కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్
ఆదిలాబాద్ రూరల్ :ఆదిలాబాద్‌ను స్వచ్ఛ జిల్లాగా తీర్చి దిద్దాలని కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ అన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా బహిరంగా మల, మూత్ర విసర్జన రహిత జిల్లాగా రూపొందించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన మరుగుదొడ్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, పబ్లిక్ హెల్త్, మున్సిపల్, శానిటేషన్, కాంట్రాక్టు, రెగ్యులర్ వర్కర్స్ తదితర అంశాలపై చర్చించారు. జిల్లాలో వివిధ విడతల్లో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం వివరాలను ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈని అడిగి తెలుసుకున్నారు. రెండు విడతల్లో 2392 మరుగుదొడ్ల లక్ష్యంగా ఉండగా, ఇందులో 343 పూర్తరుునట్లు చెప్పారు. 740 నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. మిగతా 2049 పూర్తిచేయాల్సి ఉందన్నారు. మొదటి విడతలో 6394 మరుగుదొడ్లు నిర్మించేందుకు లక్ష్యం పెట్టుకోగా 4242 పూర్తి చేయడం జరిగిందన్నారు.
పెండింగ్‌లో ఉన్న మరుగుదొడ్లను త్వ రలో పూర్తయ్యేలా చూడాలని, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో జిల్లాను ముందుంచాలని ఆదేశించారు. జిల్లా లో పబ్లిక్ హెల్త్‌వర్కర్స్, పారిశుధ్య కార్మికులు స్వీపర్లుగా పంచాయతీ, బల్దియాల్లో ఫుల్‌టైం పనిచేస్తున్న వారి వివరాలు సేకరించి రిజిస్ట్రర్ ఈ పాస్ వెబ్‌సైట్ ద్వారా నమోదు చేయాలన్నారు. మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్, మున్సిపాలిటీ, లోకల్ బాడీ ద్వారా చదువుతున్న దళిత విద్యార్థులకు స్కాలర్‌షిప్ చెల్లింపుల కోసం వివరాలు నమోదు చేసి ఈ పాస్ వెబ్‌సైట్ ద్వారా ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్ చెల్లింపులు చేయాలన్నారు.
జిల్లాలో చేపట్టిన డబుల్‌బెడ్ రూం నిర్మాణం కోసం అర్హతగల లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్ల ని ర్మా ణం కోసం టెండర్‌లు వేగవంతం చేయాలని ఆదేశిం చారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ మూర్తి, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్‌డీవో రాజేశ్వర్, పీఆర్ ఈఈ మా రుతి, జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్య, మున్సిపల్ కమిషనర్ మంగతాయారు, దళిత శాఖ అధికారి కిషన్, మహిళా సంక్షేమ అధికారి ఉమాదేవి పాల్గొన్నారు.
స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దాలి
Published Tue, Dec 6 2016 10:40 PM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
Advertisement
Advertisement