విద్యార్థులను ఉత్సాహపరిచేందుకే ‘కళా ఉత్సవ్’
ఖమ్మం: విద్యార్థులకు కళారంగాల పట్ల ఆసక్తి పెంచేందుకు, వారిని ఉత్సాహపరిచేందుకు కళాఉత్సవ్ ఉపయోగపడుతుందని డీఈఓ నాంపల్లి రాజేష్ తెలిపారు. కేంద్ర మానవ వనవరుల అభివద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం డైట్ కళాశాలలో కళాఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఈ కళా ఉత్సవాలు గ్రామీణ స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు నిర్వహించబడుతున్నాయని, పాఠశాల, కళాశాలల్లో చదివే విద్యార్థులు వీటిలో పాల్గొనవచ్చునని చెప్పారు. జిల్లాలో 9, 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నారు. సమాచార శాఖ ఏడీ మహ్మద్ ముర్తుజా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ఆయా కళల పట్ల ఆసక్తి పెంపొందించుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. జిల్లాలో జరిగే కళోత్సవాలలో పాల్గొనే విద్యార్థులు జాతీయస్థాయిలో గుర్తింపు పొందాలన్నారు. డైట్ ప్రిన్సిపాల్ బస్వారావు మాట్లాడుతూ కళోత్సవాలలో నత్యం, గానం, చిత్రలేఖనం, నాటకరంగాల గిరిజన సంస్కతి సంప్రదాయాలపై ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో మొదటి స్థానం పొందిన వారిని రాష్ట్రస్థాయికి పంపించనున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మం ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ క్రాఫ్ట్, పీఈటీ టీచర్లను, విద్యావలంటీర్లను నియమించనున్నట్లు తెలిపారు. అనంతరం గానం, నాటికలు ప్రదర్శించారు.