కువైట్: పశ్చిమ గోదావరి ఏలూరుకు చెందిన జి. కృపారాణి (45 ) కువైట్‌లో మృతిచెందారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమె గత నెల 26న ప్రాణాలు విడిచారు. గత 10 సంవత్సరాలుగా కువైట్‌లో ఉంటున్న ఆమెకు భర్త, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
కృపారాణి వద్ద పాస్ పోర్ట్, కువైట్ రెసిడెన్సి (అకామా) గుర్తింపు లేదు. కృపారాణి దగ్గర బంధువు ఒకరు ఈ విషయాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కన్వీనర్ ఎం బాలిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సేవాదళ్ వైస్ ఇన్‌చార్జ్ కే. నాగసుబ్బారెడ్డి సహకారంతో వారు భారత్ రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి కృపారాణికి తాత్కాలిక పాస్ పోర్ట్ మంజూరు చేయించారు. అంతేకాకుండా శవపేటిక, విమాన ఖర్చులకు రూ. రూ. 75 వేలు భారత్ రాయబార కార్యాలయం ద్వారా ఉచితంగా ఇప్పించారు. హైదరాబాద్ నుండి ఏలూరులోని తన ఇంటి వరకు ఉచితంగా అంబులెన్స్‌ను గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పీ రెహమన్ ఖాన్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బీహెచ్, ఎం బాలిరెడ్డి గారు మాట్లాడుతూ కృపారాణి మృతదేహాన్ని ఇండియా పంపెందుకు సహాకరించిన భారత్ రాయబార కార్యాలయ అధికారులకు కమిటి సభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు. కృపారాణి భౌతికకాయానికి వైకాపా కువైట్ కో కన్వీనర్ గోవిందునాగరాజు, ప్రధాన కోశాధికారి ఎన్ మహేశ్వర్ రెడ్డి, గల్ఫ్ ప్రతినిధి షేక్ ఫయాజ్, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు లాజరాస్, మీడియా ప్రతినిధి పి. సురేష్ రెడ్డి, సలహాదారు యన్. చంద్రశేఖర్ రెడ్డి, యూత్ ఇన్‌చార్జ్ మర్రి కళ్యాణ్, ఇలియాస్, బాలిరెడ్డి, నాగసుబ్బారెడ్డి నివాళిలు అర్పించారు. ఆదివారం రాత్రి ఎయిర్ ఎయిర్వేస్ ద్వారా కువైట్ నుండి కృపారాణి భౌతికకాయం బయలుదేరి సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకుంటుంది.
మానవత్వాన్ని చాటుకున్న వైఎస్సార్సీపీ ఎన్నారై వింగ్!
Published Sun, Jan 8 2017 2:43 PM | Last Updated on Tue, May 29 2018 2:42 PM
Advertisement
Advertisement