kruparani
-
ప్రియుడే కాల యముడయ్యాడా..?
కృష్ణాజిల్లా, కలిదిండి (కైకలూరు): కలిదిండి శివారు బరింకలగరువు గ్రామ నివాసి కటికతల కృపారాణి (25) హత్యోదంతంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పోలీసులు మౌనం వీడక పోవడంతో బంధువులు, గ్రామస్తులు, దళిత సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఉప్పుటేరులో శుక్రవారం శవమై తేలిన కృపారాణి హత్యకు గురైందని, నిందితులను పట్టుకుంటామని గుడివాడ డీఎస్పీ ఎన్. సత్యానందం ప్రకటించి రెండు రోజులు గడుస్తోంది. శనివారం రాత్రి కృపారాణి మృతదేహాన్ని పోలీసులు అప్పగించగా రాత్రివేళ ఖననం చేశారు. కాగా దీనిపై తల్లిదండ్రులు బుజ్జి, ఏసమ్మను ప్రశ్నించగా వారు కొన్ని వివరాలను అందించారు. ఆ వివరాల మేరకు.. భర్తకు దూరమైన తర్వాత ఇందిరాకాలనీకి చెందిన అజయ్ (30) అనే వివాహితుడితో కృపారాణి సహ జీవనం చేస్తోంది. అతను స్థానిక చికెన్ సెంటర్లో పని చేసేవాడు. ఇందిరా కాలనీలో నివసించే అతను భార్యపిల్లలను పట్టించుకోకపోవడంతో వారు విజయవాడ వెళ్లిపోయారు. కృపారాణి కూడా ఇందిరా కాలనీలో అద్దెకు ఉంటూ అతనికి దగ్గరైంది. ఏడాది కాలంగా వీరి పరిచయం కొనసాగింది. రెండు నెలలుగా అజయ్‌కి కృపారాణి దూరంగా ఉంటోంది. అయితే, కృపారాణి అత్తవారి గ్రామమైన కొత్తపల్లిలో అజయ్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఇక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆమె తరచూ కృపారాణికి ఫోన్ చేసి అజయ్‌ని వదిలేయక పోతే నిన్ను భూమి మీద లేకుండా చేస్తానని హెచ్చరించేది. కృపారాణి హత్యకు ముందు మూడు రోజుల నాడు అంటే మంగళవారం కూడా కృపారాణి ఇంటికి అజయ్ వచ్చాడు. ఆ తర్వాత ఘటన జరగడంతో ఈ హత్యలో అజయ్ ప్రమేయం ఉంటుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు కూడా తెలియజేసినట్లు చెప్పారు. మృతురాలి పిల్లలు, తల్లిదండ్రులు పలు అనుమానాలు.. ఇదిలా ఉండగా హత్యకు ముందు రోజు గురువారం సాయంత్రం కృపారాణి ఆటోలో ఏలూరుపాడు బట్టల షాపునకు వెళ్లిందని, అదే రాత్రి హత్యకు గురైందని, తన కుమార్తెను గ్యాంగ్ రేప్ చేసి, హత్యచేసి ఉంటారని తల్లి ఏసమ్మ ఆరోపించింది. ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ జీవిస్తున్న కృపారాణి దూరం కావడంతో పిల్లలు తట్టుకోలేక పోతున్నారని వాపోయింది. కృపారాణి కొంకేపూడిలో ఉద్యోగం చేస్తోంది. మూడు నెలల క్రితం కుమారుడు శ్యాంబాబు (20) (కృపారాణి తమ్ముడు) అనారోగ్యంతో మృతి చెందగా, పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి (బుజ్జి) ని, తననూ పోషిస్తున్న కృపారాణిని దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారని ఏసమ్మ విలపించింది. ‘హత్య చేయవలసినంత తప్పు కృపారాణి ఏమి చేసిందయ్యా, చిన్నారులకు ఎవరు దిక్కు’ అంటూ కన్నీటి పర్యంతమైంది. కృపారాణి పిల్లలకు, వృద్ధాప్యంలో ఉన్న తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఏసమ్మ వేడుకుంటోంది. కాగా, కృపారాణి హత్య కేసులో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని కలిదిండి ఎస్ఐ జనార్థన్ తెలిపారు. అయితే, ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న అజయ్ కూడా వీరిలో ఉన్నాడని తెలుస్తోంది. -
మానవత్వాన్ని చాటుకున్న వైఎస్సార్సీపీ ఎన్నారై వింగ్!
కువైట్: పశ్చిమ గోదావరి ఏలూరుకు చెందిన జి. కృపారాణి (45 ) కువైట్‌లో మృతిచెందారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమె గత నెల 26న ప్రాణాలు విడిచారు. గత 10 సంవత్సరాలుగా కువైట్‌లో ఉంటున్న ఆమెకు భర్త, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కృపారాణి వద్ద పాస్ పోర్ట్, కువైట్ రెసిడెన్సి (అకామా) గుర్తింపు లేదు. కృపారాణి దగ్గర బంధువు ఒకరు ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కన్వీనర్ ఎం బాలిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సేవాదళ్ వైస్ ఇన్చార్జ్ కే. నాగసుబ్బారెడ్డి సహకారంతో వారు భారత్ రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి కృపారాణికి తాత్కాలిక పాస్ పోర్ట్ మంజూరు చేయించారు. అంతేకాకుండా శవపేటిక, విమాన ఖర్చులకు రూ. రూ. 75 వేలు భారత్ రాయబార కార్యాలయం ద్వారా ఉచితంగా ఇప్పించారు. హైదరాబాద్ నుండి ఏలూరులోని తన ఇంటి వరకు ఉచితంగా అంబులెన్స్‌ను గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పీ రెహమన్ ఖాన్, సోషల్ మీడియా ఇన్చార్జ్ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బీహెచ్, ఎం బాలిరెడ్డి గారు మాట్లాడుతూ కృపారాణి మృతదేహాన్ని ఇండియా పంపెందుకు సహాకరించిన భారత్ రాయబార కార్యాలయ అధికారులకు కమిటి సభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు. కృపారాణి భౌతికకాయానికి వైకాపా కువైట్ కో కన్వీనర్ గోవిందునాగరాజు, ప్రధాన కోశాధికారి ఎన్ మహేశ్వర్ రెడ్డి, గల్ఫ్ ప్రతినిధి షేక్ ఫయాజ్, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు లాజరాస్, మీడియా ప్రతినిధి పి. సురేష్ రెడ్డి, సలహాదారు యన్. చంద్రశేఖర్ రెడ్డి, యూత్ ఇన్చార్జ్ మర్రి కళ్యాణ్, ఇలియాస్, బాలిరెడ్డి, నాగసుబ్బారెడ్డి నివాళిలు అర్పించారు. ఆదివారం రాత్రి ఎయిర్ ఎయిర్వేస్ ద్వారా కువైట్ నుండి కృపారాణి భౌతికకాయం బయలుదేరి సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకుంటుంది. -
నా సేవలు వైఎస్ఆర్సీపీకే
మందస, న్యూస్‌లైన్: నన్ను ఇబ్బంది పెట్టకండి.. నా సేవలు వైఎస్ఆర్సీపీకే.. అని పలాస ఎమ్మెల్యే జత్తు జగన్నాయకులు కేంద్ర సహాయ మంత్రి కృపారాణికి తేల్చి చెప్పేశారు. దాంతో జగన్నాయకులును తమ వైపు తిప్పుకోవాలన్న ఆశతో వచ్చిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కృపారాణి, పలాస అసెంబ్లీ అభ్యర్థి వంక నాగేశ్వరరావులకు ఆశాభంగమైంది. బుధవారం హరిపురం వచ్చిన వారిద్దరూ ఎమ్మెల్యే జగన్నాయకులు నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. ‘మనమంతా కాంగ్రెస్‌లో కలిసి పని చేశాం. ఇకముందు కూడా కలిసి పని చేద్దామని కృపారాణి జగన్నాయకులును కోరా రు. వారి ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. తన రాజకీయ గురువైన ధర్మాన ప్రసాదరావుతో పాలు వైఎస్ఆర్సీపీలో చేరానని, కార్యకర్తలు కూడా అదే పార్టీలో కొనసాగాలని కోరుతున్నారని చెప్పారు. కార్యకర్తల అభీష్టమే నాకు శిరోధార్యం. అందుకే నా సేవలు వైఎస్ఆర్సీపీకే అందిస్తారు. జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పని చేస్తానని జగన్నాయకులు స్పష్టం చేయడంతో కృపారాణి, వంక నాగేశ్వరరావులు నిరాశగా వెనుదిరిగారు. -
నిలువెల్లా నిస్తేజం
పదేళ్లు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా తయారైంది. పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేసే నాయకులు లేరు. కనీస పోటీ ఇవ్వగలిగే అభ్యర్థులూ లేక ఆ పార్టీ ఎన్నికలకు ముందే కాడి వదిలేసింది. సిట్టింగ్ అభ్యర్థులు కృపారాణి, కోండ్రు మురళీమోహన్, నిమ్మక సుగ్రీవులే ఆ పార్టీలో మిగిలారు. వారు కూడా తమ నియోజకవర్గాల్లో తీవ్ర గడ్డు పరి స్థితి ఎదుర్కొంటున్నారు. ద్వితీయ స్థానం దక్కించుకోవడం కూడా దాదాపు అసాధ్యమని ఆ నియోజకవర్గాల్లో పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇక మిగిలిన అభ్యర్థుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నట్లుగా తయారైంది. పార్టీ అభ్యర్థులుగా ఖరారైన చౌదరి సతీష్(శ్రీకాకుళం), డోల జగన్(నరసన్నపేట), పాలవలస కరుణాకర్(పాతపట్నం), కిల్లి రామ్మోహన్రావు( టెక్క లి), వంకా నాగేశ్వరరావు(పలాస), నరేష్కుమార్ అగర్వాల్( ఇచ్ఛాపురం), రవికిరణ్( ఎచ్చెర్ల) తమ తమ నియోజకవర్గాల్లో కనీసం ప్రభావం చూపించే అవకాశాలు లేవు. ఇంత బలహీనమైన జట్టుతో కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధం కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఈ ఎన్నికలపై కాంగ్రెస్ శ్రేణులు ముందే ఆశలు వదిలేసుకున్నాయి. రాజకీయ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేయడం మినహా కాంగ్రెస్ ఎలాంటి ప్రభావం చూపించే అవకాశాలు లేనే లేవన్నది సుస్పష్టం. కాంగ్రెస్ పరిస్థితే ఇలా ఉంటే... జిల్లాలో పోటీ చేయనున్న సమైక్యాంధ్ర పార్టీ, ఇతర పార్టీల గురించి చెప్పుకోవడానికేమీ లేదు.