కబాలి విమానం సీక్రెట్ ఇదే..
విడుదలకు ముందే సంచలనం సృష్టించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కబాలికి సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి. బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లు సాధిస్తున్న కబాలిని రిలీజ్‌కు ముందు ప్రమోట్ చేయడానికి, రజనీ క్రేజ్‌ను ఉపయోగించుకోవడానికి కార్పొరేట్ కంపెనీలు పోటీపడ్డ సంగతి తెలిసిందే. రజనీ అభిమానులను ఎక్కువగా ఆకర్షించింది మాత్రం కబాలి విమానం.
మలేసియాకు చెందిన ఎయిర్ఏషియా సంస్థ కబాలి పేరుతో ఓ విమానాన్ని నడిపింది. ఆ విమానంపై సూపర్ స్టార్ రజనీ పేరును ఇంగ్లీషులో రాయించడంతో పాటు కబాలి సినిమాలోని రజనీ పోస్టర్లను భారీ సైజులో వేయించింది. గతంలో ఏ భారతీయ హీరోకు కూడా ఇంతటి గౌరవం దక్కలేదు. ఇలా రజనీ ఖ్యాతి ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఇంతకీ కబాలి విమానంపై ఎలా పెయింట్ వేశారు, ఇందుకోసం ఎంతమంది పనిచేశారనే విషయాన్ని ఎయిర్ఏషియా వెల్లడించింది. దీనికి సంబంధించి విడుదల చేసిన వీడియో యూ ట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది.
కబాలి బ్రాండ్ విమానం కోసం 300కు మందికిపైగా టెక్నిషియన్లు పనిచేశారు. రజనీ ఫొటోలు, పేరుతో రంగుల్లో కబాలి విమానం కనిపించేలా చేయడానికి దాదాపు 200 గంటలు పనిచేశారు. కబాలి విమానం వెనుక ఇంతమంది శ్రమ దాగుంది.