Justice Vamanrao
-
ఒక్క వాయిదాకు లక్షల్లో ఫీజులా?!
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఒక్కో వాయిదాకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున ఫీజులు వసూలు చేస్తుండటంపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వామననావు అభ్యంతరం తెలిపారు. ఇలా భారీ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తుండటంపై పునరాలోచన చేయాలని కోరారు. కోర్టులో కేసు విచారణకు రాకపోయినా ఫీజు తీసుకుంటున్నారని, ఈ తరహా దోపిడీ విధానానికి స్వస్తి పలకాలని కోరారు. ఢిల్లీలో రాజీకి వచ్చిన ఒక కేసులో రూ.30 లక్షల ఫీజు తీసుకున్నారని, ఈ విధానం కొనసాగితే రాజీకొచ్చిన కంపెనీల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లో అంతర్జాతీయ వివాదాల పరిష్కారాల ప్రత్యామ్నాయ కేంద్రం (ఐసీఏఆర్‌డీ)–హైదరాబాద్ సెంటర్, తెలంగాణ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సంయుక్తంగా ‘వాణిజ్య వివాదాల సత్వర పరిష్కారం–న్యాయ సంస్కరణలు’అనే అంశంపై సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. కేసులో వాదనలకు ఒక్క వాయిదాకే రూ.లక్షలు వసూలు చేసే విధానాన్ని నియంత్రించాలని, ఈ తరహా న్యాయ సంస్కరణలు చాలా అవసరమని అన్నారు. వాది ప్రతివాదులు కేసును రాజీ చేసేందుకు మధ్య వర్తిత్వ వాదనలు ఫైవ్ స్టార్ హోటల్స్‌లో నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘పేటెంట్ రైట్స్’పై శిక్షణ ఇవ్వాలి పేటెంట్ రైట్స్ గురించి మాట్లాడుతూ.. కింది కోర్టుల్లో చాలా మంది జడ్జీలకు ఈ అంశంపై అవగాహన లేదని, వారికి జ్యుడీషియల్ అకాడమీలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని జస్టిస్ వామనరావు అన్నారు. ఐసీఏఆర్‌డీకి వచ్చిన కేసు మూడు నెలల్లో పరిష్కారం అవుతోందని, కేసులు రాజీ చేయడంలో ప్రపంచంలో భారత్ 145వ స్థానంలో ఉండేదని, సంస్కరణల ఫలితంగా 100వ స్థానానికి వచ్చిందని ఐసీఏఆర్‌డీ–హైదరాబాద్ కేంద్ర కార్యదర్శి జేఎల్ఎన్ మూర్తి చెప్పారు. గ్రామీణ జనాభాను దృష్టిలో పెట్టుకుని పేటెంట్ రైట్స్ తీసుకురావాలని వర్డిక్ట్ ఐపీ వ్యవస్థాపకుడు అశోక్ రామ్ కుమార్ అన్నారు. సాఫ్ట్‌వేర్‌లో భారతీయులు, ప్రధానంగా తెలుగు వారు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నా సాఫ్ట్‌వేర్‌పై పేటెంట్ రైట్స్ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పేటెంట్ రైట్స్ పొందడం వల్లే రెడ్డి ల్యాబ్స్ ఉత్పత్తి చేసిన మందును గత ఇరవై ఏళ్లుగా ఇతర దేశాలు ఉత్పత్తి చేయనీయకుండా అడ్డుకుందని, ఇదే తరహాలో గ్రామీణ స్థాయిలో పేటెంట్ రైట్స్ పొందాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పారు. సీఐఐ డైరెక్టర్ సుభజిత్ షా తదితరులు ప్రసంగించారు. -
గర్భస్థ శిశువు నుంచే హక్కులు ప్రారంభం
కాచిగూడ: అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం, ఆహారం సక్రమంగా లభించినప్పుడే మానవ హక్కులు సాధించినట్టని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వామనరావు అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం తెలంగాణ సిటిజన్స కౌన్సిల్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. బర్కత్‌పురలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ (నిఫ్డ్)లో జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మానవ హక్కుల కమిషన్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇ.ఇస్మాయిమాట్లాడుతూ.. సమానత్వ హక్కు శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మొదలవుతుందని, శిశువు పుట్టిన తర్వాత ఆహారం, పోషణ, విద్య, ఆటలు, ఉద్యోగం, పర్యావరణం, గాలి, నీరు, రోడ్లు, కమ్యూనికేషన్ సౌకర్యం, ధ్వనికాలుష్యం, వంటివి వారి ప్రాథమిక హక్కులుగా గుర్తించబడతాయని ఉదహరించారు. తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. హక్కులపై ఇలాంటి అవగాహన కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి చైతన్యం పెంచాలన్నారు. ఇందులో తెలంగాణ సిటిజన్స కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయణ్ ముదిరాజ్, నిఫ్డ్ డెరైక్టర్ కె.రాము, తెలంగాణ దళిత హక్కుల పరిరక్షణ ఫోరం అధ్యక్షుడు జి.కృష్ణ, హైకోర్టు న్యాయవాది ఎస్.కృష్ణశర్మ, టీసీసీ కార్యదర్శి జి.వీరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 40 సంవత్సరాలకు పైగా మానవ హక్కుల కమిషన్‌తో పాటు హక్కులపై ప్రజలకు అవగాహన కల్గించిన జస్టిస్ ఇస్మాయిల్‌ను ఘనంగా సత్కరించారు. హక్కుల ఉల్లంఘనపై సీఎఫ్‌హెచ్‌ఆర్‌ఏ ఆగ్రహం నాంపల్లి: దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన పెరుగుతోందని సిటిజన్ ఫస్ట్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ (సీఎఫ్‌హెచ్‌ఆర్‌ఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎఫ్‌హెచ్‌ఆర్‌ఏ ఆధ్వర్యంలో శనివారం గన్‌పార్కు వద్ద ర్యాలీ నిర్వహించారు. సీఎఫ్‌హెచ్‌ఆర్‌ఏ దక్షిణ భారత అధ్యక్షుడు యనమల రాజు మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దులో కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జయలలిత మృతిలో నిజనిజాలు చెప్పకుండా వంద మంది చావుకు కారణమైన అపోలో ఆస్పత్రి, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శాలిని జాదవ్, ఆరిఫ్ నాగలక్ష్మి, చంద్రశేఖర్, జాఫర్, లక్ష్మి, జగదీశ్వరి, నాగార్జున, ఆవుల వెంకటేష్ పాల్గొన్నారు.