jute industry
-
ఖైదీల రూటు జ్యూట్ వైపు
కలకత్తా వాసి చైతాలి దాస్ వయసు 50 ఏళ్లు. గోల్డెన్ ఫైబర్‌గా పిలిచే జ్యూట్ పరిశ్రమను స్థాపించడంలోనే కాదు అందుకు తగిన కృషి చేసి గోల్డెన్ ఉమన్‌గా పేరొందింది చైతాలి. ముఖ్యంగా ఖైదీలతో కలిసి జనపనార ఉత్పత్తులను తయారు చేస్తూ, వ్యాపారిగా ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ‘జనపనారను పర్యావరణ అనుకూలమైన, విస్తృతంగా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఇది మన సాంస్కృతిక గొప్పతనాన్నీ పెంచుతుంది. నా ఫౌండేషన్ ద్వారా ఖైదీలను ఆదుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని వివరించే చైతాలి ఆలోచనలు మన దృష్టి కోణాన్ని కూడా మార్చుతుంది. చైతాలి మొదలు పెట్టిన ప్రయాణం ఆమె మాటల్లోనే... ‘‘నేను పుట్టి పెరిగింది పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్. మా ఇల్లు సెంట్రల్ జైలు, ప్రెసిడెన్స్ కరెక్షనల్ హోమ్ మధ్య ఉండేది. ఎందుకో తెలియదు కానీ ఆ జైలు జీవితం గడుపుతున్నవారి గురించి తెగ ఆలోచించేదాన్ని. మా నాన్న లాయర్ కావడం కూడా అందుకు మరో కారణం. నాన్నతో కలిసి ఆయన ఆఫీసుకు, పోలీస్ స్టేష¯Œ కు, సెంట్రల్ జైలుకు వెళ్లడం వల్ల నాలో అక్కడి వాతావరణం ఒక ఉత్సుకతను రేకెత్తించేది. జైలు గోడల లోపలి జీవితం ఆశ్చర్యపోయేలా చేసేది. కటకటాల వెనుక ఉన్న జీవితాలను, అక్కడ వాళ్లు ఎలా ఉంటారో చూపించే సినిమాలను చూడటం స్టార్ట్ చేశాను. రాత్రిళ్లు నిద్రపోయాక మా ఇంటికి సమీపంలో ఉన్న జూ నుంచి పులుల గర్జనలు వినిపించేవి. అర్ధరాత్రి సమయాల్లో పోలీసుల విచారణ, ప్రజల అరుపులు, కేకలు వినిపిస్తుండేవి. ఆ శబ్దాలు నాలో భయాన్ని కాకుండా దృష్టికోణాన్ని మార్చాయి. శాశ్వత ముద్ర నా చిన్నతంలో కొన్నిసార్లు మా నాన్నగారు కోర్టుకు తీసుకెళ్లారు. మొదటిసారి వెళ్లినప్పుడు నిందితులను కోర్టు హాలుకు తీసుకురావడం, పోలీసు వ్యాన్‌లో నుంచి వ్యక్తులు దిగడం గమనించాను. నా ఉత్సుకత తారస్థాయికి చేరుకుంది. మా నాన్న సహోద్యోగులలో ఒకరిని ‘ఎవరు వాళ్లు’ అని అడిగాను. తప్పు చేసినవారిగా ముద్రపడి, పర్యవసనాలను ఎదుర్కొనేవారు అని చెప్పారు. నేను అక్కడే నిలబడి గమనిస్తూ ఉన్నాను. వారి కుటుంబ సభ్యులు వారి వైపు పరిగెత్తుకుంటూ రావడం, ఆ వెంటనే వారి మధ్య ఉద్వేగభరితమైన సంభాషణలు విన్నాను. వారి బాధలు చూస్తుంటే ఏదైనా సాయం చేయాలనిపించేది. స్వచ్ఛంద సంస్థలతో కలిసి.. కాలక్రమంలో చదువుతోపాటు ఇతరులకు సాయం చేసే మార్గం కోసం చాలా అన్వేషించాను. అందులో భాగంగా వివిధ ఎన్జీవోలతో కలిసి పనిచేశాను. 2015లో చైతాలి రక్షక్ ఫౌండేషన్‌కు పునాది పడింది. ఈ ఫౌండేషన్ మగ, ఆడ ఖైదీలు, ఇతర నిరుపేద మహిళలకు సాధికారత కల్పించడంపై దృష్టి పెడుతుంది. మొదటిసారి కరెక్షనల్ హోమ్‌లో నా పనిని ప్రారంభించాను. మొదట్లో స్పోకెన్ ఇంగ్లిషుపై దృష్టి పెట్టాను. మహిళలు, ఖైదీలతో కుకీలను తయారు చేయించడం, యోగాను పరిచయం చేయడం, చెక్కపనిలో పాల్గొనడం, పెయింటింగ్ సెషన్లు నిర్వహించడం వంటి అనేక ప్రాజెక్ట్‌లు చేపట్టాను. ఆ ప్రాజెక్ట్‌లు విభిన్న కార్యక్రమాలను ప్రతిబింబించేవి. అంతర్జాతీయంగా... బెంగాల్ జనపనార పరిశ్రమలో సుమారు 40 లక్షల మంది ఉన్నారు. నేను, ఖైదీలతో జనపనార ఉత్పత్తులను రూపొందించడంలో నిమగ్నమై ఉన్నాను. వివిధ ప్రదేశాలలో వారి సృజనాత్మక ఉత్పత్తులను ప్రదర్శనకు పెడుతుండేదాన్ని. ఆ తర్వాత వివిధ ఈ–ప్లాట్ఫార్మ్స్, జాతీయ– అంతర్జాతీయ వేదికలపైకి కూడా వారి జనపనార ఉత్పత్తులను తీసుకెళ్లాను. ౖఖైదీలకు శిక్షణ ఇవ్వడానికి నేషనల్ జ్యూట్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎన్జెబి)తో కనెక్ట్ అయ్యాను. శిక్షణ ద్వారా ఉత్పత్తులు కూడా పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా జ్యూట్ ఉత్పత్తుల తయారీలో దాదాపు మూడు వేల మంది ఖైదీలకు శిక్షణ ఇచ్చాం. దీంతో ఈ ప్రాజెక్ట్ ‘రూట్ టు జ్యూట్’గా రూపుదిద్దుకుంది. ముఖ్యంగా దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇంక్యుబేట్ చేసింది. మా స్టార్టప్ హస్తకళలు, రగ్గులు, హ్యాండ్‌బ్యాగులు వంటి జనపనార ఉత్పత్తులను తయారు చేస్తుంది. 2021 జనవరి 7న రూపొందించిన అతిపెద్ద జ్యూట్ బ్యాగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. యువత కోసం.. ప్రత్యేకంగా విభిన్నరకాల ఉత్పత్తులను అందిస్తున్నాం. ఫ్యాషన్‌లో భాగంగా యువతకు చూపుతున్నాం. యూనివర్శిటీ లేదా కాలేజ్ నుండి బయటికి వచ్చే విద్యార్థులు జ్యూట్ బ్యాగ్‌లను ధరించి వెళుతుండగా చిత్రీకరించి ప్రదర్శిస్తుంటాం. ఇది వారిలో ఆసక్తిని పెంచుతుంది. తప్పు చేసిన వారిని ప్రజలు నేరస్తులుగా చూస్తారు. అయినప్పటికీ ఈ వ్యక్తులు ఉత్పత్తులను రూపొందించడంలో నిమగ్నమైనప్పుడు వారి అవగాహనలో మార్పు కలుగుతుంది. జనం కూడా వారిని అభినందించడం ప్రారంభిస్తారు. ఇలా క్రమంగా అందరిలోనూ అంగీకారం పెరుగుతుంది. తప్పు చేసినవారు లేదా దోషులుగా ముద్రపడిన వ్యక్తులు కూడా మార్పు చెందగలరు’ అని తన కృషి ద్వారా చూపుతోంది చైతాలి. -
జనుము సాగుకు పెట్టుబడి ఖర్చు పెద్దగా ఉండదు
-
మూడు జిల్లాల్లో జూట్ పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూట్ పరిశ్రమల స్థాపనకు మూడు ప్రసిద్ధ కంపెనీలు ముందుకొచ్చాయి. రూ.887 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు గ్లోస్టర్ లిమిటెడ్, కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్, ఎంజీబీ కమోడిటీస్ లిమిటెడ్ కంపెనీలు అంగీకరించి శుక్రవారం ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో గ్లోస్టర్ కంపెనీ రూ.330 కోట్లు, కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం అగ్రో లిమిటెడ్ రూ. 254 కోట్లు, సిరిసిల్ల జిల్లాలో ఎంజీబీ కమోడిటీస్ లిమిటెడ్ రూ. 303 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నాయి. ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా 10 వేల నాలుగు వందల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది. గురువారం హైదరాబాద్ సోమాజిగూడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మూడు కంపెనీలు ఐటీ మంత్రి కేటీఆర్, వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ల సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. కేటీఆర్ మట్లాడుతూ రాష్ట్రంలో ఇంతవరకు జూట్ పరిశ్రమ లేదని, ఈ మూడు పరిశ్రమలు ఉత్పత్తి చేసే ఉత్పత్తులను తెలంగాణ అవసరాల కోసం కొనుగోలు చేస్తామని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో భారీ మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాల్సిన అవసరం ఉందన్నారు. జూట్ పరిశ్రమలకు అవసరమైన జనపనార పంట పండించడం ద్వారా రైతులు లాభాలు పొందవచ్చని తెలిపారు. ఈ మూడు పరిశ్రమలతోపాటు మరిన్ని యూనిట్లు పెట్టేందుకు ముందుకు వచ్చేవారికి అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తామన్నారు. జనపనార పంటలకు ప్రోత్సాహం మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ జనపనార పంటలు పండించేలా రైతులను ప్రోత్సహిస్తామని, ఈ మేరకు వ్యవసాయ శాఖ తరఫున ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. మంత్రి గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలో పంటల దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగిందని, దీనికి అనుగుణంగా గన్నీ బ్యాగుల అవసరం గత ఏడేళ్లుగా 3.20 కోట్ల నుంచి 50 కోట్లకు పెరిగిందని చెప్పారు. దీంతో పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఏపీల నుంచే రూ. 49.26 నుంచి రూ. 61.78కి ఒక్కో గన్నీ బ్యాగును సేకరిస్తున్నామని, ట్రాన్స్పోర్ట్ కోసం రూ. 2.36 వరకు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కొత్త జూట్ మిల్లుల ఏర్పాటుతో రాష్ట్ర అవసరాలు తీరడంతోపాటు నిధుల ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు. గన్నీలతోపాటు కూరగాయల బ్యాగులు, చేసంచులు, ఇతర ఉత్పత్తుల వల్ల మితిమీరిన ప్లాస్టిక్ వినియోగాన్ని సైతం అరికట్టి పర్యావరణ పరిరక్షణకు దోహదపడవచ్చని అన్నారు. -
జౌళి సంచుల్లోనే ఆహార ధాన్యాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జౌళి పరిశ్రమకు ఊతమిచ్చే నిర్ణయం తీసుకుంది. ఆహార ధాన్యాలను తప్పనిసరిగా జనపనార బస్తాల్లోనే నిల్వ చేయాలనే నిబంధనను పొడగించే ప్రతిపాదనకు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘100 శాతం ఆహార ధాన్యాలను, 20% పంచదారను కచ్చితంగా జనపనార సంచుల్లోనే నిలువ చేసే నిబంధనను పొడగించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది’ అని ఆ భేటీ అనంతరం ఒక అధికారిక ప్రకటన వెలువడింది. పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లోని రైతులు, కార్మికులకు ఈ నిర్ణయం లబ్ధి చేకూరుస్తుందని కేంద్ర మంత్రి జవదేకర్ తెలిపారు. రూ. 7500 కోట్ల విలువైన జౌళి సంచులను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. జౌళి సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ‘జ్యూట్ ఐకేర్’ ద్వారా రైతులకు ఆధునిక సాగు విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలనే భారత జౌళి కార్పొరేషన్ 10 వేల క్వింటాళ్లæ విత్తనాల పంపిణీ కోసం నేషనల్ సీడ్స్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. డ్యామ్‌ల నిర్వహణకు ఆమోదం రానున్న పదేళ్లలో 19 రాష్ట్రాల్లోని 736 ఆనకట్టల నిర్వహణ, ఆధునీకరణ కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పదేళ్ల ప్రణాళికలో భాగంగా రూ. 10,211 కోట్లతో ఈ కార్యక్రమ రెండో, మూడో దశ పనులు పూర్తి చేస్తామని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, మరో సంస్థ 80% నిధులు సమకూర్చాయని వెల్లడించారు. ఈ పథకం తొలి దశ 2020లో ముగిసిందని పేర్కొన్నారు. తొలి దశలో ఏడు రాష్ట్రాల్లోని 223 ఆనకట్టల నిర్వహణ చేపట్టామన్నారు. -
రోడ్డున పడిన 3లక్షల మంది కార్మికులు
కొత్తవలస రూరల్: కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు తీసుకుం టున్న నిర్ణయాలతో భారతదేశంలో 3 లక్షల మంది జూట్ కార్మికులు రోడ్డున పడ్డారని వారి ఉపాధికి వేటు పడిందని రాష్ట్ర ఇప్టూ ఉపాధ్యక్షుడు పి ప్రసాద్ ఆందోళన వ్యక్తంచేశారు. కొత్తవలస మండలంలో మూతపడిన ఉమా జూట్ ట్విన్ మిల్స్ మూడు మిల్లుల కార్మికుల స మస్యలు తీర్చేందుకు బుధవారం ఏర్పాటుచేసిన సాధారణ సమావేశాన్ని ఇప్టూ రాష్ర్టకార్యదర్శి పి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రసాధ్ మాట్లాడుతూ భారత దేశంలో వస్త్ర రంగం తరువాత జూట్ పరిశ్రమకు 170 సంవత్సరాల చరిత్ర ఉందని, తరతరాలుగా జూట్ పరిశ్రమను నమ్ముకుని లక్షలాది కుటుంబాలు దేశంలో మనుగడ సాగిస్తున్నాయన్నారు. నేడు ప్రధాని మోది సర్కారు అంబానీకి మద్దతుగా సింథటిక్ పరిశ్రమలు ఏర్పాటుచేస్తోందని, రాష్ట్రం లో చంద్రబాబు నాయుడు ఉపాధి తక్కువగా ఉన్న రసాయన పరిశ్రమలు స్దాపించేందుకు విదేశీకంపెనీలకు ఆహ్వానిస్తున్నారని దీనివల్ల రాష్ట్రంలో జూట్ పరిశ్రమలు మూతపడ్డా వారికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. ఇఫ్టూ నేత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డీసీఎల్, ఏసీఎల్ చర్చలకు రాకుండా మిల్లు యాజమాన్యం తప్పించుకు తిరుగుతోందని అందుకే కార్మికుల సమక్షంలో మూడు మిల్లులకు జనరల్‌బాడీ వేశామని త్వరలోనే ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. కార్య్రకమంలో ఇప్టూ నాయకులు వై.కొండయ్య, మిల్లుల సంఘ నాయకులు అప్పారావు, కె.శ్రీను, అడపా వెంకటరావు, దేముడు బాబు మూడుమిల్లుల కార్మికులు పాల్గొన్నారు. ఉమాజూట్మిల్లుల కార్యవర్గం ఎంపిక కొత్తవలస రూరల్: మండలంలోని తుమ్మికాపల్లి ఉమాజూట్ ట్విన్మిల్స్, చింతలదిమ్మవద్ద గల ఉమాజూట్ ప్రోడక్ట్,్ర సాయిరాం ప్రోడక్ట్సుకు చెందిన మూడుమిల్లుల కార్మికులు బుధవారం జనరల్‌బాడీ మీటింగ్ ఏర్పాటుచేసి ఇప్టూ జిల్లా కమిటీ కి నూతన కార్యవర్గం ఏర్పాటుచేశారు. ఉమాజూట్మిల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షునిగా ఎల్లపు అప్పారావు, కార్యదర్శిగా అడపా వెంకటేశ్వరావు, కోశాధికారిగా సిహెచ్ సత్యం, ఉమాజూట్ ప్రోడక్స్ట్వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షునిగా ఎల్ త్రిమూర్తులు, కార్యదర్శిగా కె శ్రీను, కోశాధికారిగా దర్గా, సాయిరాం ప్రోడక్ట్స్ట వర్కర్క్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా జి నాయుడు, కార్యదర్శిగా టి రామమ్మ, కోశాధికారిగా కాసులమ్మను ఎంపికచేశారు. జిల్లాకమిటీ అధ్యక్షులుగా కొమ్ము నాగభూషణరావు, డి.శ్రీనులను ఎంపికచేశారు. -
‘నెల్లిమర్ల’ నెత్తుటి బావుటా
నేడు నెల్లిమర్ల కార్మిక అమర యోధుల 20వ సంస్మరణ దినోత్సవం. జనపనార పరిశ్రమ విస్తరిస్తున్నా నేటికీ నెల్లిమర్ల కార్మికుల జీవితాల్లోకి వెలుగులు మాత్రం ప్రసరించడంలేదు. భవన నిర్మాణ కార్మికుల కంటే తక్కువ కూలీకి పని చేయాల్సి వస్తోంది. ఇరవైయ్యేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ‘నెల్లిమర్ల’ రాష్ట్ర కార్మికోద్యమ చరిత్రలో నెత్తుటి మైలు రాయిగా మారింది. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల జూట్ మిల్ అక్రమ లాకౌట్‌ను ఎత్తివేయాలని కోరుతూ జరిగిన రైల్ రోకోపై పేలిన పోలీసు తూటాలకు ఐదుగురు కార్మికులు మృతి చెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరు గంటలకు పైగా పట్టువదలక పట్టాలపై నుంచి కదలని ఆడామగా, పిల్లాపాపలకు గట్టి గుణపాఠం చెప్పాలనే ప్రభుత్వం చీకటి పడగానే కాల్పులు జరిపించింది. పోరాడే ప్రజలే నాయకత్వాన్ని తయారు చేసుకుంటారనే ఇంగి తం లేని పాలకులు ఆ పోరాట నేతను మట్టుపెట్టాలని యత్నిం చారు. అయినా బతికి బయటపడి నాటి పోరాట స్మృతులను కలబోసుకోడానికి రచయిత మిగిలి ఉన్నాడంటే కారణం... రెండు వేల మంది మహిళలు నిర్మించిన మానవ రక్షణ కవచమే. ఒంటి మీది రవికను తీసి, ఎర్ర జెండాను చేసి ఎగరేసిన నాటి మహిళా పోరాట చైత న్యం రెండు దశాబ్దాల తర్వాత నేటికీ స్ఫూర్తిని కలుగజేస్తుంది. రెండేళ్లకు పైగా సాగిన నెల్లిమర్ల కార్మికోద్యమంలో సాధారణ గృహిణులైన మహిళలు నిర్వహించిన వీరోచిత పాత్రకు తగిన గుర్తింపు లభించలేదు. బోనస్ బకాయిల వంటి డిమాండ్లను పోరాడి సాధించుకున్న కార్మిక సంఘటిత శక్తిని దెబ్బతీసే కుట్రతో మిల్లు యాజ మాన్యం 1992 జూన్ 1న మిల్లును మూసేసింది. అంతకు ముందు మహిళలు కార్మికోద్యమంలో భాగస్వాములు కాలేదు. కార్మికుల ఆకలిపోరు రాజ్య వ్యతిరేక పోరాటంగా మారిపోతుండటాన్ని గ్రహించిన కార్మిక సంఘం ఉద్యమంలోకి స్త్రీలు, పిల్లల్ని సమీకరించే ప్రయత్నం చేసింది. అప్పటి నుంచి కార్మికులు కాని గృహిణులు ఉద్యమంలో అగ్రశ్రేణి పోరాట యోధులుగా నిలిచారు. జూన్ 11న చేపట్టిన ‘పొయ్యి వెలగొద్దు - ముద్ద ముట్టొద్దు’ అనే వినూత్న నిరసనలో 35 గ్రామాల్లో ఏ ఇంటిలోనూ పొయ్యి వెలగ లేదు. నెల్లిమర్ల ఎస్ఐ, ఎమ్మార్వోల భార్యలు సహా ప్రతి ఇల్లాలూ ఆ నిరసనలో పాల్గొనేలా చేసిన ఘనత కార్మిక గృహిణులదే. కార్మికులకు వేతనాలను చెల్లించకుండానే మిల్లులోంచి సంచులను తరలించుకు పోవడానికి వచ్చిన గూడ్స్ రైలుకు జూన్ 14న కార్మికులు అడ్డుపడ్డా... పోలీసు రక్షణతో కదిలిన రైలుకు అడ్డుపడి ఓ మహిళ ఒంటి మీది ఎర్ర రవికను కర్రకు కట్టి ఎగరేసి నిలిపేసింది. నిర్ణీత గడువులోగా జీతాల బకాయిల చెల్లింపు హామీ లభించాక... 92 గంటలకు గానీ రైలును కదలనివ్వలేదు. కొన్ని రోజులకే మహిళలు మాత్రమే కలెక్టర్‌కు వినతి పత్రం ఇద్దామని విజయనగరం వెళ్లారు. మొహం చాటు చేయాలని చూసిన కలెక్టర్ వచ్చే వరకు అర్థరాత్రి అయినా కార్యాలయం ముందే బైఠాయించారు. 1993 జూలై 5న మరోసారి యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. మరుసటి రోజు యాజమాన్య ప్రతినిధులు రహస్యంగా మిల్లులోకి ప్రవేశించడాన్ని కనిపెట్టిన కార్మికులు మిల్లును చుట్టుముట్టారు. 42 గంటల పాటూ జరిగిన ఆ పోరాటంలో కార్మికులు పోలీసు లాఠీ చార్జీలకు, బాష్పవాయు ప్రయోగానికి వెరవలేదు. మహిళలు తెగించి ముందుకు పోయి బాష్పవాయువుకు విరుగుడుగా కార్మికులకు ఉల్లిపాయలు అందించారు. ‘ఉల్లిపాయల పోరాటం’ అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందింది. యాజమాన్యం బకాయిల చెల్లింపునకు అంగీ కరించక తప్పలేదు. ర్యాలీలు, ఆకలి యాత్రలు వంటి పోరాటాలకు యాజమాన్యం, ప్రభుత్వం చలించకపోవడంతో కార్మిక కుటుంబాలు 1994 డిసెంబర్ 29న రైల్ రోకోకు దిగాయి. నాటి పోరాటంలో మహిళలు ప్రదర్శించిన తెగింపు నేటికీ మరువలేనిది. నాటి కాల్పుల్లో ఒరిగిన కాళ్ల అప్పల సత్యనారాయణ, నల్లి ముత్యాలనాయుడు, దువ్వారపు చిన్నా, కోకా అచ్చప్పడు, కల్లూరు రాంబాబుల భార్యలు తమ భర్తలను పది మంది కోసం ప్రాణాలర్పించిన అమరయోధులని గర్విస్తుండటమే వారి పోరాట స్ఫూర్తికి నిదర్శనం. నేడు జనుము ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతున్నా, పరిశ్రమ విస్తరిస్తున్నా నెల్లిమర్ల కార్మికుల కుటుంబాల జీవితాల్లోకి వెలుగులు మాత్రం ప్రసరించడంలేదు. భవన నిర్మాణ కార్మికుల కంటే తక్కువ కూలీకి పని చేయాల్సివస్తోంది. యాజమాన్యం కొమ్ముకాస్తున్న బొత్స సత్యనారాయణ గత పదేళ్లుగా కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు లేకుండా అమలు చేయిస్తున్న నిరంకుశత్వం ఫలితమిది. 2009 లాకౌట్ ఎత్తివేత ఒప్పందం పేరిట ఆయన... యాజమాన్యం దగ్గర గ్రాట్యుటీ చెల్లింపులకు డబ్బు లేదన్న సాకుతో ఒక్కొక్క కార్మికుని కూలీలో రోజుకి రూ.18 కోతను రుద్దారు. నాలుగు నెలల తర్వాత దాన్ని తిరిగి చెల్లించే విషయాన్ని చర్చిస్తామని ఇచ్చిన హామీని బొత్స అప్పుడే మరిచారు. ఇంతటి దుర్భర పరిస్థితుల్లోనూ నెల్లిమర్ల కార్మికులు రెండు దశాబ్దాల క్రితం నాటి తమ త్యాగాల చరిత్రను తిరిగి ఆవాహన చేస్తున్నారు. - పి. ప్రసాదు, ఇఫ్టూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (నేడు విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి కోట జంక్షన్‌కు ర్యాలీ, బహిరంగ సభ.)