Juttu Jagannayakulu
-
అనారోగ్యంతో వైఎస్ఆర్సీపీ నేత మృతి
సాక్షి, విశాఖపట్నం: పలాస మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత జుత్తు జగన్నాయకులు శనివారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపారు. జగన్నాయకులు అంత్యక్రియలు స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం హరిపురంలో జరగనున్నాయి. కొద్ది నెలల క్రితం ఆయన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించారు. జగన్నాయకులు 2009 నుంచి 2014 వరకు పలాస ఎమ్మెల్యేగా పని చేశారు. జుత్తు జగన్నాయకులు మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ కుటుంబం మనోధైర్యంతో ఉండాలని ఆకాంక్షించారు. -
నా సేవలు వైఎస్ఆర్సీపీకే
మందస, న్యూస్‌లైన్: నన్ను ఇబ్బంది పెట్టకండి.. నా సేవలు వైఎస్ఆర్సీపీకే.. అని పలాస ఎమ్మెల్యే జత్తు జగన్నాయకులు కేంద్ర సహాయ మంత్రి కృపారాణికి తేల్చి చెప్పేశారు. దాంతో జగన్నాయకులును తమ వైపు తిప్పుకోవాలన్న ఆశతో వచ్చిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కృపారాణి, పలాస అసెంబ్లీ అభ్యర్థి వంక నాగేశ్వరరావులకు ఆశాభంగమైంది. బుధవారం హరిపురం వచ్చిన వారిద్దరూ ఎమ్మెల్యే జగన్నాయకులు నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. ‘మనమంతా కాంగ్రెస్‌లో కలిసి పని చేశాం. ఇకముందు కూడా కలిసి పని చేద్దామని కృపారాణి జగన్నాయకులును కోరా రు. వారి ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. తన రాజకీయ గురువైన ధర్మాన ప్రసాదరావుతో పాలు వైఎస్ఆర్సీపీలో చేరానని, కార్యకర్తలు కూడా అదే పార్టీలో కొనసాగాలని కోరుతున్నారని చెప్పారు. కార్యకర్తల అభీష్టమే నాకు శిరోధార్యం. అందుకే నా సేవలు వైఎస్ఆర్సీపీకే అందిస్తారు. జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పని చేస్తానని జగన్నాయకులు స్పష్టం చేయడంతో కృపారాణి, వంక నాగేశ్వరరావులు నిరాశగా వెనుదిరిగారు. -
ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి.. జగన్‌ను సీఎం చెయ్యండి
కార్యకర్తలకు ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు పిలుపు మందస,న్యూస్‌లైన్: ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ైవైఎస్సార్సీిపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు పిలుపునిచ్చారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా జగన్మోహన్రెడ్డిని సీఎం చేసి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఆదివారం సాయింత్రం హరిపురంలో మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తలతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మొదటి సారిగా 2004 ఎన్నికల్లో మత్య్సకార కోటాలో అప్పటి సోంపేట అసెంబ్లీ స్థానానికి టెకెట్ ఇచ్చార న్నారు. అయితే అప్పట్లో ఓటమి పొందినప్పటికి మరల ఆయన 2009లో పలాస నియోజకవర్గానికి టికెట్ ఇచ్చారన్నారు. దివింగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో టీడీపీ అభ్యర్ధి గౌతు శ్యామసుందర శివాజీపై అఖండ మెజారిటీతో గెలిచానన్నారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. మహానేత ఆశయాలను కొనసాగించడానికి, ఆయన ప్రవేశపెట్టిన పధకాలను పూర్తిస్థాయిలో అందించేందుకు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందిరిపైనా ఉందన్నారు. ఆ పార్టీలోకి కాస్త ఆలస్యంగా చేరడంతో నాకు టికెట్ రాలేదని, అయితే మడమ తిప్పని, మాట తప్పని నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డితో ఉంటే మనకు మంచి రోజలు వస్తాయన్నారు. అంతేకాకుండ తనకు ఎమ్మెల్సీ ఇస్తామని వైఎస్ జగన్ తన గురువుగారైన ధర్మాన ప్రసాదరావు హామీ ఇచ్చారని ఆయన అన్నారు. తన గురువుగారైన ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీిపీ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. రాజశేఖర్‌రెడ్డిపై ఎంత అభిమానం ఉందో అంతే అభిమానం ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఉందన్నారు. కార్యకర్తలంతా కలసి మెలసి వైఎస్ఆర్ సీపీ పలాస నియోజకవర్గ అభ్యర్ధి వజ్జ బాబూరావు గెలుపుకు కృషి చేసి వైఎస్ జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా అంతా పని చేయాలని కార్యకర్తలను కోరారు. మన ప్రధాన లక్ష్యం తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించడమేనని అన్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాటను ఎప్పటికీ జవదాటమని అన్నారు. ఎమ్మెల్యే జగన్నాయకులు ప్రకటనతో కార్యకర్తల్లో నూతనోత్సాహం పొంగి పొర్లింది. జై జగన్...జై జై జగన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. సమావేశంలో మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మెట్ట కుమారస్వామి, ఏఎమ్‌సీ చైర్మన్ పాలిన శ్రీనివాసరావు, వజ్రపుకొత్తూరు పీఏసిఎస్ అధ్యక్షుడు దువ్వాడ మదుకేశ్వరరావు, డొక్కరి దానయ్య,మరడ భాస్కరరావు, బోర క్రష్ణారావు, దుంపల లింగరాజు, జెడ్పీటిసి అభ్యర్ధి దొరబాబు, దుంపల లింగరాజు, కర్రి గోపాలక్రిష్ణ, బమ్మిడి ధర్మారావు, వాయిలపల్లి ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు. -
‘జుత్తు’ జగన్నాదం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘మీ మాట కోసమే ఎదురు చూస్తున్నాం. వైఎస్ఆర్ అంటే మాకెంత అభిమానమో మీకు తెలుసు. మీకు కూడా ఆయనంటే అభిమానమని మాకు తెలుసు. మీరు ఊ కొట్టారు.. అదే చాలు.. అందరం కలిసికట్టుగా వైఎస్ఆర్సీపీలోకి వెళదామని’ పలాస నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పేర్కొన్నారు. ఇదే అభిప్రాయంతో ఉన్న ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులకు బాసటగా నిలిచారు. ఆయన చేసిన జగన్నినాదానికి కోరస్‌గా సై అన్నారు. మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు వెంట వైఎస్ఆర్సీపీలో చేరాలని నిర్ణయించుకున్న జగన్నాయకులు దీనిపై కాంగ్రెస్ నేతలు, ముఖ్య కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు మందస మండలం హరిపురం వద్ద కొబ్బరితోటలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. మందసతోపాటు వజ్రపుకొత్తూరు, పలాస మండలాలకు చెందిన పీఏసీఎస్ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, ఏఎంసీ అధ్యక్షులు, పలువురు సర్పంచులు, పార్టీ మండల అధ్యక్షులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన మనసులో మాట బయట పెట్టారు. రాష్ట్రాన్ని విడగొట్టాలని నిర్ణయించడం ద్వారా కాంగ్రెస్ చె య్యరాని తప్పు చేసింది. ఇక రాష్ట్రంలో ఆ పార్టీకి మనుగడ లేదు. దివంగత వైఎస్ఆర్ ఎంతగా ఆదరించారో నాకు తెలుసు. ఆయన కలలను సాకారం చేయడం వైఎస్ఆర్ సీపీతోనే సాధ్యమవుతుంది. అయితే మీ అందరి సహకారం కావాలి. మీరు ఏం చెబుతారో తెలుసుకోవాలని పిలిపించానని చెప్పారు. వైఎస్ఆర్సీపీతోనే రాజకీయ భవిష్యత్ ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆయనతో పాటే మన పయనం ఉండటం మంచిదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు. నినాదాల హోరు ఎమ్మెల్యే మనసలోని మాట బయటకు వచ్చిన వెంటనే సమావేశ ప్రాంగణం వైఎస్ఆర్ జిందాబాద్, జగన్ జిందాబాద్ అన్న నినాదాలతో మార్మోగింది. అనంతరం ప్రసంగించిన పలువురు సర్పంచులు, ఇతర ముఖ్యనేతలు ఎమ్మెల్యేకు పూర్తి మద్దతు ప్రకటించారు. వైఎస్ఆర్సీపీలో చేరేందుకు మూకుమ్మడిగా ఆమోదం తెలిపారు. దీంతో పలాస నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ పూర్తిగా వైఎస్ఆర్ సీపీలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా ఆమదాలవలస, టెక్కలి, పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోనే ఉంటారా? పార్టీ మారుతారా? అనే అంశంపై చర్చ సాగుతున్నది. వైఎస్ఆర్ ద్వారా పార్టీలోకి రావడమే కాకుండా, ప్రజలకు బాగా చేరువయ్యేందుకు దివంగత వైఎస్ఆర్ చేపట్టిన పథకాలే ముఖ్య కారణమనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని పలువరు కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మనుగడ కోల్పోయే పార్టీలోనే ఉండి మనం కూడా మనుగడ కోల్పోదామా? లేక ప్రజలకు చేరువవుతున్న పార్టీ వైపు వెళదామా? అనే విషయంలో ఎమ్మెల్యేలు తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికిప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వెళితే తమకు పదవులు దక్కవనే సందేహంలోనూ వారు ఉన్నట్లు సమాచారం. అయితే మనుగడేలేని పార్టీ కంటే అధికారంలోకి రాబోయే పార్టీలోనే ఉండటం మంచిదనే అభిప్రాయాన్ని ఎమ్మెల్యేల వద్ద వారి సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీలో చేరుతా : జుత్తు జగన్నాయకులు
పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు మందస, న్యూస్‌లైన్: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు బాటలో తానూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ప్రకటించారు. మందస మండలం హరిపురంలో శుక్రవారం ఆయన ముఖ్యకార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రజలు విశ్వసించే పార్టీలోకి వెళ్లాలని ఆలోచిస్తున్నానని, ఈ విషయమై అభిప్రాయాలు చెప్పాలని కోరారు. తాము కోరుకునేదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనేనని, జైజగన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అందరూ సహకరిస్తే తనకు గుర్తింపునిచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి కలలు సాకారం చేసేందుకు మరింత కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు.