ఖాద్రీశుని దర్శించుకున్న కర్ణాటక మంత్రి
కర్ణాటక రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి క్రిష్ణప్ప దంపతులు ఆదివారం తమ ఇలవేల్పు అయిన కదిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
కదిరి : కర్ణాటక రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి క్రిష్ణప్ప దంపతులు ఆదివారం తమ ఇలవేల్పు అయిన కదిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులను ఎండవేడిమి నుండి కాపాడేందుకు ఆలయ ప్రాంగణం మొత్తం షెడ్లు వేయించేందుకు అయ్యే ఖర్చు తాను భరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి, పాలకమండలి సభ్యులు ఇద్దే రఘునాథరెడ్డి, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.