్యాన్స్ చేశాడు. వైరల్ వయ్యారి సాంగ్‌లో ఎన్టీఆర్‌ను గుర్తుచేసేలా స్టెప్పులతో అదరగొట్టాడు.వైరల్ వయ్యారి ఫుల్ వీడియో సాంగ్శ్రీలీల (Sreeleela) గ్రేస్, ఎక్స్ప్రెషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎప్పటిలాగే చించిపడేసింది. ఒకరకంగా చెప్పాలంటే జూనియర్ సినిమాకు వైరల్ వయ్యారి పాట భారీ హైప్ తీసుకొచ్చింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. 4కె వర్షన్లో వైరల్ వయ్యారి సాంగ్ (Viral Vayyari Full Video Song)ను యూట్యూబ్‌లో అందుబాటులోకి తెచ్చారు. పోటాపోటీగా డ్యాన్స్ చేసిన కిరీటి, శ్రీలీలఇది చూసిన అభిమానులు.. శ్రీలీలకే పోటీ ఇచ్చేలా డ్యాన్స్ చేశాడని కిరీటిని ప్రశంసిస్తున్నారు. ఇక ఈ పాటకు రేవంత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. జూనియర్ సినిమా విషయానికి వస్తే.. కిరీటి, శ్రీలీల జంటగా నటించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీ జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: తిరుమలలో 'కిరణ్ అబ్బవరం' కుమారుడి నామకరణం -
తిరుమల శ్రీవారి సేవలో 'జూనియర్' హీరో కిరీటి (ఫొటోలు)
-
'జూనియర్' రెండు రోజుల కలెక్షన్ ఎంతంటే?
రీసెంట్గా థియేటర్లలో పలు చిత్రాలు రిలీజ్ కాగా.. 'జూనియర్' చిత్రానికి చెప్పుకోదగ్గ వసూళ్లు కనిపిస్తున్నాయి. కిరీటికి హీరోగా ఇదే తొలి సినిమా అయినప్పటికీ డ్యాన్సులు, ఫైట్స్, డైలాగ్స్ లాంటివి బాగా చెప్పడం.. దానికి తోడు 'వైరల్ వయ్యారి' పాట తెగ వైరల్ అయిపోయేసరికి జనాలు ఈ మూవీని చూసేందుకు ఓ మాదిరిగా థియేటర్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తొలిరోజు కంటే రెండో రోజు వసూళ్లు కాస్త ఎక్కువగానే వచ్చాయి. ఇంతకీ రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్ ఎంత?కిరీటి, శ్రీలీల, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని రెగ్యులర్ కమర్షియల్ తరహా కథతోనే తెరకెక్కించారు. అంతెందుకు గతంలో వచ్చిన తెలుగు చిత్రాల ఛాయలు కూడా చాలా కనిపిస్తాయి. అయితేనేం వేరే చిత్రాలేం లేకపోవడం దీనికి ఓ రకంగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.1.45 కోట్లు వసూళ్లు రాగా.. రెండో రోజు రూ.1.65 కోట్ల మేర కలెక్షన్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అంటే రెండు రోజులకు కలిపి రూ.3.10 కోట్ల మేర నెట్ కలెక్షన్ అందుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: హీరోయిన్‌తో ప్రేమ... పెళ్లి వాయిదా వేసిన విశాల్)హీరోగా కొత్త కుర్రాడు చేస్తున్నప్పటికీ ఈ మాదిరి వసూళ్లు అంటే కాస్త విశేషమనే చెప్పాలి. అయితే వచ్చేవారం థియేటర్లలోకి 'హరిహర వీరమల్లు' రానుంది. ఇంతలోనే 'జూనియర్' కలెక్షన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరి ఈ మూవీకి లాంగ్ రన్ అయ్యేసరికి ఎంత వసూళ్లు వస్తాయో చూడాలి?జూనియర్ విషయానికొస్తే.. జ్ఞాపకాలే ముఖ్యమనుకునే కుర్రాడు అభి(కిరీటి). కాలేజీలో సరదాగా గడుపుతూనే చదువులో మంచి ప్రతిభ చూపిస్తాడు. తను ప్రేమించిన శ్రీలీల పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. కానీ ఆ కంపెనీ బాస్ విజయ(జెనీలియా)కు అభి అస్సలు నచ్చడు. ఆమెకు తన పేరుతో ఉన్న విజయనగరం అనే ఊరు కూడా నచ్చదు. అలాంటిది అభితో కలిసి విజయ.. విజయనగరం వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? ఆ ఊరికి విజయకు సంబంధమేంటి అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సేనాని రూల్స్ మాట్లాడతారు.. పాటించరు) -
'జూనియర్' కలెక్షన్.. మొదటిరోజు అన్ని కోట్లా?
నిన్న అనగా శుక్రవారం రిలీజైన సినిమాల్లో కాస్తోకూస్తో 'జూనియర్' మంచి బజ్ సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్లే పాజిటివ్ టాక్ రావడంతో టికెట్స్ బాగానే సేల్ అయ్యాయి. కలెక్షన్ కూడా బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. గాలి జనార్ధనరెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయమైన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. ఇంతకీ ఈ మూవీ తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయి? తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం.కిరీటిని హీరోగా పరిచయం చేస్తూ 'జూనియర్' అనే సినిమాని దాదాపు రెండు మూడేళ్ల క్రితం ప్రకటించారు. షూటింగ్ పూర్తయినా సరే చాలా ఆలస్యమైన ఈ చిత్రం.. ఎట్టకేలకు తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ఈ వీకెండ్ చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేకపోవడంతో 'జూనియర్'కి ప్లస్ అయింది. అందుకు తగ్గట్లే తొలిరోజు రూ.1.4 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కన్నడ కంటే తెలుగులోనే ఎక్కువ మొత్తం వసూలు కావడం విశేషం.(ఇదీ చదవండి: 'మెగా' లీకులు.. నిర్మాతలు గట్టి వార్నింగ్)కిరీటి స్వతహాగా కన్నడ అయినప్పటికీ.. తెలుగులో 'జూనియర్' చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. దానికి శ్రీలీల ఓ కారణం కాగా, 'వైరల్ వయ్యారి' పాట తెగ వైరల్ కావడం మరో కారణం అని చెప్పొచ్చు. తొలిరోజు తెలుగులో రూ.1.25 కోట్లు రాగా.. కన్నడలో కేవలం రూ.15 లక్షలే వచ్చినట్లు తెలుస్తోంది తొలి సినిమానే అయినప్పటికీ కిరీటి డ్యాన్సులు, ఫైట్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మూవీ కోసం బడ్జెట్ కూడా గట్టిగానే పెట్టారు. అయితేనే తొలిరోజు మంచి వసూళ్లే వచ్చాయి. లాంగ్ రన్లో కాస్త చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రావడం గ్యారంటీ అనిపిస్తోంది.'జూనియర్' విషయానికొస్తే.. జ్ఞాపకాలే ముఖ్యమనుకునే కుర్రాడు అభి(కిరీటి). కాలేజీలో సరదాగా గడుపుతూనే చదువులో మంచి ప్రతిభ చూపిస్తాడు. తను ప్రేమించిన శ్రీలీల పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. కానీ ఆ కంపెనీ బాస్ విజయ(జెనీలియా)కు అభి అస్సలు నచ్చడు. ఆమెకు తన పేరుతో ఉన్న విజయనగరం అనే ఊరు కూడా నచ్చదు. అలాంటిది అభితో కలిసి విజయ.. విజయనగరం వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? ఆ ఊరికి విజయకు సంబంధమేంటి అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ) -
Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ
టైటిల్ : జూనియర్నటీనటులు: కిరీటి రెడ్డి, శ్రీలీల, జెనీలియా, డా. రవిచంద్రన్, రావు రమేశ్, సత్య, వైవా హర్ష తదితరులునిర్మాణ సంస్థ: వారాహి చలన చిత్రంనిర్మాత: రజని కొర్రపాటిరచన-దర్శకత్వం: రాధా కృష్ణసంగీతం: దేవిశ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్ కుమార్ఎడిటర్: నిరంజన్ దేవరమేనేవిడుదల తేది: జులై 18, 2025‘వైరల్ వయ్యారి..’ ఈ ఒక్క పాటతో ‘జూనియర్’ సినిమాకు భారీ హైప్ వచ్చింది. కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన తొలి చిత్రమిది. సోషల్ మీడియాలో వైరల్ పాట బాగా వైరల్ అవ్వడం.. శ్రీలీల, జెనీలియా లాంటి స్టార్స్ నటిస్తుండడంతో టాలీవుడ్‌లోనూ ఈ చిత్రంపై బజ్ క్రియేట్ అయింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘జూనియర్’(Junior Movie Review )పై భారీ అంచనాలు పెరిగాయి. మరి అంచనాలను ఈ చిత్రం అందుకుందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..విజయనగరానికి చెందిన కోదండపాణి(రవి చంద్రన్)-శ్యామల దంపతులకు ఆలస్యంగా పుట్టిన బిడ్డ అభి(కిరీటీ రెడ్డి). కొడుకు పుట్టగానే భార్య చనిపోతుంది. దీంతో కోదండ పాణి తన కొడుకుకు అన్నీ తానై పెంచుతాడు. తండ్రి-కొడుకు మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం.. ఆయన చూపించే అతిప్రేమ అభికి చిరాకు తెప్పిస్తుంది. తండ్రికి దూరంగా ఉండాలనే పైచదువుల కోసం సిటీకి వెళ్తాడు. ‘అరవయ్యేళ్లు వచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని మెమోరీస్ ఉండాలి కదా’ అంటూ స్నేహితులతో కాలేజీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. తోటి విద్యార్థిని స్పూర్తి(శ్రీలీల)తో ప్రేమలో పడి.. ఆమె పని చేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. తొలిరోజే తన ప్రవర్తనతో బాస్ విజయ సౌజన్య (జెనీలియా)కు చిరాకు తెప్పిస్తాడు. ఆ తర్వాత విజయ సౌజన్య గురించి ఓ నిజం తెలుస్తుంది. ఓ కారణంగా ఆమెతో కలిసి తన సొంతూరు విజయనగరానికి వెళ్తాడు. అభికి తెలిసిన నిజం ఏంటి? విజయనగరం గ్రామంతో విజయ సౌజన్యకు ఉన్న సంబంధం ఏంటి? అభి తండ్రి సొంత ఊరిని వదిలి ఎందుకు నగరానికి వచ్చాడు? కోదండ పాణికి, విజయ సౌజన్యకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..సినీ తారలు లేదా ప్రముఖ కుటుంబాల నుంచి ఎవరైనా హీరోగా సీనీ రంగంలోకి అడుగుపెడితే.. తొలి సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. హీరోగా రాణించగలడా? లేదా? అనేది తొలి సినిమాతోనే డిసైడ్ చెస్తారు. డెబ్యూ ఫిల్మ్‌తో కాస్త మెప్పించినా సరే.. భవిష్యత్‌కు ఢోకా ఉండదు. అందుకే వారసుల ఎంట్రీకి ప్రముఖ కుటుంబాలు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్ కథతో రావడానికి ట్రై చేస్తారు. తమ వారసుడిలో ఉన్న టాలెంట్ మొత్తాన్ని తొలి సినిమాలోనే చూపించేందుకు ప్రయత్నిస్తారు. కిరీటి రెడ్డి విషయంలోనూ అదే జరిగింది.(Junior Movie Review ) ప్రముఖులు వారసుల డెబ్యూ ఫిల్మ్‌కి కావాల్సిన అంశాలన్నింటిని కొలతలేసి మరీ ‘జూనియర్’ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రాధా కృష్ణ. హీరోని ఎలివేట్ చేసేలా యాక్షన్ సీన్స్, డ్యాన్స్, డైలాగ్స్ అన్నీ చక్కగా సెట్ చేసుకున్నాడు. కానీ కథ విషయంలో మాత్రం కొత్తగా ఆలోచించలేకపోయాడు. సినిమా ప్రారంభం మొదలు ఎండ్ వరకు ప్రతీ సన్నివేశం పాత సినిమాలను గుర్తు తెస్తుంది. కామెడీ బాగా పండడం.. పాటలు, యాక్షన్ సీన్లు ఆకట్టుకునేలా ఉండడంతో రొటీన్ కథే అయినా ప్రేక్షకులకు బోర్ కొట్టదు(Junior Movie Review). ఒక ఎమోషన్ సీన్‌తో కథను ప్రారంభించి.. కాసేపటికే కథను కాలేజీకి షిఫ్ట్ చేశాడు. హీరో ఎంట్రీ సీన్‌ని బాగా ప్లాన్ చేశారు. కాలేజీలో హీరోయిన్‌తో చేసే అల్లరి, స్నేహితులతో కలిసి చేసే కామెడీ బాగా వర్కౌట్ అయింది. జెనీలియా పాత్ర ఎంట్రీ తర్వాత కథనం కాస్త సీరియస్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితీయార్థంపై ఆసక్తి పెంచేలా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం మొత్తం గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. కొన్ని సన్నివేశాలు శ్రీమంతుడు, మహర్షి సినిమాలను గుర్తు తెస్తుంది. కొన్ని చోట్ల ఎమోషన్ బాగా పండింది కానీ కథనంలో మాత్రం కొత్తదనం అనిపించదు. ప్రతి సీన్ ఎక్కడో చూసినట్లుగానే అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఓ చిన్న ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. కథను ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. హీరో కిరీటిరెడ్డికి మాత్రం ఫర్ఫెక్ట్ డెబ్యూ ఫిల్మ్. మరి కమర్షియల్‌గా ఏ మేరకు ఆట్టుకుంటుందో చూడాలి. ఎవరెలా చేశారంటే..కిరీటీకి ఇది తొలి చిత్రమే అయినా తెరపై చూస్తే మాత్రం ఎంతో అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు. ఇక డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వైరల్ వయ్యారి పాటలో శ్రీలీలతో పోటీ పడి మరీ డ్యాన్స్ చేశాడు. కొన్ని స్టెప్పులు జూనియర్ ఎన్టీఆర్ స్థాయిలో వేశాడు. శ్రీలీల పాత్రకు ఈ సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేదు. కేవలం పాటల కోసమే అన్నట్లుగా ఆమె పాత్రని తీర్చిదిద్దారు. సెకండాఫ్ మొత్తంలో ఒక వయ్యారి పాటలో మాత్రమే కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత జెనీలియా ఓ మంచి పాత్రతో రీఎంట్రీ ఇచ్చింది. విజయ సౌజన్య పాత్రకు ఆమెకు న్యాయం చేసింది. అయితే నటించేందుకు ఆ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. హీరో తండ్రిగా రవిచంద్రన్ ఉన్నంతలో చక్కగా నటించాడు . వైవా హర్ష, సత్యల కామెడీ బాగా పండింది. రావు రమేశ్, అచ్యుత్ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి బిగ్ ఎసెట్. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. పాటలన్నీ ఆకట్టుకుంటాయి. వైరల్ వయ్యారి పాట బిగ్ స్క్రీన్‌పై ఇంకా బాగుంది. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌ని చాలా రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
బాహుబలి, ఆర్ఆర్ఆర్ కాదు.. రాజమౌళి బెస్ట్ ఫిల్మ్ ఇదేనట!
తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli). ఆయన కెరీర్లో అపజయం అనేదే తెలియదు. మర్యాద రామన్న అనే చిన్న సినిమా మొదలు.. ఆర్ఆర్ఆర్ అనే భారీ బడ్జెట్ చిత్రం వరకు అన్నీ సూపర్ హిట్లే. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో పాటు ఆస్కార్ మొదలు ఏన్నో అవార్డులను అందించాడు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో బెస్ట్ ఏదంటే.. చెప్పడం కష్టమే. ఎందుకంటే అన్నీ సినిమాలు అద్భుతమైనవే.అయితే చాలా మందికి బాహుబలి(bahubali), ఆర్ఆర్ఆర్(RRR)చిత్రాలంటే ఎక్కువ ఇష్టమని చెబుతుంటారు. మరి అదే ప్రశ్నను రాజమౌళిని అడిగితే.. బాహుబలి కాదు ఆర్ఆర్ఆర్ కాదు.. ఈగ తన ఫేవరేట్ ఫిల్మ్ అని చెబుతాడు. తాజాగా జరిగిన జూనియర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో రాజమౌళి ఈ విషయాన్ని చెప్పాడు.రాజమౌళికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ని తెరపై చూపిస్తూ.. అవి ఏ సినిమాకు సంబంధించినవో గుర్తించాలని యాంకర్ సుమ..జక్కన్నకు టాస్క్ ఇచ్చింది. అలా ఈగ సినిమా స్టిల్స్ రాగానే..జక్కన్న ‘నా ఫేవరేట్ ఫిల్మ్ ఈగ ’అని చెప్పాడు. దీంతో యాంకర్ సుమ.. మీ ఫేవరేట్ ఫిల్మ్ ఈగ అన్నమాట అనగే.. జక్కన్న నవ్వుతూ తల ఊపాడు.ఈగ సినిమాతోనే రాజమౌళికి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. చిన్న ఈగతో ఆయన చేసిన ప్రయోగం భారీ విజయాన్ని అందించింది. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వాడుకొని హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాను తీర్చిదిద్దాడు జక్కన్న. నాని, సమంత జంటగా నటించిన ఈ చిత్రం 2012లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. -
రెడ్ శారీలో ‘జూనియర్’మూవీ ఈవెంట్లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)
-
ఆ ఇద్దరు ప్రశంసించారంటే.. ఇక ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు: రాజమౌళి
‘‘సాయిగారు ‘జూనియర్’( Junior Movie) మొదలుపెట్టినప్పుడు... మంచి కథతో చిన్న చిత్రం ప్రారంభిస్తున్నారనుకున్నాను. అయితే శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్‌గారు... ఇలా నటీనటుల లిస్ట్ పెరుగుతూనే ఉంది. దేవిశ్రీ సంగీతం, సెంథిల్ సినిమాటోగ్రఫీ, ఫైట్‌మాస్టర్ పీటర్ హెయిన్స్... ఇలా ఒక్కొక్కరు యాడ్ అవుతూ ఉంటే ఓ పెద్ద సినిమాకి ఎలాంటి నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంచుకుంటామో అలా ‘జూనియర్’కి కూడా పెట్టుకుంటూ వెళ్లారు. అలా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా చేశారు’’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి(SS Rajamouli) అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్’. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయిక. డా. రవిచంద్రన్, జెనీలియా ఇతర పాత్రలు పోషించారు. వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎస్ రాజమౌళి బిగ్ టికెట్ లాంచ్ చేసిన అనంతరం మాట్లాడుతూ– ‘‘పెద్ద సినిమా అంటే బడ్జెట్ గురించి కాదు... ‘జూనియర్’ సినిమా వెయ్యికి పైగా స్క్రీన్స్‌లలో రిలీజ్ అవుతోందంటే అందుకు ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తే కారణం. ఈ చిత్రాన్ని తొలి రోజే, లేకుంటే తొలి వారమే మేము చూడాలని ఆడియన్స్‌కి ఆసక్తి ఉన్నప్పుడే అది ఎగ్జిబిటర్స్ వద్ద నుంచి డిస్ట్రిబ్యూటర్స్ వద్దకు వచ్చి ఆ తర్వాత నిర్మాత వద్దకు వచ్చి వెయ్యి స్క్రీన్లలో విడుదలవుతోంది. చిన్ని సినిమాగా స్టార్ట్ అయిన ఈ సినిమాని ఈ స్థాయికి తీసుకొచ్చిన సాయిగారికి అభినందనలు. నేను కూడా ఈ చిత్రం చూసేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. తన పాటలతో సినిమాని ఎలివేట్ చేయడం దేవిశ్రీకి బాగా తెలుసు. ‘వైరల్ వయ్యారి...’ పాట ఎంత వైరల్ అయ్యింది, ఎంత క్రేజ్ తీసుకొచ్చిందనే విషయం గురించి నేను చెప్పక్కర్లేదు. సెంథిల్ తను అనుకున్న ఔట్పుట్ వచ్చేవరకు ఎక్కడ కూడా రాజీపడడు. పీటర్ హెయిన్స్ క్రేజీ మ్యాన్... విపరీతంగా కష్టపడతాడు. కిరీటి చాలా బాగా చేశాడని సెంథిల్, పీటర్ వంటి వారు ప్రశంసించారంటే ఇక ఇండస్ట్రీలో నీకు(కిరీటి) ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. ఎంతో అంకితభావంతో రాధాకృష్ణ ఈ సినిమాని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈ చిత్రాన్ని అందరూ తప్పకుండా థియేటర్లలో చూడండి. మీ టికెట్ డబ్బులకు కచ్చితంగా పైసా వసూల్ సినిమాలా ఉంటుంది’’ అని చెప్పారు. -
‘జూనియర్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘సత్యం’ సినిమా చేయవద్దని చెప్పారు : జెనీలియా
‘‘నా కెరీర్ ప్రారంభం నుంచి ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రలు చేయాలనే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తూ వచ్చాను. ‘బొమ్మరిల్లు’లో నేను చేసిన హాసిని పాత్ర మరచిపోలేనిది. అలాగే ‘హ్యాపీ’లో మధుమతి, ‘కథ’ సినిమాలో చిత్ర.. ఇలా విభిన్నమైన పాత్రలు చేశాను. ‘తుజే మేరీ కసమ్’ (నువ్వేకావాలి హిందీ రీమేక్)తో హిందీలో ఎంట్రీ ఇచ్చాను. ఆ తర్వాత ‘బాయ్స్’ సినిమా చేశాను. ఆ వెంటనే ‘సత్యం’ సినిమా అంగీకరించాను. అయితే ఆ సమయంలో ‘సత్యం’ చేయవద్దని నాకు కొంత మంది చెప్పారు. కానీ కథ నచ్చడంతో నా మనసు మాటవిని ఆ సినిమా చేస్తే హిట్‌గా నిలిచింది. కథ మనకు నచ్చితే చేయాలి.. ఆ తర్వాత ప్రేక్షకులే మనల్ని గుర్తిస్తారు’’ అని నటి జెనీలియా తెలిపారు. కిరీటి రెడ్డి, శ్రీలీల జోడీగా, జెనీలియా కీలక పాత్రలో నటించిన చిత్రం ‘జూనియర్’. రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జెనీలియా విలేకరులతో మాట్లాడుతూ– ‘‘తండ్రీకొడుకుల కథే ‘జూనియర్’. ఈ చిత్రంలో నేను ఓ లేడీబాస్ తరహా పాత్ర చేశాను. కిరీటి పాత్రతో నా రోల్‌కు ఉండే రిలేషన్ ఏంటి? అనేది సినిమాలో చూడాలి. శ్రీలీల అమేజింగ్ నటి. దేవిశ్రీ ప్రసాద్‌గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సాయి కొర్రపాటిగారు గ్రాండ్‌గా నిర్మించారు. కథానాయికలకు పెద్దగా అభిమానులు ఉండరు. కానీ ‘బొమ్మరిల్లు’లో హాసిని పాత్రతో చాలా మంది నాకు అభిమానులయ్యారు. నా కెరీర్లో బిజీగా ఉన్నప్పుడే నా తొలి సినిమా ‘తుజే మేరీ కసమ్’ హీరో రితేష్‌ను వివాహం చేసుకున్నాను. పెళ్లి తర్వాత తెలుగు సినిమాల్లో గ్యాప్ వచ్చింది. మళ్లీ నేను తిరిగి తెలుగు సినిమాలు ఎప్పుడు చేస్తున్నానని నా అభిమానులు సోషల్ మీడియా వేదికగా అడుగుతూనే ఉన్నారు. వారిలో మహిళలు ఎక్కువమంది ఉండటం నాకు సంతోషంగా అనిపించింది. తెలుగు అభిమానులు నన్ను హాసినిగానే గుర్తుపెట్టుకున్నారు. ‘బొమ్మరిల్లు 2’ ఉంటుందేమో చూడాలి. నాకంటూ డ్రీమ్ రోల్స్ లేవు. అసలు నేను నటిని కావాలనుకోలేదు. అలాంటిది ఇండస్ట్రీలోకి రావడం, ఇన్ని పాత్రలు చేయడం, ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించడం... ఇవన్నీ నాకు కలగానే అనిపిస్తాయి. నా యాక్టింగ్ కెరీర్‌ను కొనసాగిస్తాను. చిన్న పాత్రా? పెద్ద పాత్రా? అనేది ముఖ్యం కాదు. నా పాత్ర కథపై ప్రభావవంతంగా ఉంటే చాలు. రామ్‌చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో నేను సినిమాలు చేశాను. వాళ్లందరూ ఇప్పుడు స్టార్స్ అయిపోయారు.. వాళ్ల ప్రయాణంలో భాగం కావడం నాకు సంతోషంగా ఉంది. ‘బొమ్మరిల్లు’ సినిమాలో కోట శ్రీనివాసరావుగారితో కలిసి నటించడాన్ని మర్చిపోలేను. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. పెళ్లి తర్వాత రితేష్– నేను మా ప్రొడక్షన్లో ‘వేద్’ (తెలుగు సినిమా మజిలీ మరాఠి రీమేక్) సినిమా చేశాం. మంచి ప్రేమకథ కుదిరితే మళ్లీ కలిసి నటిస్తాం’’ అని చెప్పారు. -
ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్, చరణ్‌ని చూసి అలా ఫీలయ్యా :జెనీలియా
జెనీలియా..ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. ఆమె కోసమే సినిమాకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాయ్స్, సత్యం, బొమ్మరిల్లు, హ్యాపీ, రెడీ, ఢీ చిత్రాలు సూపర్ హిట్‌గా నిలవడంలో జెనీలియా(Genelia) కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా బొమ్మరిల్లు బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే కారణం.. హాసిని పాత్రలో జెనీలియా కనబర్చిన నటననే. ఇప్పటికీ జెనీలియా అనగానే అందరికి హాసిని పాత్రే గుర్తొస్తుంది. ఆ ఒక్క సినిమాతో జెనీలియా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్, రామ్ పోతినేని..ఇలా అప్పటి యంగ్ హీరోలందరితోనూ నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతుంది ఈ అల్లరి బ్యూటీ. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటిస్తున్న తొలి సినిమా ‘జూనియర్’లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జెనీలియా మీడియాతో మాట్లాడుతూ.. టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వారితో కలిసి నటించినప్పుడు ఇంత గొప్ప స్టార్స్ అవుతారని ఊహించలేదని చెబుతోంది. ఇప్పుడు వాళ్లను స్టార్ హీరోలుగా చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.‘ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను చూసి.. ‘వీళ్లతోనేనా నేను నటించాను’ అనుకున్నా. ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు అని ఎప్పుడు చెబుతుంటాను. నిజంగా ఆయన సినిమా ఇండస్ట్రీకి ఒక వరం అని చెప్పాలి. మూడు పేజీల డైలాగుని కూడా సింగిల్ టేక్‌లో చెబుతుంటాడు. రామ్ చరణ్ అమెజింగ్. అతనితో కలిసి ఆరెంజ్ సినిమా చేశాను. ఆర్ఆర్ఆర్లో ఆయన ఫెర్పార్మెన్స్ బాగుంది. ఇక అల్లు అర్జున్.. చాలా ఎనర్జిటిక్ పర్సన్. హ్యాపీ సినిమా షూటింగ్ సమయంలో ఆయన చాలా హుషారుగా ఉండేవాడు. ఇప్పుడు వీరందరిని పాన్ ఇండియా స్టార్స్‌గా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది’ అని జెనీలియా చెప్పుకొచ్చింది. అలాగే ఇటీవల మరణించిన కోటా శ్రీనివాస్‌రావు గురించి మాట్లాడుతూ.. ‘ఆయన గొప్ప నటుడు. బొమ్మరిల్లు సినిమా షూటింగ్ సమయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఎలా నటించాలో చెప్పేవారు. ఆయనతో కలిసి రెడీ కూడా చేశాను. ఆయన మరణవార్త వినగానే దిగ్బ్రాంతికి గురయ్యాను. అంతగొప్ప నటుడితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం నా అదృష్టం’ అని జెనీలియా చెప్పింది.