చంద్రమోహన్, కె విశ్వనాథ్‌కు రిలేషన్.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
తెలుగు సినిమారంగంలో కళాతపస్విగా గుర్తింపు తెచ్చుకున్న కె.విశ్వనాథ్ చేసిన సేవలు ఎనలేనివి. ఆయన చివరి శ్వాస వరకు కళామతల్లికి సేవలందించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆయన కన్నుమూశారు. తాజాగా మరో సినీ దిగ్గజాన్ని టాలీవుడ్ కోల్పోయింది. దాదాపు 932 సినిమాల్లో నటించిన మరో కళామతల్లి ముద్దుబిడ్డ చంద్రమోహన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. దీంతో ఓకే ఏడాదిలో రెండు సినీ దిగ్గజాలను కోల్పోవడాన్ని తెలుగు సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కె. విశ్వనాథ్, చంద్రమోహన్ మధ్య రిలేషన్ ఏంటి? అసలు వీరిద్దరికీ ఉన్న బంధుత్వమేంటి? అనే వివరాలు తెలుసుకుందాం. అదే విధంగా ఎస్పీబాలుకు, వీరిద్దరికి బంధుత్వం ఎలా వచ్చిందో చూద్దాం.
(ఇది చదవండి: Chandra Mohan Death: విషాదం.. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత)
కె విశ్వనాథ్‌కి, సీనియర్ నటుడు చంద్రమోహన్‌తోనూ ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. శంకరాభరణం చిత్రానికి విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కించగా.. చంద్రమోహన్ కీలపాత్ర పోషించారు. ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే సూపర్ హిట్‌గా నిలిచి..జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఎస్పీ బాల సుబ్రమణ్యం పాటలు పాడారు. అయితే కె విశ్వనాథ్ 1966లో ఆత్మ గౌరవం అనే చిత్రంతో దర్శకుడిగా తెలుగు సినిమాకు పరిచయం కాగా.. అదే ఏడాది రంగులరాట్నం చిత్రంతో నటుడిగా చంద్రమోహన్ టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు.
(చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!)
పెదనాన్న కుమారుడే విశ్వనాథ్!
ఇదిలా ఉండగా మా పెదనాన్న కుమారుడే కె.విశ్వనాథ్ అని చంద్రమోహన్ చెప్పారు. తన అన్నయ్య విశ్వనాథ్ చనిపోయినప్పుడు పార్థివదేహాన్ని చూసి బోరున విలపించారు. చంద్రమోహన్ పెదనాన్న రెండో భార్య కొడుకు కె.విశ్వనాథ్ కాగా.. చంద్రమోహన్ తల్లి, కె.విశ్వనాథ్ తండ్రి మొదటి భార్య అక్కా చెల్లెల్లు కావడంతో వీరద్దరు అన్నదమ్ములు అవుతారు. వీరిద్దరి కాంబినేషన్లో సిరిసిరిమువ్వ, సీతామహాలక్ష్మి, శంకరాభరణం, సీతకథ చిత్రాలు వచ్చాయి. నాలో ఉన్న ప్రతిభను బయటికి తీసి అద్భుతమైన నటుడిగా తీర్చిదిద్దింది ఆయనేనని చంద్రమోహన్ గతంలో వెల్లడించారు.
గతంలో కె. విశ్వనాథ్ గురించి చంద్రమోహన్ మాట్లాడుతూ..'సినిమా బంధం కంటే మా ఇద్దరి మధ్య కుటుంబ బాంధవ్యమే ఎక్కువ. అందరికంటే నేను ఆయనకు చాలా దగ్గరివాడిని. మద్రాసులో ఉన్నప్పుడు ఒకేచోట స్థలం కొనుకున్నాం. పక్క పక్కనే ఇళ్లు కూడా కట్టుకుని 25 ఏళ్ల ఉన్నాం. అంతటి అనుబంధం మాది' అని అన్నారు.
ఎస్పీ బాలుతోనూ బంధుత్వం
సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యంతోనూ వీరిద్దరి బంధుత్వం ఉంది. చంద్రమోహన్ బావమరిది చెల్లిని ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నయ్య పెళ్లి చేసుకున్నారు. అలా వీరి మధ్య కూడా అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది. ఇలా అనుకోకుండా ముగ్గురికి కుటుంబాల పరంగా మంచి అనుబంధం ఉంది. చివరికీ వరుసకు ముగ్గురు అన్నదమ్ములు కావడం మరో విశేషం. వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన శంకరాభరణం సినిమా ఇండస్ట్రీలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది.
👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)