రూ. 12 కోట్లు కావాలి!
సాక్షి, బెంగళూరు: నోట్లరద్దు వల్ల అంధుల ప్రపంచ కప్‌ను నిర్వహించడం భారంగా మారిందని సంఘం అధ్యక్షుడు కె. మహంతేశ్ అన్నారు. ‘వరల్డ్‌కప్ నిర్వహణకు కావల్సిన రూ. 12 కోట్ల నిధుల సేకరణ కష్టంగా మారింది. నోట్ల రద్దు కారణంగా కోకకోలా కంపెనీ తమ స్పాన్సర్‌షిప్‌ని రద్దుచేసింది. ఈ టోర్నీ కోసం బీసీసీఐ రూ.2 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చింది.
కానీ సుప్రీం కోర్టు బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులను తప్పించడంతో ఆ సంస్థ నుంచి రావాల్సిన డబ్బు కూడా ఇరకాటంలో పడింది. హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌ల నిర్వహణ ఖర్చును మాత్రం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు భరించేందుకు ముందుకు వచ్చాయి అని మహంతేశ్ తెలిపారు. జనవరి 31 నుంచి ఈ టోర్నీ జరుగుతుంది.