kadiri town
-
వీఆర్‌కు కదిరి టౌన్ ఎస్ఐ రాజేష్?
కదిరి: కదిరి పట్టణ ఎస్ఐ రాజేష్‌ను వీఆర్‌కు పంపినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... పేకాటరాయుళ్లతో ఎస్ఐ చేతులు కలిపారని, మహిళల పట్ల ప్రవర్తన సరిగా ఉండదని ఎస్పీకి ఫోన్ ద్వారా ఫిర్యాదులు అందాయి. సీరియస్‌గా పరిగణించిన ఎస్పీ అశోక్‌కుమార్ సదరు ఎస్ఐని వీఆర్‌కు పంపారు. తిరుపతిలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల బందోబస్త్ విధులకు ఈయనను పంపే ముందే ఈ చర్య తీసుకున్నారు. అయితే పోలీసులు అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. -
కదిరిలో క్రికెట్ బెట్టింగ్వీరులు అరెస్ట్
అనంతపురం : అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో 13 మంది క్రికెట్ బెట్టింగ్వీరులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.90 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కదిరి పట్టణంలోని ఓ ఇంట్లోని వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సదరు నివాసంపై దాడి చేసి.... వారిని అదుపులోకి తీసుకున్నారు.