నేడు సమైక్య గర్జన
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమబాట పడుతున్నారు. బుధవారం కడప స్టేట్‌గెస్ట్‌హౌస్‌లో మహిళా ఉద్యోగులు సమావేశం ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు నడుంబిగించాలని నిర్ణయించారు. గురువారం ఉదయం 9.30గంటలకు కోటిరెడ్డి సర్కిల్ నుంచి పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించాలని తీర్మానించారు. అలాగే మానవహారాలు, అమరజీవి పొట్టిశ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద నివాళులు అర్పించాలని నిర్ణయించారు.
భవిష్యత్తులో కూడా మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేందుకు వీలుగా జిల్లా మహిళా ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఈ సంఘానికి ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ లీలావతి అధ్యక్షురాలిగా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిణి ఉపాధ్యక్షులుగా, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అసోసియేట్ అధ్యక్షులుగా, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ ప్రతిభా భారతి కార్యదర్శిగా, రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమాదేవి సంయుక్త కార్యదర్శిగా, స్టెప్ సీఈఓ మమత ట్రెజరర్‌గా, మరో 13 మంది కార్యనిర్వాహక సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.