‘జునూద్’ మాడ్యుల్లో మరో అరెస్టు
పశ్చిమ బెంగాల్లో పట్టుబడిన ఆషిఖ్ అహ్మద్
సిటీలో చిక్కిన నఫీజ్ ఖాన్‌కు అనుచరుడు
తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హత్యకు కుట్ర
సిటీబ్యూరో: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడి, దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ‘జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్’ మాడ్యుల్‌కు చెందిన మరో ఉగ్రవాది చిక్కాడు. పశ్చిమ బెంగాల్‌కు చెంది డిప్లమో విద్యార్థి ఆషిఖ్ అహ్మద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు గురువారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో పట్టుబడిన ‘జునూద్’ ఫైనాన్స్ చీఫ్ మహ్మద్ నఫీజ్ ఖాన్‌కు ఇతడు ప్రధాన అనుచరుడని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది జనవరి 22-23 తేదీల్లో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో వరుస దాడులు చేసిన ఎన్ఐఏ బృందాలు 12 మందిని, ఆపై మరో ఇద్దరిని అరెస్టు చేశాయి. వీరిలో నఫీజ్ ఖాన్‌తో పాటు ఒబేదుల్లా ఖాన్, మహ్మద్ షరీఫ్ మొహియుద్దీన్, అబు అన్స్ సిటీలోనే చిక్కారు. నఫీజ్ ఖాన్ ఈ మాడ్యుల్‌కు ఫైనాన్స్ చీఫ్‌గా ఉన్నాడు. ‘జునూద్ఋ’లోకి రిక్రూట్మెంట్, ఆయుధాలు, పేలుడు పదార్థాల శిక్షణ కోసం షఫీ ఆర్మర్ నుంచి ముంబైకి చెందిన ‘జునూద్’ మాడ్యుల్ చీఫ్ ముదబ్బీర్‌కు రూ.8 లక్షల హవాలా రూపంలో అందాయి. వీటి నుంచి రూ.2 లక్షల్ని హైదరాబాద్‌లో ఉన్న నఫీజ్‌కు పంపాడు. పేలుళ్ల ద్వారా విధ్వంసాలు సృష్టించడంతో పాటు టార్గెట్ చేసుకున్న ప్రముఖుల్నీ కాల్చి చంపడం ద్వారా టై క్రియేట్ చేయడానికి ‘జునూద్’ మాడ్యుల్ సిద్ధమైంది. దీని కోసం తుపాకులు, తూటాలను పశ్చిమ బెంగాల్లో ఖరీదు చేయాలని భావించింది. ఈ బాధ్యతల్ని స్వీకరించిన నఫీస్‌ఖాన్ పలుమార్లు పశ్చిమ బెంగాల్‌కు వెళ్లి వచ్చాడు. ఈ క్రవుంలో పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లా మజీర్‌పుర ప్రాంతానికి చెందిన ఆషిఖ్ అహ్మద్ ఇతనికి ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు. నఫీజ్ ఖాన్ పలుమార్లు దుర్గాపూర్ వెళ్లి ఆషిఖ్‌ను కలిశాడు. జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ బెంగాల్ యూనిట్‌కు నేతృత్వం వహించాల్సిందిగా సూచించాడు. మరికొందరు ఉగ్రవాదులతో కలిసి ఆ ప్రాంతంలో జరిగిన ఓ సమావేశంలోనూ నఫీజ్, ఆషిఖ్ పాల్గొన్నారు.
‘జునూద్’ మాడ్యుల్‌కు అవసరమైన ఆయుధాలు సమకూర్చడం, కొందరు యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు అంగీకరించాడు. ఈ మాడ్యుల్ టార్గెట్ చేసిన వారిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సైతం ఉన్నారని, దానికి సంబంధించిన రెక్కీ బాధ్యతల్ని ఆషిఖ్ చేపట్టాడని అధికారులు చెప్తున్నారు. ఇదిలాఉండగా న ఫీజ్ఖాన్ విచారణ చేసిన సవుయుంలో ఆషిఖ్ వివరాలను సేకరించారు. ఫిబ్రవరి 26న అదుపులోని తీసుకుని ప్రశ్నించి విడిచి పెట్టారు ఎన్ఐఏ అధికారులు విడిచిపెట్టారు. ఆ తర్వాత అతని తండ్రిని, అతనిని పలువూర్లు విచారించారు. ఆషిఖ్ ‘జునూద్’కు సహకరించడంతో పాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన మరో ఐదుగురిని ఆ మాడ్యుల్లో చేర్చడానికి ప్రయత్నించినట్లు ఆధారాలు లభించాయి. దీంతో గురువారం నిందితుడిని అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు ఢిల్లీ తరలించి అక్కడి పటియాల హౌస్‌లో ఉన్న ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి కోరడంతో న్యాయస్థానం ఐదు రోజులకు అప్పగించింది.