kadiri temple
-
వైభవంగా కదిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
-
ఖాద్రీశుని దర్శించుకున్న కర్ణాటక మంత్రి
కదిరి : కర్ణాటక రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి క్రిష్ణప్ప దంపతులు ఆదివారం తమ ఇలవేల్పు అయిన కదిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులను ఎండవేడిమి నుండి కాపాడేందుకు ఆలయ ప్రాంగణం మొత్తం షెడ్లు వేయించేందుకు అయ్యే ఖర్చు తాను భరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి, పాలకమండలి సభ్యులు ఇద్దే రఘునాథరెడ్డి, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కాటమరాయుడికే శఠగోపం
- భక్తుల విరాళాలు కొందరి జేబుల్లోకి.. - ప్రతినెలా రూ.15 లక్షల దాకా స్వాహా కదిరి : ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి సొమ్మును కొందరు ఇంటి దొంగలు కాజేస్తున్నారు. భక్తులు విరాళాల రూపంలో ఇచ్చే మొత్తంలో సగం మాత్రమే స్వామివారి ఖాతాకు జమచేస్తూ.. మిగిలిన దాన్ని తమ జేబుల్లోకి వేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇలా రోజుకు రూ.50 వేల చొప్పున నెలకు రూజ15 లక్షల దాకా శ్రీవారి ఆదాయానికి గండి కొడుతున్నట్లు తెలుస్తోంది. ఖాద్రీ నృసింహుని దర్శనానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. కేవలం హుండీల ద్వారానే ఆలయానికి రోజుకు రూ. లక్ష దాకా ఆదాయం వస్తోంది. ఆలయంలోని నిత్యాన్నదాన సత్రంలో భోజనం చేసే ప్రతి భక్తుడూ తమ స్తోమతకు తగ్గట్టు ఎంతోకొంతో విరాళాన్ని అందజేస్తుంటారు. భక్తుల నుంచి తీసుకునే ఈ విరాళాలకు ఆలయ సహాయ కమిషనర్ కేటాయించిన సిబ్బంది అక్కడికక్కడే రసీదులు కూడా ఇస్తుంటారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత పాలక మండలి సభ్యులు కొందరు ఏకంగా బిల్లు పుస్తకాలను చేతబట్టుకొని భక్తుల నుంచి నేరుగా విరాళాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలొస్తున్నాయి. అనంతపురంలోని కొవ్వూరు నగర్‌కు చెందిన ఎం.సూర్యనారాయణరెడ్డి అనే భక్తుడు గత ఏడాది ఆగస్టు మూడో తేదీన శ్రీవారిని దర్శించుకుని.. నిత్యాన్నదానం కోసం రూ.40 వేల విరాళమిచ్చారు. ఈ మొత్తాన్ని తీసుకున్న పాలక మండలి సభ్యుడొకరు నిత్యాన్నదాన పథకం పుస్తకం నుంచి ఒరిజినల్ రసీదు(నెం.75921) ఇచ్చారు. ఆ రశీదు తీసుకొని ఆ భక్తుడు Ððవెళ్లిపోయారు. కాకపోతే రశీదు రాసేటప్పుడు కింద కార్బన్ పేపర్ పెట్టనందున ఆ భక్తుడి వివరాలేవీ అందులో నమోదు కాలేదు. ఆ డబ్బు మాత్రం రశీదు రాసిన ఆలయ కమిటీ సభ్యుడి జేబులోకి వెళ్లింది. అదే రశీదు నంబర్ కార్బన్ కాపీలో విరాళమిచ్చిన ఆ భక్తుడి పేరు కూడా మార్చేసి ఆర్.రాధాక్రిష్ణ అని రాశారు. కేవలం 48 కిలోల బియ్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై ‘సాక్షి’ నిఘా పెట్టిందన్న విషయం తెలుసుకున్న సదరు సభ్యుడుఽ 75901 సీరియల్ నంబర్‌తో నకిలీ బిల్లు బుక్కు ముద్రించి.. అందులో 75921 రశీదు నంబర్లో గతంలో ఏ భక్తుడైతే రూ.40 వేలు ఇచ్చారో అదే విషయం కనబరిచారు. ఈ మొత్తాన్ని స్వామివారి ఖాతాలో జమ చేసినట్లు రికార్డుల్లో రాసుకున్నారు. విచారణ చేపడతాం –వెంకటేశ్వరరెడ్డి, ఆలయ సహాయ కమిషనర్ అన్నదానం కోసం భక్తులు సమర్పిస్తున్న విరాళాల్లో గోల్మాల్ జరుగుతున్న విషయం ఇప్పటిదాకా నా దృష్టికి రాలేదు. సదరు బిల్లు పుస్తకం పరిశీలిస్తాం. నిజమని తేలితే తగు చర్యల కోసం పై అధికారులకు నివేదిస్తాం. -
కదిరి తేరు చూతము రారండి
- దేశంలో మూడవది, రాష్ట్రంలోనే అతి పెద్ద బ్రహ్మరథం - 3 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా - ఆలయ ప్రాంగణంలో పోటెత్తిన భక్త జనం కదిరి (అనంతపపురం) : అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మ రథోత్సవం గురువారం అశేష భక్తజన సందోహం మధ్య సరిగ్గా ఉదయం 8.15గంటలకు ప్రారంభం కానుంది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉత్సవం ఇది. ఇప్పటికే ఆలయ ప్రాంగణంతో పాటు తిరు వీధుల గుండా ఉన్న భవనాలు భక్తులతో కిటకిటలాడి పోతున్నాయి. ఆలయ ప్రాంగణంలో కాలు మోపేందుకు చోటు లే దు. బ్రహ్మోత్సవాల్లో నారసింహుడు తిరు వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించడానికి దేవతలు తమ తమ వాహనాలను పంపుతారని భక్తుల నమ్మకం. సాక్షాత్తు బ్ర హ్మదేవుడే శ్రీవారి రథోత్సవం నాడు రథాన్ని నడిపి స్వామి వారు విహరించడానికి సహకరిస్తారని, అందుకే బ్రహ్మ రథోత్సవం అంటారని ప్రధాన అర్చకులు పార్థసారథిచార్యులు, నరసింహాచార్యులు చెబుతున్నారు. తెల్లటి ఐరావతంపై బుధవారం రాత్రి విహరించిన శ్రీవారు తిరిగి యాగశాలను చేరుకొని, తెల్లవారుజామున రథారోహణం గావిస్తారు. శ్రీదేవి, భూదేవిలను కంకణ భట్టాచార్యులు తీసుకొని వస్తారు. శ్రీదేవి భూదేవిల సమేతంగా బ్రహ్మ రథంపై శ్రీవారు లక్షలాది మంది భక్తాదులకు దర్శన భాగ్యం కల్గిస్తారు. దేశంలోనే అతిపెద్ద తేరు : నేటి రథోత్సవంలో ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు భారీ బ్రహ్మ రథంపై కొలువు దీరి తిరువీధుల్లో భక్తులకు దర్శన మివ్వనున్నారు. తమిళనాడు అండాల్ అమ్మవారి శ్రీ వల్లి పుత్తూరు రథం, తంజావూర్ జిల్లాలోని తిరువార్ రథం తర్వాత దేశంలో అతిపెద్ద రథంగా కదిరి తేరు ప్రసిద్ధి చెందింది. రాష్ట్రంలో అతిపెద్ద బ్రహ్మ రథం ఇదే. ఈ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది. రథంలోని పీఠం వెడ ల్పు 16 అడుగులు. 120 ఏళ్ల క్రితం తయారు చేసిన రథం చక్రాలు ఒక అడుగు, ఒక అంగుళం వెడల్పుతో పాటు 8 అడుగుల డయామీటర్‌తో ఉన్నాయి. ఇవి 4 ఏళ్ల క్రితం బ్రహ్మ రథోత్సవం నాడు మరమ్మతుకు రావడంతో వీటి స్థానంలో 2 సంవత్సరాల క్రితం జరిగిన బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఆధ్వర్యంలో కొత్త చక్రాలను అమర్చారు. రథంపై సుమారు 256 శిల్ప కళాకృతులను టేకుతో అందంగా చెక్కారు. వివిధ భంగిమల్లో చెక్కిన ఈ బొమ్మలు అప్పటి శిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనం. పోటెత్తిన భక్తజనం : ఖాద్రీ లక్షీ్ష్మ నారసింహుని బ్రహ్మ రథోత్సవాన్ని చూడడానికి రాష్ట్ర నలుమూలలనుండే కాక పొరుగు రాష్ట్రాలైనా కర్ణాటక , తమిళనాడు నుండి బుధవారం పగలే పెద్ద ఎత్తున భక్తాదులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం కాలు మోపేందుకు చోటులేక భక్త జనంతో పోటెత్తింది. ఆలయంలోని అద్దె గదులతో పాటు పట్టణంలోని అన్ని లాడ్జిలలో గదులు ఖాళీ లేవనే సమాధానమే భక్తులకు ఎదురవుతోంది. నెల రోజులకు ముందే లాడ్జిలలో గదులు బుక్ చేసుకున్నారు. చేసేది లేక భక్తులు ఆలయ ప్రాంగణంలోనే కటిక నేలపై నిద్రించడం కన్పించింది. ఆలయ ప్రాంగణంలో భక్తుల కాలక్షేపం కోసం పగలు, రాత్రి తేడా లేకుండా హరికథలు, బుర్రకథలతో పాటు పలు సాంసృ్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.