జస్టిస్ నాగార్జునరెడ్డిపై ఆరోపణలన్నీ అవాస్తవాలే..
⇒ హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
⇒ రామకృష్ణ సమర్పించినవన్నీ తప్పుడు డాక్యుమెంట్లే
⇒ ఆయన పిటిషన్లో ఏమాత్రం పసలేదు
⇒ అనుబంధ పిటిషన్ను కొట్టివేసిన న్యాయస్థానం
సాక్షి, హైదరాబాద్: జస్టిస్ సి.వి.నాగార్జున రెడ్డిపై సస్పెండైన న్యాయాధికారి ఎస్.రామ కృష్ణ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఉమ్మడి హైకోర్టు తేల్చింది. అవాస్తవ ఆరోపణ లు చేయడమే కాకుండా అవి నిజమైనవేనని నమ్మించేందుకు రామకృష్ణ తప్పుడు డాక్యు మెంట్లు సమర్పించాడని స్పష్టం చేసింది. రామకృష్ణ అబద్ధాలనే పునాదిపై అవాస్తవాలు.. అభూత కల్పనలు.. తప్పుడు డాక్యు మెంట్లు.. స్థిరత్వం లేని, పరస్పర విరుద్ధమైన వాదనలను ఇటుకలుగా పేర్చి ఈ కేసును నిర్మించారంటూ న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ నిర్మాణానికి రకరకాల రంగులను అద్దారని దుయ్యబట్టింది.
జస్టిస్ నాగార్జునరెడ్డి, ఆయన సోదరుడు, మరికొం దరు కిందికోర్టు ఉద్యోగులపై ఆరోపణలు చేస్తూ రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్లో ఏమాత్రం పస లేదని పేర్కొంది. ఈ కేసులో జస్టిస్ నాగార్జునరెడ్డిని ప్రతివాదిగా చేర్చాలం టూ రామకృష్ణ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను కొట్టేసిం ది. ఈ మేరకు న్యాయ మూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమ ణియన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన హైకోర్టు ధర్మాసనం తాజాగా తీర్పు వెలువ రించింది. రామకృష్ణ లేవనెత్తిన అంశాలకు, అతడు సమర్పించిన డాక్యుమెంట్లకు ఎటువంటి విశ్వసనీయత లేదని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో రామకృష్ణ తీరును, అతడి దురుద్దేశాలను ధర్మాసనం తన తీర్పులో ఎండగట్టింది.
సస్పెన్షన్ ఎత్తివేత కోసం పిటిషన్
న్యాయాధికారిగా పనిచేస్తున్న సమయంలో పలు తీవ్రమైన ఆరోపణలు రావడంతో రామ కృష్ణను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వు లిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన తన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరు తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేగాక తానిచ్చిన వినతి పత్రాల ఆధారంగా హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి, ఆయన సోదరుడు, కిందికోర్టు ఉద్యోగులపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ వ్యాజ్యంలో ఆయన జస్టిస్ నాగార్జునరెడ్డిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చగా, ధర్మాసనం ఆయన పేరును తొలగించింది.
తరువాత ఈ వ్యాజ్యంపై జస్టిస్ వి.రామసు బ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణ జరుగు తుండగానే, జస్టిస్ నాగార్జునరెడ్డిని ప్రతివా దిగా చేర్చాలని రామకృష్ణ మరోసారి న్యాయ స్థానాన్ని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖ లు చేశారు. దీనిపై విచారణ జరిపి, గత నెల 28న తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం గురు వారం ఉదయం తన తీర్పును వెలువరిం చింది. తీర్పు సారాంశం ఇది... జస్టిస్ నాగార్జునరెడ్డి రాయచోటిలోని తన ఇంటిలో 13.2.2013న తనను కిందికోర్టు సిబ్బందిపై పెట్టిన కేసుల ను ఉపసంహరిం చుకోవాలని ఒత్తిడి చేశారని రామకృష్ణ తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఇందుకు తాను నిరాకరించడం తో నాగార్జునరెడ్డి, ఆయన సోదరుడు తనను కులం పేరుతో దూషించారని చెప్పారు. ఈ ఘటనను తాను 14.2.2013న హైకోర్టుకు వినతి పత్రం రూపంలో వివరించానన్నారు. వాస్తవానికి రామకృష్ణ మొదటిసారి 18.2. 2013న హైకోర్టుకు వినతిపత్రం పంపారు. 14.2.2013న వినతిపత్రం అసలు హైకోర్టుకే అందలేదు. అసలు రామకృష్ణ తమకు ఎలాం టి వినతిపత్రం పంపలేదంటూ హైకోర్టు రిజిస్ట్రీ దాఖలు చేసిన కౌంటరే ఇందుకు సాక్ష్యం. అంతేగాక రామకృష్ణ తన తరువాతి వినతి పత్రాల్లో పేర్కొన్న విషయాలన్నీ అతడు అల్లిన కట్టుకథలో భాగమే.
మరణ వాంగ్మూలం.. రామకృష్ణ సృష్టే
రామకృష్ణ గతంలో కోర్టుకు సమర్పించానని చెప్పిన వినతిపత్రాల్లో మరణ వాంగ్మూలం గురించి ప్రస్తావించలేదు. హఠాత్తుగా తాను దాఖలు చేసిన వ్యాజ్యం ద్వారా తెరపైకి తీసుకొచ్చారు. 20.11.2012న 95 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తి మరణ వాంగ్మూలాన్ని నమోదు చేశానని రామకృష్ణ చెబుతున్నారు. 95 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి మరణ వాంగ్మూలం ఇచ్చేందుకు స్పృహలో ఉంటారా? డాక్టర్ సమక్షంలో మరణ వాంగ్మూలం నమోదు చేశానని రామకృష్ణ చెప్పారు. మరోచోట వాంగ్మూలం నమోదు మధ్యలోనే డాక్టర్ కేశవరాజు రూమ్ నుంచి వెళ్లిపోయారని, మళ్లీ తిరిగి రాలేదని రామకృష్ణ రాశారు. దీన్నిబట్టి ఆయన తాను నమోదు చేశానని చెబుతున్న ఈ మరణ వాంగ్మూలంలోని కథంతా అతను వండినదే.
అప్పుడు గగ్గోలు.. తరువాత వక్రమార్గాలు
ఓ వ్యక్తి తన చుట్టూ తాను సృష్టించుకున్న పరిస్థితుల నుంచి బయటకు రాలేనప్పుడు ఇలాంటి చర్యలకు దిగుతాడు. కాబట్టి రామ కృష్ణ ఇదంతా ఎందుకు చేశారన్నది సుస్పష్టం. ఆయన ఈ వ్యవహారంలో మరో న్యాయమూ ర్తి (అప్పటి విజిలెన్స్ రిజిస్ట్రార్)పై కూడా పిటి షన్ దాఖలు చేశారు. దానిని మేం ప్రాథమిక దశలోనే కొట్టేశాం. అసలు రామకృష్ణ దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యమే చెల్లదన్నది మా నిర్ధిష్ట అభిప్రాయం. ఈ కేసును హైకోర్టు విచారించడం లేదంటూ అరచి గగ్గోలు పెట్టిన రామకృష్ణ, విచారణ ప్రారంభమైన తరువాత వక్రమార్గాలను అనుసరించారు.
సెలవులో వ్యక్తి నాగార్జునరెడ్డి ఇంటికి ఎలా వెళ్లారు?
రామకృష్ణ 2013 ఫిబ్రవరి 8 నుంచి 15వ తేదీ వరకు సెలవులో ఉన్నారు. 15వ తేదీ వరకు సెలవులో ఉన్న వ్యక్తి 13వ తేదీన జస్టిస్ నాగార్జునరెడ్డి ఇంటికి ఎలా వెళ్లినట్లు? రామకృష్ణ మొదటి వినతి పత్రం ఇచ్చింది 2013 ఫిబ్రవరి 18న. అందులో ఎక్కడా కూ డా నాగార్జునరెడ్డి తనను ఇంటికి పిలిపించి ప్రశ్నించారన్న ఆరోపణ చేయలేదు. దీన్ని గుర్తించిన రామకృష్ణ 2013 ఫిబ్రవరి 14న వినతి పత్రం సమర్పించినట్లు ఓ డాక్యుమెంట్ను సృష్టించారు. ఈ తప్పుడు డాక్యుమెంట్నే కోర్టుకు సమర్పించారు.