ఆ సినిమాలో తప్పు ఏముంది?: హైకోర్టు
న్యూఢిల్లీ: ఆమిర్‌ఖాన్ 'పీకే' సినిమాలో ఎటువంటి అభ్యంతరకర దృశ్యాలు లేవని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. హిందూ మతాన్ని, ఆచారాలను అవమానించే అంశాలేవీ సినిమాలో లేవని స్పష్టం చేసింది. 'పీకే'లో ఎటువంటి తప్పు లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ ఎండ్లా నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది.
సినిమాలో ఏం తప్పు ఉంది అని పిటిషనర్ ను ప్రశ్నించింది. ఇందులో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నట్టు తమకేమీ అనిపించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అజయ గౌతమ్ అనే వ్యక్తి దాఖలు చేసిన 'పిల్'పై కోర్టు బుధవారం విచారణ జరిపింది.