గృహాల నిర్మాణం త్వరగా చేపట్టండి
పెద్దారవీడు: ఎన్టీఆర్ పథకం ద్వారా మంజూరైన గృహాలను వెంటనే నిర్మంచుకోవాలని మార్కాపురం గృహా నిర్మాణశాఖ ఈఈ కె బసవయ్య పేర్కొన్నారు. మంగళవారం పెద్దోర్నాల, పెద్దారవీడు మండలాల్లో పలు గ్రామాల్లో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మించుకోని లబ్దిదారుల పేర్లను తొలగించి నిబంధనల ప్రకారం అర్హులైన కొత్త లబ్దిదారులకు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికి పెద్దదోర్నాల మండలంలో 45, పెద్దారవీడు మండలంలో 135 గృహాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. మిగత లబ్దిదారులు వీలైనంత త్వరగా గృహా నిర్మాణాల పనులు చేపట్టాలని సూచించారు.
ఎన్టీఆర్ పథకంలో మొత్తం రూ 1.50 లక్షలు, వీటిలో ఉపాధి హామీ పథకం రూ 58 వేలు, ఆ నిధులలో ప్రభుత్వం నుంచి 80 బస్తాలు సిమెంట్ ఇస్తుందని, లభ్ధిదారుని వాటా 18 వేలు లోను కట్టాల్సి ఉంటుందని, మిగత డబ్బులు పూర్తిగా సబ్సిడీ వర్తిస్తుందని, పిఎంజివై పథకంలో రూ 2 లక్షలు వాటిలో ఉపాధి హామీ పథకంలో రూ 61,260 వేలు, ఈ నిధులలో 100 బస్తాలు సిమెంట్ ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. బేస్మింట్ లెవెల్, రూప్ లెవెల్, రూఫ్ కాస్టెడ్, కంప్లీట్, మరుగుదొడ్డి దశల వారిగా బిల్లులు మంజూరు చేస్తామని, నిర్మించుకున్న లబ్దిదారులకు వెంటనే బిల్లులు చేస్తున్నమన్నారు. త్వరలో జన్మభూమిలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి నియోజకవర్గానికి 2200 గృహాలు మంజూరు కావచ్చన్నారు. ఆయన వెంట పెద్దారవీడు ఏఈ నిరీక్షణబాబు ఉన్నారు.