బీసీసీఐ పిటిషన్పై ఆదేశాలు నిలుపుదల
న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనల అమలుపై బీసీసీఐ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరం తెలుపుతూ ఇంతకుముందే దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు తమ ఆదేశాలను నిలుపుదల చేసింది. అలాగే ఆయా క్రికెట్ సంఘాలకు నిధుల పంపిణీ, వాటి వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇటీవల గోవా క్రికెట్ సంఘం నిధులను దుర్వినియోగం చేసినందుకు వారి ఆఫీస్ బేరర్ల అరెస్ట్ విషయం కోర్టు గుర్తుచేసింది. ఎలాంటి వినియోగ సర్టిఫికెట్స్ లేకుండానే బీసీసీఐ ఎందుకు నిధులను పంపిణీ చేస్తుందని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎఫ్ఎంఐ కలీఫుల్లాలతో కూడిన బెంచ్ ప్రశ్నించింది.