breaking news
K-RAMP Movie
-
‘K-ర్యాంప్’ సినిమా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్ మీట్ (ఫొటోలు)
-
అందుకే అల్లు అర్జున్ టాప్‌లో ఉన్నాడు.. నిర్మాత ఎస్కేఎన్ కామెంట్స్
టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించారు. కిరణ్ అబ్బవరం నటించిన కె ర్యాంప్ బ్లాక్‌బస్టర్ మీట్లో పాల్గొన్న ఎస్కేఎన్ బన్నీని కొనియాడారు. ఈ రోజు అల్లు అర్జున్ ఈ స్థానంలో ఉన్నారంటే అదొక్కటే కారణమన్నారు.అల్లు అర్జున్ హీరోగా వచ్చిన రేసు గుర్రం సినిమా గురించి నిర్మాత ఎస్కేఎన్ ఈవెంట్లో ప్రస్తావించారు. ఈ చిత్రంలో బ్రహ్మనందం చివరి పది నుంచి పదిహేను నిమిషాల్లో ఎక్కువగా డామినేట్ చేశారని అన్నారు. కానీ ఆయన ఫుల్ డామినేట్ చేశారని ఆ రోజు అల్లు అర్జున్ ఫీలవ్వలేదని చెప్పారు. ఆ సినిమాకు ఏది వర్కవుట్ అవుతుందో అది మాత్రమే చూశాడు బన్నీ. అందుకే ఈ రోజు బన్నీ టాప్ పొజిషన్లో ఉన్నారని నిర్మాత ఎస్కేఎన్ ప్రశంసలతో ముంచెత్తారు. కాగా.. యంగ్ హీరో కిరణ్ బ్బవరం నటించిన కె ర్యాంప్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీ దీపావళి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అప్పుడు #AlluArjun.. ఇప్పుడు #KiranAbbavaram.. - Producer #SKN #RaceGurram #KRamp #TeluguFilmNagar pic.twitter.com/8UNlnpdY0x— Telugu FilmNagar (@telugufilmnagar) October 21, 2025 -
బాక్సాఫీస్ వద్ద కిరణ్ అబ్బవరం రచ్చ.. ‘కె-ర్యాంప్’ కలెక్షన్స్ ఎంతంటే?
ఈ దీపావళికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో చివరి చిత్రంగా ఈ నెల 18న ‘కె-ర్యాంప్’(K Ramp ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. దీంతో ఈ మూవీ కలెక్షన్స్ భారీగా పెరిగాయి. ఈ సినిమా రిలీజైన 3 రోజుల్లోనే 17.5 కోట్ల రూపాయల వసూళ్లను అందుకుని బ్రేక్ ఈవెన్ సాధించినట్లు మెకర్స్ తెలిపారు. రిలీజైన 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అందుకోవడం ఈ సినిమా సక్సెస్ ను ప్రూవ్ చేస్తోంది. ‘మా చిత్రానికి పాజిటివ్ మౌత్ టాక్ తో రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. సిటీస్ తో పాటు బీ, సీ సెంటర్స్ లోనూ థియేటర్స్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు "K-ర్యాంప్" సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు’ మేకర్స్ తెలిపారు.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది.Prekshaka Devullaki 🙏❤️#KRamp #DiwaliKAblockbuster pic.twitter.com/9b5Ednjm4J— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 21, 2025 -
దీపావళి సినిమాలు.. జోరు మీదున్న హీరో.. వెనకబడ్డ సిద్ధు!
ఈసారి దీపావళి పండగ అక్టోబర్ 20వ తారీఖున వస్తోంది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అప్పుడే పండగ మొదలైంది. తెలుగులో పోటాపోటీగా సినిమాలు రిలీజయ్యాయి. అందులో ఒకటి ఉల్లిగడ్డ బాంబ్లా సౌండ్ చేస్తుంటే మరోటి చిచ్చుబుడ్డిలా వెలుగుతోంది. ఒకటైతే మందుగుండు లేని పటాకాలా మిగిలిపోయింది. అవేంటి? వాటి కలెక్షన్స్ ఏంటో చూద్దాం..రేసులో లేని మిత్రమండలిప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిత్రమండలి. అక్టోబర్ 16న రిలీజైన ఈ మూవీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్న చందంగా మారింది పరిస్థితి! మొదటిరోజే ఈ పటాకా ఎవరికీ నచ్చలేదు. ఇప్పుడిక వేరే సినిమాల ఆప్షన్స్ ఉండటంతో రేసులో చివరి స్థానానికి వెళ్లిపోయింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన మూవీ తెలుసు కదా. ఈ మూవీ అక్టోబర్ 17న విడుదలైంది. కథ బాగున్నా కాస్త ల్యాగ్ అవడంతో మిక్స్డ్ టాక్ అందుకుంటోంది.స్పీడు మీదున్న డ్యూడ్తొలి రోజు ఈ సినిమా రూ.3 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇది జాక్ కంటే కూడా తక్కువ! అయితే మొదటి రోజు కంటే రెండో రోజు వసూళ్లు కాస్త మెరుగయ్యాయని చెప్తున్నారు. ఇక అక్టోబర్ 17న తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ (Dude Movie) కూడా రిలీజైంది. ఈ మూవీ సెకండాఫ్‌పై కాస్త అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఎగబడి మరీ చూస్తున్నారు. ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లు రాబట్టిందని అధికారిక ప్రకటన విడుదల చేశారు.కె-ర్యాంప్ ఫస్ట్ డే కలెక్షన్స్అన్నిటికంటే ఆలస్యంగా (అక్టోబర్ 18న) వచ్చిన మూవీ కె-ర్యాంప్ (K-Ramp Movie). ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్టు దిగిందా? లేదా? అంటూ బరిలోకి దిగిన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) సినిమాకు హిట్ టాక్ వస్తోంది. తొలిరోజు ఈ చిత్రానికి రూ.4.5 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని చిత్రయూనిట్ ప్రకటించింది. మరి ఏ సినిమా వసూళ్లు పెరగబోతున్నాయి? దీపావళి హిట్ బొమ్మ ఏదనేది చూడాలి! DAY 2 > DAY 1 for #TelusuKada ❤🔥DIWALI'S RADICAL BLOCKBUSTER sees massive growth on Saturday with housefulls all over 💥💥Book your tickets now!🎟️ https://t.co/QvC10IjSqS#LoveU2 #UnapologeticallyRadicalSTAR BOY @Siddubuoyoffl @NeerajaKona #RaashiiKhanna… pic.twitter.com/UdtkfHUrmu— People Media Factory (@peoplemediafcy) October 18, 2025 DUDE DIWALI BLAST is unstoppable at the box office with massive love from the audience ❤️#Dude collects a gross of 45 CRORES WORLDWIDE in 2 days & going super strong ❤🔥Book your tickets now and celebrate #DudeDiwali 🔥🎟️ https://t.co/JVDrRd4PZQ🎟️ https://t.co/4rgutQNl2n… pic.twitter.com/TLNPYTpNsV— Mythri Movie Makers (@MythriOfficial) October 19, 2025Box-Office daggara tana Mass Madness chupinchina Kumar Abbavaram 🤙🔥𝟰.𝟱 𝗖𝗿𝗼𝗿𝗲 Day1 GROSS for the 𝐃𝐈𝐖𝐀𝐋𝐈 𝐖𝐈𝐍𝐍𝐄𝐑 #KRamp 💥❤️🔥Grab Your Seats Now!!— https://t.co/nS9p8rSUlZ#KRampKaDiwali pic.twitter.com/BoeIifohez— Hasya Movies (@HasyaMovies) October 19, 2025చదవండి: కోటిలో బ్యాగులు అమ్ముకున్నా.. బాత్రూమ్లు కడిగా: ‘జబర్దస్త్’ కమెడియన్ -
పోటీలోనూ వసూళ్లు బాగున్నాయి
‘‘ఈ పండక్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని, చిన్న మెసేజ్ ఇవ్వాలని, ఒక వైబ్ క్రియేట్ అవ్వాలని మేం చేసిన ప్రయత్నం ‘కె–ర్యాంప్’ సినిమా. ప్రేక్షకుల నుంచి ΄పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పుడున్న పోటీలో ఇంతమంచి కలెక్షన్స్ రావడం మామూలు విషయం కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు వెళ్తున్నారు. షో బై షో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. స్క్రీన్స్ యాడ్ అవుతున్నాయి. ఈ దీపావళికి ‘కె–ర్యాంప్’తో నాకు మంచి సక్సెస్ అందించిన అందరికీ ధన్యవాదాలు’’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా, యుక్తీ తరేజా హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘కె–ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం శనివారం విడుదలైంది. శనివారం సాయంత్రం యూనిట్ నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో రాజేశ్ దండ మాట్లాడుతూ– ‘‘ఇలాంటి సినిమాల్లో లాజిక్స్ వెతక్కూడదు. అయితే కొందరు మా సినిమా పట్ల పక్షపాతం చూపిస్తున్నారు. దీపావళికి రిలీజైన సినిమాల్లో ఏ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసి, నిజాలు తెలుసుకోవాలి’’ అని చెప్పారు. ‘‘కె–ర్యాంప్’ను హీరో కిరణ్‌గారు భుజాన వేసుకుని మోశారు కాబట్టి మంచి రిజల్ట్ వచ్చింది. ప్రేక్షకుల స్పందన బాగుంది’’ అన్నారు జైన్స్ నాని. ‘కె–ర్యాంప్’ విజయం పట్ల వీకే నరేశ్, యుక్తీ తరేజా సంతోషం వ్యక్తం చేశారు. -
'కె- ర్యాంప్' థాంక్స్ మీట్లో సందడిగా చిత్ర యూనిట్ (ఫోటోలు)
-
కె ర్యాంప్ మూవీ హిట్టా..! ఫట్టా..!
-
‘కె-ర్యాంప్’ మూవీ రివ్యూ
ఈ దీపావళికి ఇప్పటికే మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు నాలుగో సినిమాగా ‘కె- ర్యాంప్’(K- Ramp Review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? కిరణ్ అబ్బవరం ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..కుమార్ అబ్బవరం(కిరణ్ అబ్బవరం) రిచ్ కిడ్. ఎంసెంట్ ఫెయిల్ అవ్వడమే కాకుండా రోజు తాగుతూ..చిల్లరగా ప్రవర్తిస్తుంటాడు. కొడుకు మీద ప్రేమతో నాన్న(సాయి కుమార్) ఒక్క మాట కూడా అనలేకపోతాడు. జ్యోతిష్యుడు సలహాతో మెడిసిన్ చదివించేందుకు కొడుకును కేరళకు పంపుతాడు. అక్కడ కూడా ఇలాగే తాగుతూ ఎంజాయ్ చేస్తున్న కుమార్.. తొలి చూపులోనే క్లాస్మేట్ మెర్సీ(యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు. మెర్సీ కూడా కుమార్‌ని ఇష్టపడుతుంది. ఇద్దరి ఫ్యామిలీకీ వీరి ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో మెర్సికి అరుదైన వ్యాధి పోస్ట్ ట్రామాటిక్ స్టెస్ డిజార్డర్ (PSTD) ఉందనే విషయం తెలుస్తుంది. ఆమెకు ఉన్న వ్యాదితో కుమార్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? మెర్సీకి ఆ వ్యాది ఎలా సోకింది? దాని పరిష్కారం కోసం కుమార్ ఏం చేశాడు? ఈ కథలో నరేశ్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ప్రమోషన్స్‌లో చెప్పినట్లుగానే ఇది కామెడీతో కూడిన కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్. ఇలాంటి సినిమాలలో లాజిక్స్ గురించి వెతుకొద్దు. కథలో కొత్తదనం, ట్విస్టులు కూడా పెద్దగా ఆశించొద్దు. ఊరమాస్ కామెడీ సీన్లతో ఫన్ జనరేట్ చేస్తే చాలు.. ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు. నూతర దర్శకుడు జైన్స్ నాని అదే పని చేశాడు. కథపై దృష్టిపెట్టకుండా హీరో కిరణ్ అబ్బవరం బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా సీన్లను పేర్చుకుంటూ వెళ్లాడు. అవి హిలేరియస్ అనిపించాయి. రొటీన్ కామెడీ స్టోరీకి చివరిలో ఎమోషనల్ టచ్ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హీరో పాత్ర నేపథ్యాన్ని వివరిస్తూ కథ ప్రారంభం అవుతుంది. ఇక కిరణ్ అబ్బవరం ఎంట్రీ సీన్ థియేటర్స్‌లో ఈళలు వేయిస్తుంది. రాజశేఖర్ సినిమా పాటలకు ఆయన వేసే స్టెప్పులు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత కథంతా రొటీన్‌గానే సాగుతుంది. కుమార్ కేరళకు వెళ్లడం.. మెర్సీని చూసి ప్రేమలో పడడం.. ఆమె కోసం చేసే పనులు ఇవ్వన్నీ రెగ్యులర్ సినిమాల్లో చూసినట్లుగానే ఉంటాయి. కొన్ని ఊరమాస్ సన్నివేశాలు మినహా ఫస్టాఫ్ అంతా రొటీన్‌గానే అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం మొత్తం హీరోయిన్ ఉన్న ఆరోగ్య సమస్యతో హీరో ఎలా ఇబ్బందికి గురయ్యాడనేదే చూపించారు. అయితే ఈ క్రమంలో వచ్చే సీన్లు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా వెన్నెల కిశోర్ పాత్ర ఎంట్రీ తర్వాత ఫన్ డోస్ ఇంకాస్త పెరుగుతుంది. ఒకవైపు వెన్నెల కిశోర్.. మరోవైపు నరేశ్..వీరిద్దరి మధ్య సాగే సంభాషణలు..ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథనం ఎమోషనల్‌గా సాగుతుంది. నరేశ్ చెప్పే మాటలు.. సాయి కుమార్-కిరణ్ అబ్బవరం మధ్య వచ్చే సీన్లు భావోద్వేగానికి గురి చేస్తాయి. నరేశ్ పాత్ర చెప్పే కొన్ని డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. లాజిక్స్, కొత్తదనం ఆశించకుండా థియేటర్స్‌కి వెళితే.. హాయిగా నవ్వుకొవచ్చు. ఎవరెలా చేశారంటే.. ఈ చిత్రానికి కిరణ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. యాక్షన్, ఫన్‌తో పాటు ఎమోషనల్ సీన్లలోనూ అదరగొట్టేశాడు. ఆయన కామెడీ టైమింగ్ కూడా సినిమాకు ప్లస్ అయింది. అరుదైన వ్యాధి ఉన్న మెర్సీ పాత్రలో యుక్తి తరేజా ఒదిగిపోయింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేదు కానీ.. సెకండాఫ్‌లో మాత్ర తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై కిరణ్-యుక్తిల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అయితే కిరణ్ పాత్ర పూరి జగన్నాథ్ సినిమాల్లోని హీరోని గుర్తు చేస్తే.. యుక్తి పాత్ర మారుతి సినిమాల్లోని హీరోయిన్ని గుర్తు చేస్తుంది. ఇక వీకే నరేశ్ పాత్ర ఈ సినిమాకు మరో ప్రధాన బలం. ఆయన తెరపై కనిపించిన ప్రతిసారి నవ్వులు పూశాయి. అయితే ఆయనకు ఇంకొన్ని సీన్లు పడితే బాగుందనిపించింది. ఇక వెన్నెల కిశోర్ కనిపించేది కాసేపే అయినా.. ఆ ఎపిసోడ్ అదిరిపోతుంది. సాయి కుమార్, మురళీధర్ గౌడ్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. పాటలు సందర్భానుసారంగా వచ్చాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. కేరళ అందాలను తెరపై బాగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. -
సక్సెస్, ఫెయిల్యూర్స్ అన్నీ చూశా: కిరణ్ అబ్బవరం
‘‘నేను సక్సెస్ చూశాను. ఫెయిల్యూర్స్ కూడా చూశాను. సో... వీటి విషయంలో పరిణతి చెందాను. కానీ విజయం వచ్చిన ప్రతిసారీ చాలా పాజిటివ్‌గా ఉంటుంది. నా సినిమా వస్తే బాగుంటుందనే ఇమేజ్ను ప్రేక్షకుల నుంచి తెచ్చుకోవాలన్నదే నా ప్రయత్నం. ‘కె–ర్యాంప్’ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు’’ అని కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) అన్నారు. ఆయన హీరోగా, యుక్తి తరేజా హీరోయిన్గా నటించిన చిత్రం ‘కె–ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం నేడు (అక్టోబర్ 18న) విడుదలవుతోంది. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. ‘‘కె–ర్యాంప్’లాంటి సినిమా వచ్చి చాలా రోజులైంది. క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్ ఇది. ఇందులో కుమార్ అనే పాత్ర చేశాను. ఈ సినిమా ఫస్టాఫ్ యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఎంగేజ్ చేస్తుంది’’ అని అన్నారు. ‘‘పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇది. ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులను ఈ సినిమా రిఫ్లెక్ట్ చేస్తుంది’’ అని తెలిపారు వీకే నరేశ్. ‘‘ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేసుకుని, సినిమా చేశాను’’ అన్నారు జైన్స్ నాని. ‘‘ఈ చిత్రంలో డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను’’ అని పేర్కొన్నారు యుక్తీ తరేజా.చదవండి: ‘కె-ర్యాంప్’ మూవీ ట్విటర్ రివ్యూ -
‘కె-ర్యాంప్’ మూవీ ట్విటర్ రివ్యూ
గతేడాది దీపావళికి ‘క’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం..ఈ సారి ‘కె-ర్యాంప్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్గా నటించింది.ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నేడు(అక్టోబర్ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ‘కె-ర్యాంప్’ ఎలా ఉంది? కిరణ్ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా ? తదితర అంశాలను ఎక్స్‌లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి.ఎక్స్‌లో కె-ర్యాంప్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వినిస్తుంది. సినిమా బాగుందని, కిరణ్‌కి భారీ విజయం సాధించిందని కొంతమంది అంటుంటే.. బాగోలేదని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.#KRamp Review : A Good Festive Fun filled Entertainer - 3/5 💥💥💥Youth Star ⭐️ @Kiran_Abbavaram RAMPAGE TIMING with one man show totally 👍🔥❤️🔥 Mass Center audience ki eyyite eye feast 🤩🙌💥#KiranAbbavaram #JainsNani Director @JainsNani presented second half so superbly… pic.twitter.com/vsMkne6yP0— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) October 18, 2025ఈ పండక్కి మంచి ఫన్ ఎంటర్టైనర్ సినిమా ఇది. ఈ మూవీకి కిరణ్ వన్‌మ్యాన్ షో. మాస్ సెంటర్ ఆడియన్స్ సినిమా బాగా ఎక్కేస్తుంది. సెకండాఫ్‌ని దర్శకుడు బాగా డీల్ చేశాడు. డైలాగ్స్ మరో ప్రధాన బలం’ అంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు.A good overall watch Family entertainer 👌Second half pub scene 😂😂 Ee #Diwali kuda needhey @Kiran_Abbavaram #KRamp #KrampReview https://t.co/mwsuneMLhA— Karthik Chowdary (@KChowdaryyy) October 18, 2025 ఓవరాల్‌గా సినిమా బాగుంది.ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సెకండాఫ్ పబ్ సీన్ బాగుంది. ఈ దిపావళి కూడా కిరణ్ అబ్బవరందే అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు.#KRamp A Silly, Outdated Film that’s Over the Top from Start to Finish!The film follows a very simple story with a routine to the core screenplay that we’ve seen countless times before. This might have worked for a genre that aims purely to entertain, but here the comedy and…— Venky Reviews (@venkyreviews) October 18, 2025 ప్రారంభం నుంచి ముగింపు వరకు ఓవర్ ది టాప్‌గా ఉండే ఒక సిల్లీ చిత్రమిది. ఇలాంటి కథలను మనం చాలా వరకు చూశాం. కేవలం వినోదాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే క్రింజ్‌గానే అనిపిస్తుంది. కొన్ని కామెడీ సీన్లను దర్శకుడు బాగా డీల్ చేశాడు. మిగిలి రచన పేలవంగా ఉంది అంటూ ఓ నెటిజన్ 2 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు.Done with my show, good 2nd half followed..!! Disorder characterization scenes comedy worked in parts. Kumar abbavaram steals the show from scene 1 except during father sentiment. Climax is just good. Overall a decent entertainer. 2.5/5 #KRamp— Peter Reviews (@urstrulyPeter) October 17, 2025#KRamp LOUD MASS ENTERTAINER What team promised is Completly Fulfilled👍, Okayish 1st half followed by Very good 2nd half🌟Introduction 🔥🔥, 2nd half Some comedy scenes🔥. Good film for @Kiran_AbbavaramAfter #KA MASSSY ENTERTAINERDIWALI WINNER 🏆 🌟🌟🌟/5— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) October 18, 2025#KRampExcept for a couple of sequences in the second half nothing is interesting. Outdated story,Unwanted songs, Predictable screenplay and those comedy scenes 🙏 Forget about music. No emotional depth except climax sequence. @ItsActorNaresh and @vennelakishore are the saviours.— Vaishu Mahadevan (@VaishuMahadeva2) October 17, 2025Second half >>>Full tooo Fun 😂🔥Fully entertainment Bomma 3.25/5 - #KRamp https://t.co/9a8mqTUMc5— let's x Cinematica (@letsxCinematica) October 17, 2025 -
కిరణ్ అబ్బవరం ‘K-ర్యాంప్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘కె-ర్యాంప్’ టీజర్, ట్రైలర్ తో డీజే మిక్స్..
తన సినిమాలను ప్రేక్షకులకు రీచ్ చేసేందుకు సాధ్యమైనంత కొత్తగా ప్రయత్నిస్తుంటారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆయన తన లేటెస్ట్ మూవీ కె-ర్యాంప్‌పై కూడా ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. గతంలో తన సినిమా ‘ఎస్ఆర్ కల్యాణమండపం’కు డీజే మిక్స్ చేసి ఆ కంటెంట్ ను వైరల్ చేశారు. ఇప్పుడు ‘K-ర్యాంప్’ టీజర్, ట్రైలర్ తో డీజే మిక్స్ చేసి యూత్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ డీజే మిక్స్ "K-ర్యాంప్" మీద ఒక వైబ్ క్రియేట్ చేస్తోంది. టీజర్, ట్రైలర్ లో పేలిన డైలాగ్స్ అన్నీ ఈ డీజే మిక్స్ లో యాడ్ చేయడం కొత్త ఫీల్ కలిగిస్తోంది.జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. -
పవన్ గురించి ప్రశ్న.. 'వద్దు' అని కిరణ్ అబ్బవరం
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమాతో వస్తున్నాడు. 'కె ర్యాంప్' పేరుతో తీసిన ఈ చిత్రం.. దీపావళి కానుకగా ఈ శనివారం (అక్టోబరు 18) థియేటర్లలోకి రానుంది. దీంతో ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఇతడు.. ఒక్కడే ఊళ్లు తిరుగుతూ తన మూవీని ప్రమోట్ చేసుకుంటున్నాడు. తాజాగా ఓ మీడియా మీట్ సందర్భంగా పలువురు అభిమానులు, మూవీ లవర్స్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గురించి ప్రశ్న రాగా కిరణ్ నుంచి 'వద్దు' అనే సమాధానం వచ్చింది.'పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా 'ఓజీ' మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్‌పీరియెన్స్ ఎలా అనిపించింది' అని ఓ వ్యక్తి.. కిరణ్ అబ్బవరంని అడిగాడు. దీనికి కిరణ్ నుంచి 'ఇప్పుడు వద్దు బ్రో' అనే సమాధానమొచ్చింది. అయితే ఎందుకు నో చెబుతున్నాననే దానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు. 'ఇప్పుడు నా సినిమా 'కె ర్యాంప్' రిలీజ్ ఉంది. ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం చెబితే దానికోసం ఎక్కువ వాడుకుంటున్నారేమో, ఇప్పుడు ఎక్కువ చెబితే టికెట్స్ తెగుతాయేమో అనే ఫీలింగ్ వస్తుంది. నాకు అది వద్దు. మరీ అన్నిసార్లు అభిమానం గురించి పదేపదే చెప్పడం కరెక్ట్ కాదు' అని కిరణ్ అబ్బవరం నుంచి సమాధానం వచ్చింది.(ఇదీ చదవండి: క్షమాపణ చెబుతూ మనోజ్ లెటర్ రాశాడు: మౌనిక)కిరణ్ చెప్పింది నిజమేనేమే! ఎందుకంటే గతంలో ఒకరిద్దరు తెలుగు హీరోలు.. తమ సినిమాల రిలీజ్ టైంలో పవన్ అభిమానుల్ని ఆకట్టుకునేందుకు చాలా మాటలు చెప్పేవారు. కిరణ్ అబ్బవరం ఈ సమాధానం చెబుతుంటే అవే సంఘటనలు గుర్తొచ్చాయి. 'కె ర్యాంప్' విషయానికొస్తే.. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా దీన్ని తీశారు. కేరళ బ్యాక్ డ్రాప్లో మొత్తం స్టోరీ అంతా జరగనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంటోంది.'కె ర్యాంప్'తో పాటు ఈ వీకెండ్ ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్.. లిస్టులో ఉన్నాయి. అయితే ఎవరికి వాళ్లు గట్టిగా ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. మరి వీళ్లలో ఎవరు హిట్ కొడతారనేది చూడాలి? ప్రస్తుతానికి అన్ని చిత్రాల ట్రైలర్స్ బాగున్నాయి. కాకపోతే ఏది నిలబడి గెలుస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఇలియానా.. మూడోసారి తల్లి కాబోతుందా?) -
ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు: నిర్మాత రాజేశ్ దండ
‘‘నిర్మాతగా ‘కె–ర్యాంప్’ నాకు ఆరవ సినిమా. నా గత ఐదు చిత్రాల్లో ఎక్కడా ఇబ్బందికరమైన పదాలు లేవు. ఒక్కో సినిమా కథ ఒక్కోలా ఉంటుంది. అంతే కానీ కావాలని కొన్ని పదాలు పెట్టి, ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించాలని అనుకోను. అలాంటి సినిమాలు నేను తీయను. ‘కె–ర్యాంప్’ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు’’ అని చె΄్పారు నిర్మాత రాజేశ్ దండ. కిరణ్ అబ్బవరం, యుక్తీ తరేజా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కె–ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాజేశ్ దండ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో కిరణ్‌గారు కుమార్ అబ్బవరం అనే పాత్రలో నటించారు. ఈ సినిమా కథ విని ఎగై్జట్ అయ్యాను. మా సినిమాకు సెన్సార్ వాళ్ళు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది ఇందులో ఇబ్బందికరమైన పదాలు ఉన్నాయని కాదు. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. వీటిని చూసి ఎవరైనా ఆడియన్స్ ప్రేరణ పొందుతారేమోనని ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు... అంతే. వల్గారిటీ లేదు. ఇక ‘కె–ర్యాంప్’ సినిమా కిరణ్‌గారి వన్ మ్యాన్ షోలా ఉంటుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ బ్లాస్ట్ అవుతుంది.ఈ సినిమాతో నిర్మాత శివతో నాకు మంచి ప్రయాణం మొదలైంది. నా మీద నమ్మకంతో కథ వినకుండానే ఈ సినిమాలో భాగమయ్యారు శివ. ప్రస్తుతం మా బ్యానర్లో హీరోయిన్ సంయుక్తతో ఓ సినిమా చేస్తున్నాం. అలాగే ‘అల్లరి’ నరేశ్‌గారితో ఓ సినిమా ఉంది’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘టార్గెటెడ్ ట్రోలింగ్ గురించి బన్నీ వాసుగారు మాట్లాడిన విషయాలను నేను ఫాలో కాలేదు. పూర్తి విషయాలు తెలిసిన తర్వాత స్పందిస్తాను’’ అని చె΄్పారు. ‘‘కిరణ్గారిని ఈ సినిమాలో కొత్తగా చూస్తారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు శివ బొమ్మకు. -
జోక్యం చేసుకోలేదు: జైన్స్ నాని
‘‘సినిమాలంటే చిన్నప్పటి నుంచే నాకు ప్యాషన్. కిరణ్ అబ్బవరంతో ఏడాదిన్నర ప్రయాణం చేశాను. ‘కె–ర్యాంప్’ చిత్ర కథ రాసుకుంటున్న సమయంలో తనకు అనిపించింది నాతో షేర్ చేసుకునేవారాయన. అంతేకానీ నా కథ, స్క్రిప్ట్ విషయంలో కిరణ్ ఎక్కడా జోక్యం చేసుకోలేదు’’ అని డైరెక్టర్ జైన్స్ నాని చెప్పారు. కిరణ్ అబ్బవరం, యుక్తీ తరేజ జోడీగా నటించిన చిత్రం ‘కె–ర్యాంప్’. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్‌పై రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 18న రిలీజ్ అవుతోంది.ఈ సందర్భంగా జైన్స్ నాని మాట్లాడుతూ–‘‘మాది నెల్లూరు. మద్రాస్ ఐఐటీలో చదువుకున్నా. అక్కడ కొన్ని షార్ట్ ఫిలింస్ చేశాను. ఇండస్ట్రీకి వెళతానన్నప్పుడు మా నాన్నగారు.. ‘ఉద్యోగమా? డైరెక్టరా? అన్నది నువ్వే నిర్ణయించుకో?’ అని ప్రోత్సహించారు. ‘కె–ర్యాంప్’ లో హీరో క్యారెక్టర్ పేరు కుమార్. కథకు, హీరో పాత్రకి సరి పోయేలా ‘కె–ర్యాంప్’ అనే టైటిల్ పెట్టాం. పక్కాగా ఫ్యామిలీస్ చూడాల్సిన సినిమా మాది.ఈ మూవీ ద్వారా కిరణ్, యుక్తి తరేజాకి మంచి పేరొస్తుంది. ఫ్రెష్ నెస్ కోసమే కేరళ నేపథ్యం తీసుకున్నాం. 47 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాం. ఫైనల్ కాపీ చూశాక రాజేష్, శివగార్లు నన్ను అభినందించారు. దీ పావళికి తెలుగులో బాగా పోటీ ఉంది. అయితే అన్ని సినిమాలూ హిట్ కావాలి. మా చిత్రం ఇంకొంచెం పెద్ద హిట్ కావాలి. నాకు ఎనర్జీతో ఉండే వినోదాత్మక చిత్రాలంటే ఇష్టం’’ అని చెప్పారు. -
'కె. ర్యాంప్' సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి హీరోయిన్
టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్‌గా గుర్తింపు పొందిన వారు ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే జెనీలియా, భూమిక, అన్షు, లయ, రంభ, మీనా, విజయశాంతి,సంగీత వంటి హీరోయిన్లు రీఎంట్రీ ఇచ్చారు. వీరిలో కొంతమంది మెప్పించారు కూడా. అయితే, తాజాగా ముంబై బ్యూటీ కామ్న జెఠ్మలానీ( Kamna Jethmalani) టాలీవుడ్లోకి మరో ఛాన్స్ కోసం వచ్చేసింది. కిరణ్ అబ్బవరం సినిమా కె.ర్యాంప్తో ప్రేక్షకులను పలకరించనుంది.2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా ఆమె సినీరంగ ప్రవేశం చేసింది. తన మూడో చిత్రమైన రణంతో బాగా పాపులర్ అయింది. అయితే, ఆ తర్వాత కింగ్, సైనికుడు వంటి సినిమాల్లో కనిపించినా పెద్దగా ప్రభావం చూపించలేదు. 2013లో చివరిగా శ్రీ జగద్గురు ఆది శంకర మూవీలో మాత్రమే కనిపించింది. సుమారు 12 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు వెండితెరపైకి కామ్నా జెఠ్మలానీ రానుంది.కామ్నా జఠ్మలానీ 2014, ఆగస్టు 11న బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్‌ను వివాహం చేసుకుంది. సినిమా ఛాన్సుల కోసం ఈ విషయాన్ని కూడా ఆమె కొంత కాలం దాచింది. అయినప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆమె కె.ర్యాంప్తో వస్తుంది. అయితే, ఎంతమాత్రం విజయం సాధిస్తుందో చూడాల్సి ఉంది.రీసెంట్గా జూనియర్ సినిమాతో జెనీలియా మెప్పించింది. కానీ, తమ్ముడు సినిమాలో లయ పాత్ర అంతగా క్లిక్ కాలేదని చెప్పాలి. మరోవైపు సంగీత మాత్రం రీఎంట్రీలో చాలా సినిమాలతో అదరగొట్టేస్తుంది. అయితే.., భూమిక, మీరా జాస్మిన్, సదా వంటి స్టార్స్ ఇప్పటికే గట్టిపోటీ ఇచ్చేందుకు రేసులో ఉన్నారు. -
థియేటర్స్‌లో గట్టిగా నవ్వుకుంటారు: కిరణ్ అబ్బవరం
‘‘కొత్త స్క్రిప్ట్‌తో సినిమా చేద్దామని ‘క’ చిత్రం చేశాను. కానీ ‘కె–ర్యాంప్’ మాత్రం నా అభిమానుల కోసం చేశాను. ఈ చిత్రంలో నా క్యారెక్టరైజేషన్ ఇప్పటి యువ తారానికి దగ్గరగా ఉంటుంది. ప్రేక్షకులు థియేటర్స్‌లో గట్టిగా నవ్వుకుంటారు. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ ఈ చిత్రదర్శకుడు నానియే’’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం ‘కె–ర్యాంప్’.యుక్తీ తరేజా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో వీకే నరేశ్, సాయికుమార్, ‘వెన్నెల’ కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండా, శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జైన్స్ నాని మాట్లాడుతూ – ‘‘ట్రైలర్‌లోని ఎనర్జీకి సినిమా ఏ మాత్రం తగ్గదు’’ అని చె ప్పారు. ‘‘మా సినిమా విడుదల తేదీని చాలా రోజుల క్రితమే ప్రకటించాం.ఈ దీపావళికి పెద్ద బ్యానర్స్ నుంచి సినిమాలు వస్తున్నాయి. అయినా మా సినిమాకు థియేటర్స్ దొరుకుతాయి’’ అని పేర్కొన్నారు రాజేశ్ దండా. ‘‘ఈ చిత్రంలో ఓ వైవిధ్యమైన పాత్ర చేశాను’’ అని తెలి పారు వీకే నరేశ్. సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి, రైటర్ రవి మాట్లాడారు. -
పక్క రాష్ట్రం హీరోలను అలా కించపరచకండి: హీరో కిరణ్ అబ్బవరం
ఇటీవల డ్యూడ్ సినిమా ప్రెస్మీట్లో ఓ మహిళా జర్నలిస్ట్.. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan )పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘మీరు హీరోలానే ఉండరు.. రెండు సినిమాలకే ఇంత సక్సెస్ వచ్చిందంటే అది మీ హార్డ్ వర్కా లేదా అదృష్టమా అని ఆమె ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు పక్కనే ఉన్న సీనియర్ నటుడు శరత్ కుమార్ మంచి సమాధానమే ఇచ్చాడు. అయితే ఆ తర్వాత ఆ జర్నలిస్ట్‌పై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న హీరోని అలా అనడం కరెక్ట్ కాదంటూ ఆమెను ట్రోల్ చేశారు. తాజాగా ఈ వివాదంపై తెలుగు హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) స్పందించారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోలను అలా కించపరస్తూ ప్రశ్నలు అడగొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'కె ర్యాంప్'. దీపావళి కానుకగా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయగా.. సదరు మహిళా జర్నలిస్ట్ మరోసారి ప్రదీప్ రంగనాథన్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి వచ్చాడని చెప్పాలనుకున్నానని.. దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ట్రోల్ చేస్తున్నారని ఆమె చెబుతూ.. ‘మీరేమంటారు?’ అని కిరణ్‌ని అడిగారు.‘నన్ను అడగండి పర్లేదు. కానీ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఒక హీరోని అలా కించపరిచే ప్రశ్నలు అడగడం మంచిది కాదు. మీరు(మీడియా) నన్ను ఒక మాట అన్న పడతా. మనం మనం ఒకటి. కానీ పక్క స్టేట్ నుంచి వచ్చిన వాళ్లను అలా కించపరచడం కరెక్ట్ కాదు. మీ లుక్స్ ఇలా ఉన్నాయని అడగడం చూసి నాకే చాలా బాధగా అనిపించింది. తప్పగా అనుకోకండి.. ఇకపై అలాంటి ప్రశ్నలు అడగకండి’ అని సదరు మహిళా జర్నలిస్టుకు కిరణ్ విజ్ఞప్తి చేశారు. -
కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' ట్రైలర్ రిలీజ్
కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన సినిమా 'కె ర్యాంప్'. దీపావళి కానుకగా ఈ నెల 18న థియేటర్లలోకి మూవీ రానుంది. ఇప్పటికే ప్రమోషన్లలో టీమ్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఫన్నీగా ఉంటూనే ఆకట్టుకునేలా ఉంది. టీజర్ విడుదలైనప్పుడు లిప్ కిస్సులు, బూతుల గురించి కాస్త నెగిటివిటీ వచ్చింది. దీంతో ఈసారి ట్రైలర్లో ఆ డోస్ తగ్గించినట్లే కనిపించారు. రెండు మూడు చోట్ల మాత్రం కిస్సులు, డబుల్ మీనింగ్ బూతులు వినిపించాయి.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ బామ్మర్ది పెళ్లి.. అమ్మాయికి వెంకటేశ్ ఫ్యామిలీతో బంధుత్వం)ట్రైలర్ బట్టి చూస్తే.. కుమార్ అనే కుర్రాడికి తండ్రి మాత్రమే ఉంటాడు. దీంతో అల్లరిచిల్లరగా తిరుగుతూ మందు తాగుతూ బతికేస్తుంటాడు. అయితే చదువుకునేందుకు కేరళలోని కొచ్చి వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఇబ్బంది పెట్టి మరీ ఆమె తనని ప్రేమించేలా చేస్తాడు. కుమారే అనుకుంటే ఆమెకు సైకలాజికల్ ప్రాబమ్స్ ఉంటాయి. దీంతో తిక్కతిక్కగా ప్రవరిస్తుంది. చివరకు ఈ జంట ఒక్కటైందా లేదా అనేది స్టోరీలా అనిపిస్తుంది.చాన్నాళ్లుగా కిరణ్ అబ్బవరం సినిమాలు చేస్తున్నాడు. కానీ గతేడాది దీపావళికి రిలీజైన 'క' చిత్రం మాత్రమే హిట్ అయింది. ఈ ఏడాది మార్చిలో 'దిల్ రుబా' అనే మూవీతో వచ్చాడు. ఇది ఘోరంగా ఫ్లాప్ అయింది. దీంతో యూత్‌ని టార్గెట్ చేసి 'కె ర్యాంప్' తీశాడు. మరి ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి? దీపావళికి దీనితో పాటు మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్ సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే) -
కిరణ అబ్బవరం కె ర్యాంప్.. మరో సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం కె-ర్యాంప్. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో యుక్తి తరేజా హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి టిక్కల్ టిక్కల్ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు సురేంద్ర కృష్ణ లిరిక్స్ అందించగా.. సాయిచరణ్ భాస్కరుని పాడారు. ఈ సాంగ్‌కు చైతన్ భరద్వాజ్ సంగీతమందించారు. ఇప్పటికే రిలీజైన కలలే కలలే.. అంటూ సాగే పాట ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
‘కె-ర్యాంప్’ అంటే బూతు కానేకాదు.. అర్థం చెప్పిన డైరెక్టర్
కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘కె-ర్యాంప్’( K Ramp). ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే బూతు సినిమా అని ట్రోల్ చేశారు. ఇక ట్రైలర్లో కూడా ఒకటి రెండు బూతు పదాలు ఉండడంతో..కె-ర్యాంప్ అంటే కూడా బూతు పదమే అని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టైటిల్‌పై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. కె-ర్యాంప్ అంటే అసభ్యపదం కాదని.. దాని అర్థం కిరణ్ అబ్బవరం ర్యాంప్ అని అన్నారు. ఆయనను దృష్టిలో పెట్టుకొనే ఈ స్క్రిప్ట్ రాశానని చెప్పారు. తాజాగా చిత్రయూనిట్ నిర్వహించిన ప్రెస్మీట్లో దర్శకుడు జైన్స్ నాని మాట్లాడుతూ.. ‘టైటిల్ చూసి అది బూతు పదం అని అంతా అనుకుంటున్నారు. కానీ మా ఉద్దేశం అది కాదు. కె-ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం ర్యాంప్. ఈ సినిమాలో హీరో పేరు కుమార్.. అందుకే టైటిల్ అలా పెట్టాం’ అన్నారు.కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) మాట్లాడుతూ.. థియేటర్లో కూర్చుని నవ్వుకునే వైబ్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా విజయం సాధిస్తుందా లేదా అనేది పక్కన పెడితే నాకు నాని రూపంలో మంచి బ్రదర్ దొరికాడు. లైఫ్‌లో నానిని ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటాను. సెట్‌కు వెళ్లగానే ఇద్దరం ఒకరిని ఒకరం చూసుకొని 20 నిమిషాలు నవ్వుకునే వాళ్లం. ఇది రిలీజ్ అయ్యాక ఆడియన్స్ కూడా అలానే నవ్వుతారు’ అన్నారు.ఈ సందర్భంగా సీనియర్ నటుడు నరేశ్ మాట్లాడుతూ.. ‘‘ దర్శకుడు జైన్స్ నాని ఈ కథ చెప్పగానే, రెండే రెండు మాటలు చెప్పా. ‘నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్’ అని చెప్పా. యూత్‌తో పాటు ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా చూడొచ్చు. ముఖ్యంగా మేనమామ, మేనల్లుడు కలిసి చూడ్సాల్సిన చిత్రమిది’ అన్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 17న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
ముద్దులు, బూతులు.. కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టీజర్
గతేడాది రిలీజైన 'క' సినిమాతో కిరణ్ అబ్బవరం.. చాన్నాళ్ల తర్వాత ఓ హిట్ అందుకున్నాడు. కానీ ఈ ఏడాది 'దిల్ రుబా'తో ఫ్లాప్ చవిచూశాడు. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటిలో ఒకటి 'కె ర్యాంప్'. జైన్స్ నాని అనే దర్శకుడు ఈ మూవీ తీస్తున్నాడు. దీపావళికి సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఒకటి రెండు బూతులు, లిప్ కిస్‌లతో యూత్‌ని ఆకట్టుకునేలానే ఉంది.(ఇదీ చదవండి: తమన్నా మరో ఐటమ్ సాంగ్.. వీడియో రిలీజ్)ఈ సినిమా షూటింగ్ అంతా కేరళలోనే తీసినట్లు టీజర్ బట్టి అర్థమైంది. టీజర్ బట్టి చూస్తే రొటీన్ స్టోరీలానే అనిపిస్తుంది కానీ కామెడీ కాస్త ఎక్కువగానే ఉండనుందని అనిపిస్తుంది. ఇందులో కిరణ్ సరసన యుక్తి తరేజా హీరోయిన్గా చేసింది. అక్టోబరు 18న మూవీ థియేటర్లలోకి రానుంది. మరి ఈసారి కిరణ్ ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: 'మిరాయ్' విలనిజం తెచ్చిన మెగా అవకాశం?)