ట్యాంక్‌బండ్‌పై కాకా విగ్రహావిష్కరణ
హైదరాబాద్ : దివంగత కాంగ్రెస్ నేత జి.వెంకటస్వామి (కాకా) విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ట్యాంక్‌బండ్‌పై ఆవిష్కరించారు. ట్యాంక్ బండ్ ఆరంభంలో ఉన్న అంబేద్కర్ పార్క్‌లో కాకా విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ కోసం కాకా చివరిదాకా పరితపించారన్నారు. కాకా సేవలను గుర్తు చేసుకున్నారు.
విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరోవైపు కాకా విగ్రాహావిష్కరణను నిరసిస్తూ తెలంగాణ ఎమ్మార్పీఎస్ నేతలు నిరసనకు దిగారు. దీంతో ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు.