భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అందులోభాగంగా బీహార్ కైమూర్ జిల్లాలో వాహనంలో తరలిస్తున్న పేలుడు పదార్థాలను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
అయితే వాటిని అక్రమ మైనింగ్ కోసం తీసుకువెళ్తున్నట్లు తమ అదుపులోకి తీసుకున్న వ్యక్తి వెల్లడించారని జిల్లా ఎస్పీ రత్న మణి సంజీవ్ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి నుంచి దాదాపు 12 వేల డిటోనేటర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.