చలసాని శ్రీనివాస్ అలా అనలేదు: డాక్టర్ కె.వెంకట్రావు
పిఠాపురం, న్యూస్‌లైన్: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మున్సిపల్ కల్యాణ మంటపంలో ‘తెలుగుజాతి విశిష్టత- విభజన వల్ల అనర్థాలు’ అంశంపై ఆదివారం జరిగిన చర్చాగోష్ఠిలో రాష్ట మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తన ప్రసంగంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, తెలంగాణ నేతలైన కేసీఆర్, కవిత, కోదండరాంలపై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని గోష్ఠి నిర్వాహకులు, శ్రీ సూర్యారాయ విద్యానంద గ్రంథాలయ పాలకవర్గ అధ్యక్షుడు డాక్టర్ కె. వెంకట్రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చలసాని తన ప్రసంగంలో పేర్కొనని వ్యాఖ్యానాలు వార్తలో చోటుచేసుకున్నాయని, అవి వాస్తవానికి విరుద్ధమని, ఇందుకు తాము చింతిస్తున్నామన్నారు.