కడపలో రూ. 13 లక్షలు స్వాధీనం
కడప నగరంలోని కోటిరెడ్ది సర్కిల్ వద్ద గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్నోవా కారులో తరలిస్తున్న రూ.13 లక్షల నగదుతోపాటు 20 కేజీల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నగదుతోపాటు వెండిని పోలీసులు సీజ్ చేసి కారును పోలీసు స్టేషన్కు తరలించారు. స్వాధీనం చేసుకున్న నగదుపై పోలీసులు కారు డ్రైవర్ను ప్రశ్నించారు. అతడు పొంతన లేని సమాధానాలు వెల్లడించాడు. దాంతో పోలీసులు డ్రైవర్ను అదుపుకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.