కదిరి: కదిరి పట్టణ ఎస్‌ఐ రాజేష్‌ను వీఆర్‌కు పంపినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... పేకాటరాయుళ్లతో ఎస్‌ఐ చేతులు కలిపారని, మహిళల పట్ల ప్రవర్తన సరిగా ఉండదని ఎస్పీకి ఫోన్ ద్వారా ఫిర్యాదులు అందాయి. సీరియస్‌గా పరిగణించిన ఎస్పీ అశోక్‌కుమార్ సదరు ఎస్‌ఐని వీఆర్‌కు పంపారు. తిరుపతిలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల బందోబస్త్ విధులకు ఈయనను పంపే ముందే ఈ చర్య తీసుకున్నారు. అయితే పోలీసులు అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.