నా సేవలు వైఎస్‌ఆర్‌సీపీకే
మందస, న్యూస్‌లైన్: నన్ను ఇబ్బంది పెట్టకండి.. నా సేవలు వైఎస్‌ఆర్‌సీపీకే.. అని పలాస ఎమ్మెల్యే జత్తు జగన్నాయకులు కేంద్ర సహాయ మంత్రి కృపారాణికి తేల్చి చెప్పేశారు. దాంతో జగన్నాయకులును తమ వైపు తిప్పుకోవాలన్న ఆశతో వచ్చిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కృపారాణి, పలాస అసెంబ్లీ అభ్యర్థి వంక నాగేశ్వరరావులకు ఆశాభంగమైంది. బుధవారం హరిపురం వచ్చిన వారిద్దరూ ఎమ్మెల్యే జగన్నాయకులు నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. ‘మనమంతా కాంగ్రెస్‌లో కలిసి పని చేశాం. ఇకముందు కూడా కలిసి పని చేద్దామని కృపారాణి జగన్నాయకులును కోరా రు. వారి ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. తన రాజకీయ గురువైన ధర్మాన ప్రసాదరావుతో పాలు వైఎస్‌ఆర్‌సీపీలో చేరానని, కార్యకర్తలు కూడా అదే పార్టీలో కొనసాగాలని కోరుతున్నారని చెప్పారు. కార్యకర్తల అభీష్టమే నాకు శిరోధార్యం. అందుకే నా సేవలు వైఎస్‌ఆర్‌సీపీకే అందిస్తారు. జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పని చేస్తానని జగన్నాయకులు స్పష్టం చేయడంతో కృపారాణి, వంక నాగేశ్వరరావులు నిరాశగా వెనుదిరిగారు.