Kaathal The Core Movie
-
గే పాత్రలో మమ్ముట్టి.. సైలెంట్‌గా ఓటీటీలోకి..
ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ముందువరుసలో ఉంటాడు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. ఆరు పదుల వయసులో విభిన్న కథాంశాలను సెలక్ట్ చేసుకుంటూ ప్రేక్షక, సినీ ప్రియులను అలరిస్తున్నాడు. ఇటీవల ఈయన నటించిన ప్రయోగాత్మక సినిమా 'కాదల్: ది కోర్'. జియో బేబి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జ్యోతిక హీరోయిన్గా నటించింది. ఇందులో మమ్ముట్టి స్వలింగ సంపర్కుడి(గే)గా కనిపిస్తాడు. దీంతో విడుదలకు ముందు ఈ సినిమాపై వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా కథ హోమో-సెక్సువాలిటీని ప్రోత్సహించేలా ఉందంటూ కువైట్, ఖతార్ దేశాలు కాదల్: ది కోర్ చిత్రాన్ని బ్యాన్ చేశాయి. అయితే ఈ విమర్శలను దాటుకుంటూ నవంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఘనవిజయం సాధించింది. తాజాగా ఈ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి అయితే తెచ్చారు కానీ దీన్ని ఫ్రీగా చూసే వీల్లేదు. ఈ మూవీ చూడాలంటే అద్దె చెల్లించాల్సిందే! ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన ఓటీటీలో రిలీజ్ చేశారు. మరి ఉచితంగా ఎప్పుడు అందుబాటులోకి తెస్తారో చూడాలి! #KaathalTheCore available for Rental in AMAZON PRIME. pic.twitter.com/E3c2ypE8j5 — Christopher Kanagaraj (@Chrissuccess) January 4, 2024 చదవండి: హీరో కూతురి పెళ్లి.. 8 కి.మీ. జాగింగ్ చేసుకుంటూ వెళ్లిన వరుడు -
హోమో సెక్సువల్ పాత్రలో స్టార్ హీరో.. ఆ రెండు దేశాల్లో బ్యాన్!
ఆరు దశాబ్దాల వయసు దాటినా.. ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న అతికొద్ది మంది హీరోల్లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక్కరు. ఈ వయసులో కూడా ఆయన డిఫరెంట్ చిత్రాలతోనే ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా ఈ మెగాస్టార్ నటించిన మరో ప్రయోగాత్మక చిత్రం ‘కాథల్-ది కోర్’. జీయో బేబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమ్ముట్టికి జోడీగా జ్యోతిక నటించింది. నవంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదలకు కొద్ది రోజుల ముందే ఈ చిత్రానికి ఊహించని షాక్ తగిలిగింది. ఈ మలయాళ చిత్రాన్ని రెండు దేశాలు నిషేధించాయి. ఈ సినిమా కథ స్వలింగ సంపర్కాన్ని(హోమో-సెక్సువాలిటీ)ప్రోత్సహించేలా ఉందని కువైట్, ఖతార్ దేశాలు బ్యాన్ చేశాయి. ‘కాథల్-ది కోర్’ కథేంటి? ఈ చిత్రాన్ని త్వరలోనే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలో ప్రదర్శించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ పత్రిక..ఈ చిత్రం కథని క్లుప్తంగా వివరిస్తూ వార్తను ప్రచురించింది. దాని ప్రకారం.. కో ఆపరేటివ్ బ్యాంకులో పని చేసి రిటైర్ అయిన జార్జ్(మమ్ముట్టి).. భార్య ఓమన(జ్యోతిక)తో కలిసి తీకోయ్ అనే చిన్న ఊళ్ళో నివసిస్తుంటాడు. అతను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. (చదవండి: వారి వల్ల నా ఫ్యామిలీలో పక్కన పెట్టేశారు.. చనిపోదామనుకున్న అంటూ యమున ఆవేదన) నామినేషన్ వేసిన తర్వాత..అతని భార్య ఓమన హఠాత్తుగా విడుకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతుంది. అదే గ్రామంలో డ్రైవింగ్ స్కూల్ నడిపే వ్యక్తితో జార్జ్ స్వలింగ సంపర్క బంధం కొనసాగిస్తున్నాడని ఆమె ఆరోపిస్తుంది. జోసెఫ్ మాత్రం తీవ్రంగా ఖండిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎన్నికల్లో జార్జ్ పోటీ చేశాడా? లేదా? విడాకుల విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం చూసే తీరును ఇందులో చూపించినట్లు ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు చెప్పారు. దీంతో కువైట్, ఖతార్ దేశాలు ఈ చిత్రాన్ని బహిష్కరించాయి.