డెప్యూటీ సీఎం ‘కడియం’కు వినతులు
తిమ్మాపూర్ : తిమ్మాపూర్, మానకొండూర్ మండలాల పరిధిలో జరుగుతున్న కాకతీయ కాలువల ఆధునికీకరణ పనులను పరిశీలించేందుకు డెప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సోమవారం వచ్చారు. ఈ సందర్భంగా ఎల్ఎండీ గెస్ట్‌హౌస్‌లో ఎస్సారెస్పీ అధికారులతో సమావేశమై కాల్వ ఆధునికీకరణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి వివిధ సమస్యలపై పలువురు వినతిపత్రాలు సమర్పించారు. తిమ్మాపూర్ మండలంలో మహిళా డిగ్రీ కళాశాల మంజూరు చేయూలంటూ జెడ్పీటీసీ పద్మ, ఎంపీపీ ప్రేమలత, సర్పంచ్ స్వరూప వినతిపత్రం ఇవ్వగా... స్థలం ఇస్తే మంజూరు ఇప్పిస్తానని హామీచ్చారు. జీతాలు పెంచాలని వీఆర్ఏలు డెప్యూటీ సీఎంకు వినతిపత్రం సమర్పించారు.
దీనిపై పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి శాసనసభలో మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు హర్షణీయమని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం(ఎస్జీటీయూ) జిల్లా అధ్యక్షుడు కరివేద మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.