రజనీని ఆకట్టుకున్న అభిమాని
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. రజనీ సినిమా విడుదలవుతుంటే చాలు ఆయన కటౌట్లకు పాలాభిషేకాలు కామన్. ఇక రజనీ పుట్టినరోజు వేడుకల గురించైతే చెప్పక్కర్లేదు. ఆయనకు అభిమానులు ఉన్నారని అనడం కంటే భక్తులు ఉన్నారంటే బావుంటుందేమో.
అంతటి సూపర్ స్టార్‌ని చూడాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఆ అవకాశం అందరికీ రాదు. అలాంటిది స్వయంగా సూపర్ స్టారే ఆహ్వానిస్తే..? దాన్నే అదృష్టం అంటారు కదా. అదే జరిగింది ఓ మహిళా అభిమాని విషయంలో. తనను కలిసి వెళ్లమని స్వయంగా తలవైనా ఆమెకు కబురు పంపించారు.
'కబాలి' సినిమాలోని డైలాగులను చెప్తూ తీసిన వీడియోలతో రజనీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అలానే ఓ మహిళ కూడా 'కబాలి రా' డైలాగ్‌ను కొద్దిగా మార్చి.. తను స్వతంత్రంగా జీవించే మోడ్రన్ గృహిణినంటూ రజనీ స్టైల్లో చెప్పిన ఓ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఆ వీడియో చూసి ముగ్థుడైన సూపర్ స్టార్ ఆమె వివరాలు తెలుసుకుని, తన ఫామ్ హౌస్‌కి ఆహ్వానించి అభినందించారు. ఇక ఆమె ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.