K. Bhagyaraj
-
వాళ్లంతా నెల తక్కువ పుట్టిన వాళ్లే: నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: పుస్తకావిష్కరణ వేదికగా సినీ సీనియర్ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ నోరు జారి వార్తల్లోకి ఎక్కారు. విమర్శలు, ఎదురు దాడి పెరగడంతో పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సి వచ్చింది. బుధవారం మోదీ సంక్షేమ పథకాలు, నవభారతం –2022 పుస్తకావిష్కరణ చెన్నైలో జరిగింది. బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నటుడు భాగ్యరాజ్ పాల్గొని సినీ స్టైల్లో డైలాగుల్ని పేల్చారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే వాళ్లంతా నెల తక్కువ పుట్టిన వాళ్లేనని ఎద్దేవా చేశారు. నెల తక్కువగా పుట్టిన వాళ్లను, ప్రత్యేక ప్రతిభావంతుల్ని గురి పెట్టి ఆయన వ్యాఖ్యలు చేశారనే ప్రచారంతో సామాజిక మాధ్యమాల్లో భాగ్యారాజ్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో సాయంత్రానికి మీడియా ముందుకు వచ్చిన భాగ్యరాజ్ ‘తాను బీజేపీ వ్యక్తిని కాదని...తమిళుడిని అని వ్యాఖ్యానించారు. నెల తక్కువ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, తాను దురుద్దేశంతో ఆ వ్యాఖ్య చేయలేదని, ప్రసంగ వేగంలో ఆ పదాన్ని ఉపయోగించినట్టుగా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు ఎవరి మనస్సునైనా నొప్పించి ఉంటే క్షమించండి అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. చదవండి: నాన్న చేసిన పనికి కన్నీళ్లొచ్చాయి ప్రముఖ దర్శకుడు మారుతికి పితృవియోగం -
విషం ఇచ్చి చంపేయమంటున్నారు!
పెరంబూరు : విశ్రాంతి కళాకారులకు విషం ఇచ్చి చంపేయండి అని అంటున్నారని దర్శక, నటుడు కె.భాగ్యరాజ్ అన్నారు. గత ఏడాది జూన్ 23న నడిగర్ సంఘం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో నాజర్ అధ్యక్షతన నటుడు విశాల్ వర్గం , కె.భాగ్యరాజ్ అధ్యక్షతన నిర్మాత ఐసరిగణేశ్ వర్గం పోటీ పడ్డారు. అయితే ఆ ఎన్నికలను రద్దు చేయాలంటూ కొందరు సభ్యులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడంతో ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. కాగా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు ఇంతకు ముందు జరిగిన ఎన్నికలు చెల్లవని, మరో మూడు నెలల్లో మళ్లీ నడిగర్ సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని తీర్పునిచ్చింది. అయితే ఆ తీర్పుపై నటుడు విశాల్ వర్గం మద్రాసు హైకోర్టులోనే రిట్ పిటిషన్ వేశారు. అందులో ఎన్నికలు సక్రమంగానే జరిగాయని, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహించడానికి సంఘానికి ఆర్థికస్తోమత లేదని పేర్కొన్నారు. కాబట్టి ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం ఈ నెల 10న తీర్పును ప్రకటిస్తూ మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న గత ఆదేశాలపై తాత్కాలిక స్టే విధించింది. కోర్టు స్టే విధించడాన్ని విశాల్ వర్గం స్వాగతించగా, భాగ్యరాజ్ వర్గం కోర్టు తీర్పునకు కట్టుబడతామని చెప్పారు.కాగా భాగ్యరాజ్ వర్గం బుధవారం స్థానిక టీ.నగర్,అబిబుల్లా రోడ్డులోని నడిగర్ సంఘం ఆవరణలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. (స్వచ్ఛ రాజకీయాలు కావాలన్నప్పుడు వస్తా!) దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ మాట్లాడుతూ... సంఘం ఎన్నికల వ్యవహారంలో ఇటీవల మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు తాము కట్టుబడి ఉంటామన్నారు. కాగా సంఘం ద్వారా పెన్షన్లను పొందుతున్న విశ్రాంతి సభ్యులకు 6 నెలలుగా పెన్షన్లు అందకపోవడంతో వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. కొందరు పేదరికం కారణంగా తమను విషం ఇచ్చి చంపేయండి అని అనడం బాధ అనిపించిందన్నారు. అనంతరం నిర్మాత ఐసరి గణేశ్ మాట్లాడుతూ మద్రాసు హైకోర్టు తీర్పును శిరసావహిస్తామన్నారు. సంఘానికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న న్యాయస్థానం తీర్పుపై నటుడు విశాల్ రిట్ పిటిషన్ వేయడం సరి కాదన్నారు. అయితే తాము మాత్రం మళ్లీ కోర్టులో అప్పీల్‌కు వెళ్లమని చెప్పారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించినా, ఇంతకు ముందు జరిగిన పోలింగ్ ఓట్లను లెక్కించినా తమకు సమ్మతమేనన్నారు. కాగా ఆరు నెలలుగా పింఛన్లు అందక విశ్రాంతి సంఘ సభ్యులు బాధపడుతున్నారన్నారు. అలాంటి వారికి తామే పింఛన్లు అందించాలని భావించామని అందులో భాగంగా ప్రస్తుతం సంఘం బాధ్యతల నిర్వహిస్తున్న ప్రభుత్వం నియమించిన అధికారిని కలిశారు. ఆయన్ని పెన్షన్లు పొందుతున్న విశ్రాంతి సభ్యుల పట్టికను ఇవ్వాల్సిందిగా కోరినట్లు చెప్పారు. (ఇక్కడైతే బతికిపోయేవాడు) అయితే ఆయన తాను నడిగర్ సంఘంకు మాత్రమే అధికారిగా నియమించబడ్డానని, పింఛన్లు పొందుతున్న వారి పట్టిక సంఘం ట్రస్ట్ బాధ్యతలు నిర్వహిస్తున్న వారి వద్ద ఉంటుందని చెప్పినట్లు తెలిపారు. కాబట్టి విశాల్ వర్గాన్ని పింఛన్లు పొందుతున్న విశ్రాంతి కళాకారుల పట్టికను తమకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామన్నారు, అదే విధంగా ఎవరైతే పింఛన్లకు అర్హులో వారంతా తమ గుర్తింపు కార్డులతో తమను కలిస్తే పింఛన్లు అందిస్తామని ఐసరి గణేశ్ పేర్కొన్నారు. -
పార్తిబన్ గురునమస్కారం!
నానాటికీ విలువలు పడిపోతున్న ఈ రోజుల్లో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్న పదాలకు అర్థాలు మారిపోతున్న ఈ తరంలో దర్శక నటుడు పార్తిబన్ ఒక బృహత్తర కార్యాన్ని ఆదివారం నిర్వహించారు. గురు నమస్కారం పేరుతో తనకు దర్శకత్వంలో ఓనమాలు నేర్పించిన గురువు దర్శకుడు కే. భాగ్యరాజ్‌కు ఘన సత్కారాన్ని నిర్వహించారు.ఆయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం కోడిట్ట ఇడంగళై నిరప్పుగా. ఇందులో తన గురువు భాగ్యరాజ్ కొడుకు శాంతనను ీహ రోగా ఎంపిక చేసుకున్నారు. కే.సత్య సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం స్థానిక అడయారులోని ఇమేజ్ ఆడిటోరియంలో నిర్వహించారు. అందులో భాగంగా తన గురువు కే.భాగ్యరాజ్‌కు గరునమస్కారం పేరుతో ఘన సన్మానం చేశారు. ఇదే వేదికపై దర్శకుడు పాండియరాజన్ సహా కే.భాగ్యరాజ్ శిష్యులందరూ కలిసి మరుప్పేనా(మరచిపోగలనా) పేరుతో జ్ఞాపికను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా కోడిట్ట ఇడంగళ్ నిరప్పుగా చిత్ర దర్శకుడు పార్తిబన్ మాట్లాడుతూ తన గురువుకు ఆ సత్కారంతో పాటు మరో కానుక కూడా ఉందన్నారు. తాను నిర్మించనున్న చిత్రానికి తన గురువు కే.భాగ్యరాజ్ దర్శకత్వం వహించనుండడమే ఆ కానుక అని పేర్కొన్నారు. చెప్పడమే కాదు అందుకు అడ్వాన్‌సను కూడా అందించారు. ఆ చిత్రంలో కథానాయకుడుగా ఈయన వారసుడు శాంతనునే నటిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగ్యరాజ్ గురువు భారతీతాజా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎస్పీ.ముత్తురామన్, కేఎస్.రవికుమార్, శంకర్, గాయకుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం, నటుడు శివకుమార్, ప్రభు, ఎం.విశాల్, కార్తీ, నటి సుహాసిని, రోహిణి, సుకన్య, లిజీ, ఏవీఎం.శరవణన్, కలైపులి ఎస్.థాను, ఎస్వీ.శేఖర్, లింగుస్వామి అతిథులుగా పాల్గొన్నారు.