Justice Inquiry
-
మళ్లీ కోర్టుకెక్కిన నిర్భయ దోషి
న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం కేసు దోషి ముఖేష్ మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు. క్షమాభిక్ష కోరుతూ తాను పెట్టుకుని దరఖాస్తును రాష్ట్రపతి తిరస్కరించడాన్ని ముఖేష్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆర్టికల్32 కింద క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణపై న్యాయ విచారణ చేయాల్సిందిగా సుప్రీంకోర్టును కోరినట్లు ముఖేష్ తరఫు న్యాయవాది వృందా గ్రోవర్ తెలిపారు. 2012 నాటి నిర్భయ అత్యాచారం కేసులో ముఖేష్‌తోపాటు మరో ముగ్గురికి సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించగా.. వచ్చే నెల ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటలకు శిక్షను అమలు చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ లోపుగా దోషుల్లో ఒకరైన ముఖేష్ రాష్ట్రపతి జనవరి 17న తిరస్కరించిన క్షమాభిక్ష పిటిషన్‌పై కోర్టుకెక్కారు. తీర్పును సవరించాల్సిందిగా ముఖేష్, అక్షయ్ కుమార్‌లు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పటికే తిరస్కరించగా, పవన్ గుప్తా, వినÄŒæ శర్మలు సవరణ పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంది. తీహార్ జైలు అధికారులు తమకు అవసరమైన దస్తావేజులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని, దీనివల్ల తాము క్షమాభిక్ష, సవరణ పిటిషన్లు దాఖలు చేయలేకపోతున్నామని ఆరోపిస్తూ దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు ఒకటి శనివారం కొట్టివేసింది. -
ఆ అమ్మకాలను రద్దు చేయండి
సాక్షి, హైదరాబాద్: సదావర్తి సత్రం భూములను, మార్గదర్శకాలకు, నియమ నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం నామమాత్రపు ధరకే విక్రయించిన వ్యవహారంపై న్యాయ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఇప్పటికే జరిగిన సత్రం భూముల అమ్మకాలను రద్దు చేసి, దేవాలయాలు, సత్రాలు, మఠాలకు చెందిన భూములను అమ్మకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రూ.22.44 కోట్లు వెచ్చించి భూములు కొనుగోలు చేసిన మందల సంజీవరెడ్డి, సునీతారెడ్డి, చావలి కృష్ణారెడ్డి, సూర్యకిరణ్ మౌళి, డి.పవన్‌కుమార్, ఆర్.శివరామకృష్ణారెడ్డిలపై ఆదాయపు పన్ను శాఖ విచారణకు ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. ఇందులో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయశాఖ కమిషనర్, ప్రాంతీయ సంయుక్త కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సదావర్తి సత్రం ఈవో, ఆదాయపు పన్నుశాఖ చీఫ్ కమిషనర్, పెద్దకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, ఆయన సతీమణి లక్ష్మీపార్వతి, కుమారుడు నిరంజన్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక సీజే విచారించనున్నారు.