breaking news
kaantha Movie
-
కాంత వాయిదా
‘కాంత’ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ భోర్సే హీరో హీరోయిన్లుగా సముద్ర ఖని ఓ కీలక పాత్రలో నటించిన పీరియాడికల్ చిత్రం ‘కాంత’. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లుగా గతంలో చిత్రయూనిట్ పేర్కొంది. కానీ ఆ తేదీకి విడుదల చేయడం లేదని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని గురువారం చిత్రయూనిట్ ఓ నోట్‌ను విడుదల చేసింది. ‘‘కాంత’ సినిమా టీజర్ విడుదలైనప్పట్నుంచి మీరు చూపించిన ప్రేమ, ఆ ప్యాయత, మద్దతు మా హృదయాలను హత్తుకుంది. ఈ చిత్రానికి సంబంధించి మీకు మరింత మెరుగైన అనుభూతిని ఇవ్వాలనుకుంటున్నాం. ఆ దృష్ట్యా విడుదలను వాయిదా వేశామని తెలియజేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’’ అని ‘కాంత’ చిత్రం యూనిట్ పేర్కొంది. -
Bhagyashri Borse: ‘కాంతా’తో వెలిగిపోతుందా?
ప్రతిభ ఎక్కడున్నా ప్రోత్సహిస్తుంది సినిమా. ముఖ్యంగా నటీమణులకు అవకాశాలు తలుపుతడతాయి. అందుకు కొంచెం అందం, కాస్త అదృష్టం ఉంటే చాలు, ఇండియన్ సినిమానే ఏలేయవచ్చు. అలా యువ కథానాయకి భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్‌పై కన్నేశారనే చెప్పవచ్చు. 26 ఏళ్ల ఈ మహారాష్ట్రీ పరువాల బ్యూటీ 2023లోనే నటిగా తెరంగ్రేటం చేశారు. అలా ముందుగా హిందీలో నటించిన భాగ్యశ్రీ బోర్సేకు వెంటనే టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. అక్కడ రవితేజకు జంటగా మిస్టర్ బచ్చన్ నటించారు. ఈ చిత్రం విజయాన్ని సాధించకపోకపోయినా ఈ అమ్మడు మాత్రం డాన్స్, అందాలారబోతలతో పాపులర్ అయ్యారు. తరువాత కింగ్డమ్లో విజయ్ దేవరకొండ సరసన నటించారు. ఆ చిత్రం సక్సెస్ అయ్యింది. ఇప్పుడు కాంతా అనే బహుభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో దుల్కర్సల్మాన్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్పిరిట్ మీడియా సంస్థ, వేఫారర్ ఫిలింస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాంతా చిత్రం కన్నడం, తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. ప్రతిభావంతులైన చిత్ర టీమ్‌తో కలిసి నటిస్తున్న కాంతా వంటి చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయం కావడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ చిత్రంలోని భాగ్యశ్రీబోర్సే ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించిన ఈమె గెటప్ పలువురిని ఆకట్టుకుంది. ఈ భామ కోలీవుడ్‌లో ఏమాత్రం రాణిస్తారో వేచి చూద్దాం.