Jyoti Buddha Prakash
-
రూ. 232 కోట్లు ఎగ్గొట్టి ‘పరుగులు’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2,17,930 రవాణా వాహనాలు మూడు నెలలకోసారి చెల్లించాల్సిన త్రైమాసిక పన్ను ఎగ్గొట్టి రహదారులపై యథేచ్ఛగా పరుగులు తీస్తున్నాయి. ఏకంగా రూ. 232 కోట్లను కొన్ని నెలలుగా చెల్లించకుండానే దర్జాగా దూసుకెళ్తున్నాయి. వాటిలో కనిష్టంగా 3 నెలల కాలపరిమితి నుంచి గరిష్టంగా 18 నెలల వరకు పన్ను చెల్లించాల్సిన వాహనాలు వేలల్లోనే ఉన్నాయి. కొన్నిచోట్ల కోవిడ్ కాలం నుంచి కూడా పన్ను చెల్లించని వాహనాలు భారీగానే ఉన్నట్లు అంచనా. హైదరాబాద్‌లోనే అధికం.. త్రైమాసిక పన్ను ఎగ్గొట్టి తిరుగుతున్న 2.17 లక్షల వాహనాల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌లోనే లక్షకుపైగా ఉన్నాయి. ఈ క్రమంలో చాలాకాలం తర్వాత అధికారులు కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల రవాణా కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ పన్ను ఎగవేత వాహనాలపై సమీక్ష నిర్వహించారు. ఒకవైపు లక్ష్యానికి మించిన ఆదాయాన్ని ఆర్జించడంపట్ల ప్రశంసిస్తూనే పన్ను ఎగవేత వాహనాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రేటర్‌లోని మూడు జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన రవాణా వాహనాలను తనిఖీ చేయాలని అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. గ్రేటర్లో ఆటోలు మినహా... సాధారణంగా వ్యక్తిగత వాహనాలకు ఒకసారి జీవితకాల పన్ను చెల్లిస్తే చాలు. కానీ రవాణా వాహనాలకు మాత్రం ప్రతి 3 నెలలకోసారి త్రైమాసిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వాహనాల సామర్థ్యం మేరకు దీనిని నిర్ణయిస్తారు. వెయిట్ గ్రాస్ వెహికల్ (డబ్ల్యూజీవీ) ప్రకారం వాహనం బరువుకు అనుగుణంగా త్రైమాసిక పన్ను కనిష్టంగా రూ. 535 నుంచి గరిష్టంగా రూ. 15,000 వరకు ఉంటుంది. గతంలో ఇచ్ఛిన ఎన్నికల హామీ మేరకు జీహెచ్ఎంసీలోని సుమారు 1.4 లక్షల ఆటోలను ఈ త్రైమాసిక పన్ను జాబితా నుంచి ప్రభుత్వం మినహాయించింది. మిగతా అన్ని రకాల రవాణా వాహనాలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ జాబితాలో స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులు, లారీలు, క్యాబ్‌ల వంటి వాహనాలు ఉన్నాయి. కోవిడ్ కాలంలో పన్ను చెల్లించని రవాణా వాహనదారులు... కోవిడ్ ఆంక్షలను సడలించాక చాలా వరకు చెల్లించారు. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆర్టీఏ అధికారులు అప్పట్లో ఉదారంగా వ్యవహరించడం కూడా ఇందుకు కారణమైంది. ఎంవీఐలకు పన్ను వసూలు టార్గెట్లు! ఈ నెలాఖరు నాటికి బకాయిలు వసూలు చేయాల ని రవాణా కమిషనర్ అధికారులను మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. అలాగే వారికి టార్గెట్లు విధించారని తెలియవచ్చింది. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలోప్రతి ఎంవీఐకి రూ. 6 లక్షల చొప్పున టార్గెట్ విధించగా ప్రస్తుతం దాన్ని రూ. 7 లక్షలకు పెంచారని సమాచారం. ఈ లెక్కన ఆర్టీఏ కార్యాలయాల్లో పౌరసేవలు అందించే ఎంవీఐలు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా రోజుకు పన్ను చెల్లించని 5 వాహ నాలను జఫ్తు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అ లాగే ఎన్ఫోర్స్మెంట్ విధుల్లో ఉన్నవారు రోజుకు 10 వాహనాలను జఫ్తు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అయితే జఫ్తు చేసిన వాహనాలను నిలిపేందుకు సరైన పార్కింగ్ సదుపాయం లేక ఇబ్బందులకు గురవుతున్నట్లు ఓ ఎంవీఐ పేర్కొన్నారు. స్వచ్ఛందంగా ముందుకొస్తేనే ఊరట... త్రైమాసిక పన్ను పెండింగ్ జాబితాలో ఉన్న వాహన యజమానులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పన్ను చెల్లిస్తే అపరాధ రుసుము ఉండదని అధికారులు చెబుతున్నారు. తనిఖీల్లో పట్టుబడితే మాత్రం 200 శాతం వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. బ్లాంక్ డీడీలతో దళారుల వసూళ్లు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా సీజ్ చేసిన వాహనాలపై పెనాల్టితో సహా కట్టాల్సిన బకాయిల మొత్తానికి డీడీ తీసుకురావాలని అధికారులు చెబుతుండటంతో దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. వారు అప్పటికే వివిధ మొత్తాలతో బ్యాంకుల నుంచి తెచ్చిన ఖాళీ డీడీలు చూపి ఒక్కో డీడీపై ‘సర్విస్ చార్జీ’గా రూ.200 వసూలు చేస్తున్నారు. దీంతో ఆరొందల నుంచి రూ.1200 వరకు ఆ రూపంలో అదనపు భారం పడుతోంది. కళ్లముందే ఈ దందా జరుగుతున్నా రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. -
స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దాలి
కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ ఆదిలాబాద్ రూరల్ :ఆదిలాబాద్‌ను స్వచ్ఛ జిల్లాగా తీర్చి దిద్దాలని కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ అన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా బహిరంగా మల, మూత్ర విసర్జన రహిత జిల్లాగా రూపొందించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన మరుగుదొడ్లు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, పబ్లిక్ హెల్త్, మున్సిపల్, శానిటేషన్, కాంట్రాక్టు, రెగ్యులర్ వర్కర్స్ తదితర అంశాలపై చర్చించారు. జిల్లాలో వివిధ విడతల్లో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం వివరాలను ఆర్డబ్ల్యూఎస్ ఏఈని అడిగి తెలుసుకున్నారు. రెండు విడతల్లో 2392 మరుగుదొడ్ల లక్ష్యంగా ఉండగా, ఇందులో 343 పూర్తరుునట్లు చెప్పారు. 740 నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. మిగతా 2049 పూర్తిచేయాల్సి ఉందన్నారు. మొదటి విడతలో 6394 మరుగుదొడ్లు నిర్మించేందుకు లక్ష్యం పెట్టుకోగా 4242 పూర్తి చేయడం జరిగిందన్నారు. పెండింగ్‌లో ఉన్న మరుగుదొడ్లను త్వ రలో పూర్తయ్యేలా చూడాలని, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో జిల్లాను ముందుంచాలని ఆదేశించారు. జిల్లా లో పబ్లిక్ హెల్త్‌వర్కర్స్, పారిశుధ్య కార్మికులు స్వీపర్లుగా పంచాయతీ, బల్దియాల్లో ఫుల్‌టైం పనిచేస్తున్న వారి వివరాలు సేకరించి రిజిస్ట్రర్ ఈ పాస్ వెబ్సైట్ ద్వారా నమోదు చేయాలన్నారు. మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్, మున్సిపాలిటీ, లోకల్ బాడీ ద్వారా చదువుతున్న దళిత విద్యార్థులకు స్కాలర్షిప్ చెల్లింపుల కోసం వివరాలు నమోదు చేసి ఈ పాస్ వెబ్సైట్ ద్వారా ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ చెల్లింపులు చేయాలన్నారు. జిల్లాలో చేపట్టిన డబుల్‌బెడ్ రూం నిర్మాణం కోసం అర్హతగల లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్ల ని ర్మా ణం కోసం టెండర్లు వేగవంతం చేయాలని ఆదేశిం చారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మూర్తి, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీవో రాజేశ్వర్, పీఆర్ ఈఈ మా రుతి, జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్య, మున్సిపల్ కమిషనర్ మంగతాయారు, దళిత శాఖ అధికారి కిషన్, మహిళా సంక్షేమ అధికారి ఉమాదేవి పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీలో రాజుకున్న వేడి
* పోటాపోటీగా అధికారులను నియమించిన ఇరురాష్ట్రాలు * ఎవరి కింద పనిచేయాలో తెలియక ఉద్యోగుల్లో గందరగోళం * ఏపీ అధికారి నియామకంపై తెలంగాణ ప్రభుత్వం కినుక * అందుకే తమ అధికారిని నియమించినట్టు సమాచారం సాక్షి, హైదరాబాద్: ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా కొనసాగుతున్న ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్‌లో అగ్గిరాజుకుంది. ఆ సంస్థకు ఇన్చార్జిలుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉత్తర్వులివ్వడంతో ఒక్కసారిగా ఆరోగ్యశ్రీలో గందరగోళం ఏర్పడింది. అక్కడున్న ఉద్యోగులు ఎవరికింద పనిచేయాలి, చాంబర్ల సంగతేమిటి, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కోసం ఏర్పాటు చేసిన సాంకేతిక పరిజ్ఞానం (ఆన్లైన్ చెల్లింపుల నుంచి, వైద్య సేవల అనుమతుల వరకూ) ఎవరి అధీనంలో ఉండాలి అన్నదానిపై సందేహాలు మొదలయ్యాయి. రెండు మాసాల కిందటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ విభజన కోసం ప్రతిపాదనలు పంపించినా ఇప్పటికీ అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఐఏఎస్ అధికారులను నియమించడం వివాదానికి దారితీసింది. ఏకపక్ష నిర్ణయంతో..: నాలుగు రోజుల క్రితం వరకూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ధనుంజయరెడ్డి సీఈవోగా ఉన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఈ మధ్యనే ఆయన్ను బదిలీ చేసింది. ఆ స్థానంలో కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ లవ్అగర్వాల్కు అదనపు బాధ్యతలు ఇచ్చింది. అయితే ట్రస్ట్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం తమకు చెప్పకుండా ఆయన్ను నియమించడంపై తెలంగాణ ప్రభుత్వం మండిపడింది. తమను సంప్రదించకుండా నియామకం చేపట్టడం సరైన పద్ధతి కాదని తెలంగాణ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అందుకే తెలంగాణ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఉన్న జ్యోతి బుద్ధప్రకాశ్‌ను ఆరోగ్యశ్రీకి అదనపు బాధ్యతలు నిర్వహించాలని మంగళవారం ఆ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న చాంబర్లో ఎవరు కూర్చోవాలన్నది చర్చనీయాంశమైంది. నివేదికలు పరిశీలించేది ఎవరు? ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో రోగుల వైద్య పరీక్షల నివేదికలు పరిశీలించడం, చికిత్సలకు అనుమతు లు, ఆస్పత్రులకు నగదు చెల్లింపులు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతుంటాయి. ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించే నగదు ఏ రాష్ట్ర రోగులకు ఆ రాష్ట్ర మే చెల్లిస్తోంది. కానీ చాలామంది ఇక్కడ పని చేసే సిబ్బంది కాంట్రాక్టు లేదా ఔట్సోర్సింగ్ వారే. ఎక్కువ మంది ఉన్నతస్థాయి పోస్టుల్లో ఉన్నవారు ఆరోగ్య శాఖలో పదవీ విరమణ చేసిన వారు. వీరిలో ఎవరు ఏ రాష్ట్రానికి పనిచేయాలో తెలియదు. అయితే ఇప్పటి వరకూ రోగుల నివేదికలు పరిశీలించేందుకు ఒక కమిటీ ఉంది. వీళ్లందరూ తెలంగాణకు చెందిన వైద్యులే. అయితే ఇకపై ఏపీ రోగుల నివేదికలు ఎవరు పరిశీలిస్తారనే సమస్య ఉత్పన్నమవుతోంది.